India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బూరుగుపూడి నుంచి జగ్గంపేట వైపు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సడెన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి డివైడర్‌పై పడి, తలకు బలమైన గాయమవడంతో వ్యక్తి స్పాట్‌లోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్వల్ప గాయాలైన కుమారుడిని హైవే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
1962 నాటికి రాజోలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అప్పుడు గడ్డం మహలక్ష్మి 30,460 ఓట్లతో కాంగ్రెస్ MLA గా గెలిచారు. అదే సమయంలో పక్క నియోజకవర్గం నగరంలో మామిడికుదురుకు చెందిన నయినాల గణేశ్వరరావు కూడా విజయం సాధించారు. 1967 ఎన్నికల్లో రాజోలు జనరల్‌గా, నగరం ఎస్సీ నియోజకవర్గంగా మారిపోయాయి. దీంతో మహాలక్ష్మిని నగరం నుంచి, గణేశ్వరరావును రాజోలు నుంచి కాంగ్రెస్ బరిలో దింపగా.. అప్పుడూ ఇద్దరు గెలిచారు.
కాకినాడ జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5-18 ఏళ్లలోపు బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రధానం చేసేందుకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని ఐసీడీఎస్ ప్రాజెక్టు కో డైరెక్టర్ ప్రవీణ మంగళవారం తెలిపారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, ధైర్య సాహసాలు, పర్యావరణం, క్రీడలు, సాహిత్యం, సంగీతం, నృత్యం తదితర వాటిలో ప్రతిభ చూపిస్తున్న బాలలు జూలై 31 లోగా ఆన్లైన్ దరఖాస్తులు పంపాలన్నారు.
వైసీపీలో చేరిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఆమె కుమార్తె క్రాంతి వ్యవహారం సొంత జిల్లాలో రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. సొంత కూతురే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడంతో వైసీపీలో కలవరం మొదలయ్యింది. పిఠాపురంలో వైసీపీ విజయానికి కలసివస్తారని భావించిన ముద్రగడ ఇప్పడు తమకు ఇబ్బందికరంగా మారడంతో వంగా గీతా వర్గం డైలమాలో పడినట్లు తెలుస్తోంది.
తూ.గో జిల్లాలో ఎన్నికల్లో అభ్యర్థుల విజయంపై పందేలు కడుతున్నారు. మండల స్థాయిలో మెజార్టీలు నుంచి రాష్ట్రస్థాయిలో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందన్న విషయంపై పందేలకు తెరలేపారు. రాష్ట్రంలో హాట్ సీట్‌గా మారిన పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో గెలుపుపై బెట్టింగ్ రాయుళ్లు కోట్లతో సై అంటున్నారు.దీనిపై పోలీసులు కూడా నిఘా పెట్టినట్లు సమాచారం.
ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్య ప్రభని గెలిపించాలని కోరుతూ ప్రత్తిపాడులో ప్రముఖ సీరియల్ నటుడు ఇంద్రనీల్ వర్మ మంగళవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి సత్య ప్రభను, ఎంపీగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. నెల రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అయిన జిల్లావాసులు వర్షానికి కొంత ఉపశమనం పొందారు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్, వీ.ఎల్ పురం సెంటర్ నీటి మునిగాయి. కొన్నిప్రాంతాల్లో రైతులు ఆరబెట్టిన వరిధాన్యం తడిచిపోయింది. – మీ వద్ద పరిస్థితి ఎలా ఉంది..?
ఉమ్మడి తూ.గో. జిల్లాలో ప్రధానపార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వారి తరఫున ప్రచారం చేసేందుకు సినీనటులు రావడంతో గోదారి జిల్లా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తుండటంతో ఆయన తరఫున మెగాహీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నారా రోహిత్ ఇప్పటికే ప్రచారం చేయగా.. జబర్దస్త్ ఫేమ్స్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
– మరి వీరి ప్రభావం ఏమైనా ఉంటుందా..?
వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. సామర్లకోట, పెద్దాపురం, ఏజెన్సీ, కోనసీమ, తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజల ఫోన్స్‌కు మెసేజ్‌లు వచ్చాయి. అప్రమత్తంగా ఉండాలని ఆ సందేశంలో పేర్కొన్నారు. గతంలో అనేకసార్లు పిడుగుపాటు ప్రమాదాలు సంభవించాయి.
వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. సామర్లకోట, పెద్దాపురం, ఏజెన్సీ, కోనసీమ, తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజల ఫోన్స్‌కు మెసేజ్‌లు వచ్చాయి. అప్రమత్తంగా ఉండాలని ఆ సందేశంలో పేర్కొన్నారు. గతంలో అనేకసార్లు పిడుగుపాటు ప్రమాదాలు సంభవించాయి.
Sorry, no posts matched your criteria.