EastGodavari

News May 9, 2024

తూ.గో.: ప్రలోభాలు షురూ

image

ఎన్నికల పోలింగ్‌కు సమయం ముంచుకొస్తుండటంతో రాజకీయ నాయకులు  ఓటర్లను ఆకట్టుకోవడానికి తాయిలాలకు తెర లేపుతున్నారు. పగలు ప్రచారం చేసి రాత్రిళ్లు నగదు పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గాలను ఎంచుకొని వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.  – మీ వద్ద జరుగుతోందా..?

News May 9, 2024

పిఠాపురానికి రేపు పవన్.. ఎల్లుండి జగన్

image

ప్రచార గడువు ముగిసే సమయం దగ్గరపడుతుండటంతో పిఠాపురంలో రాజకీయం హీటెక్కింది. ఈ క్రమంలో రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ రోడ్‌షో చేపట్టనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 మండలాలు, 2 మున్సిపాలిటీలు కవర్ అయ్యేలా ప్లాన్ చేశారు. భారీ బహిరంగ సభ సైతం ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ ఎల్లుండి పిఠాపురంలో ప్రచార ముగింపు సభ నిర్వహించనున్నారు.

News May 9, 2024

తూ.గో.: పిడుగులు పడతాయి జాగ్రత్త

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గురువారం రాష్ట్ర విపత్తుల నివారణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పెద్దాపురం, సామర్లకోట, కాకినాడ, బిక్కవోలు, రాజమండ్రి ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు మెసే‌జ్‌లు పంపింది. 

News May 9, 2024

తూ.గో: వరుస సెలవులు.. రైళ్లు ఫుల్

image

హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే రైళ్లలో రిజర్వేషన్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 11న రెండో శనివారం, 12న ఆదివారం, ఎన్నికలు కారణంగా 13న సోమవారం సెలవులు కావడంతో ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడినవారంతా తిరిగి స్వగ్రామాలకు చేరుతున్నారు. ఉమ్మడి జిల్లావాసులు హైదరాబాద్‌కి ఎక్కువగా రాకపోకలు సాగించే గోదావరి, ఫలక్‌నుమా, గౌతమి ఎక్స్‌ప్రెస్‌ల్లో 400కు పైగా వెయిటింగ్‌ లిస్ట్‌ ఉన్నాయి.

News May 9, 2024

తూ.గో: ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు పెంపు

image

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షకు ఫీజు చెల్లించేందుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఉందని రాజమహేంద్రవరం ఇంటర్మీడియట్ బోర్డ్ ఆర్ఐసీహెచ్వీఎస్ నరసింహం బుధవారం తెలిపారు. అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు పదో తేదీ వరకు మాత్రమే గడువు ఉందన్నారు. తత్కాల్ స్కీంలో ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలని కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News May 9, 2024

తూ.గో: ఈ నెల 11 నుంచి మూతపడనున్న మద్యం షాపులు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ నుంచే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మద్యం ప్రియుల్లో హైరానా మొదలైంది. దీంతో ఇప్పటి నుంచే మందుబాబులు జాగ్రత్త పడుతున్నారు. కాకినాడ జిల్లాలో 157 మద్యం దుకాణాలు, 21 బార్లు ఉన్నాయి. తూ.గో జిల్లాలో 145 మద్యం దుకాణాలు, 27 బార్లు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 100 మద్యం దుకాణాలు, ఆరు బార్లు ఉన్నాయి.

News May 9, 2024

పిఠాపురంలో ఈనెల 10న పవన్ రోడ్‌షో

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 10న పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. కాగా అదే రోజు సీఎం జగన్ సభ ఉండడంతో మొదట అనుమతికి ఇవ్వడానికి ఆలోచించిన అధికారులు జగన్ సభ వాయిదా పడడంతో పవన్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో శుక్రవారం ఉదయం 10గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రోడ్ షో ఉండనున్నట్లు మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు.

News May 9, 2024

తూ.గో: ఇద్దరికీ 117 మార్కులు.. కవలల ప్రతిభ

image

పాలీసెట్ ఫలితాల్లో మామిడికుదురు మండలం మాకనపాలెం గ్రామానికి చెందిన కవలలు భూపతి శ్రీ నిశాంత్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించాడు. అతని సోదరుడు భూపతి శ్రీనిహాంత్ రెండో ర్యాంకు సాధించాడు. నిశాంత్ రాష్ట్ర స్థాయిలో 71, నిహాంత్ 87వ ర్యాంకు సాధించారు. ఇద్దరికీ సమానంగా 117 మార్కులు వచ్చాయి. పదో తరగతి పరీక్షల్లో ఇద్దరు తెలుగు, మాథ్స్, సోషల్ సబ్జెక్టులో 100 మార్కులు రావడం విశేషం.

News May 9, 2024

వదినమ్మ గెలుపు కోసం ఆడపడుచు ప్రచారం

image

ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజాకు మద్దతుగా తన ఆడపడుచు ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ కూటమి మేనేఫెస్టోలో పేర్కొన్న అంశాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News May 8, 2024

అనారోగ్యంతో ఏఎస్సై మృతి

image

రంపచోడవరం నియోజకవర్గం చింతూరులో ఏఎస్సైగా పని చేస్తున్న ఎన్.కుశలన్నదొర అనారోగ్యంతో మృతి చెందారని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. కొన్ని రోజుల క్రితం విధి నిర్వహణలో ఉండగా… ఆయనకు ఫీట్స్ వచ్చి అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి కాకినాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. ఆయన స్వగ్రామం గంగవరం మండలం లొద్దిపాలెం అని తెలిపారు.

error: Content is protected !!