India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేర్వేరు చోట్ల సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెం హైవేపై బైక్ ఢీకొనడంతో పెరవలికి చెందిన చిన వెంకమ్మ(52) మృతి చెందింది. ఈమె ప్లాస్టిక్ సామగ్రి విక్రయిస్తుంటుంది. పిఠాపురంలో లారీ ఢీకొని పంపాదమ్మ(55) మృత్యువాత పడింది. తొండంగి మండలం వి.కొత్తపేటకు చెందిన పంపాదమ్మ భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. లారీ ఢీకొట్టింది. పంపాదమ్మ స్పాట్‌లో మరణించింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు (మంగళవారం) కోరుకొండలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కోరుకొండ శివారులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద దిగుతారు. అక్కడి నుంచి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై పోలీస్ అధికారులు సోమవారం సమీక్షించారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో దాడి ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసి, బెయిల్‌పై విడుదల చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో శ్రీధర్ అనే యువకుడికి గాయాలైన విషయం తెలిసిందే. కాకినాడ DSP హనుమంతరావు, శిక్షణ DSP ప్రమోద్, SI బాలాజీ సోమవారం ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. తాటిపర్తికి చెందిన వెంకటరమణ, వీరబాబును అదుపులోకి తీసుకొని, బెయిల్‌పై విడుదల చేసినట్లు తెలుస్తుంది.
రాజమండ్రి నుంచే సరికొత్త చరిత్ర లిఖించబోతున్నామని ప్రధాని మోదీ అన్నారు. వేమగిరి ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. చంద్రబాబు సమయంలో ఏపీ అభివృద్ధిలో నంబర్ వన్‌గా ఉండేదని చెప్పారు. జగన్ ఐదేళ్ల హయాంలో పాలన పట్టాలు తప్పిందంటూ విమర్శించారు.
– మోదీ వ్యాఖ్యలపై మీ కామెంట్..?
రాజమండ్రి ఎంపీ అభ్యర్థి కావడం తన అదృష్టమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధీశ్వరి అన్నారు. రాజమండ్రిలోని వేమగిరిలో ప్రజాగళం సభలో ఆమె మాట్లాడుతూ.. చారిత్రక ఘట్టానికి రాజమండ్రి సాక్షిగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో జగన్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారని, సుపరిపాలనకు కూటమి దోహదపడుతుందన్నారు. ఎన్డీఏ కూటమిని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాజమండ్రికి చేరుకున్నారు. కడియం మండలంలోని వేమగిరిలో ఏర్పాటుచేసిన ప్రజాగళం బహిరంగ సభకు కాసేపట్లో వెళ్లనున్నారు.
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో హీరో సాయి ధరమ్ తేజ్ ప్రచారంలో ఆదివారం రాత్రి జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు జనసేన నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదలైంది. దానిలో.. ‘వైసీపీ మార్క్ రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఉపేక్షించం. YCP అల్లరిమూకల దాడిలో జనసైనికుడు శ్రీధర్ తలకు గాయంకావడం బాధాకరం. వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా పోలీసులు చూస్తూ ఉండటం ఎంతవరకు సమంజసం?’ అని ఉంది.
రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన బొమ్మసాని నాగేశ్వరావు(55) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై రఘునాథరావు సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మద్యానికి బానిసగా మారి ఇంటి బాధ్యతలు పట్టించుకోకపోవడంతో భార్య మందలించింది. క్షణికావేశంతో అతడు పురుగు మందు తాగగా, కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
వేమగిరిలో ప్రధాని మోదీ బహిరంగ సభకు వచ్చే వారు వాహనాలను నిర్దేశిత స్థలాల్లోనే పార్కింగ్ చేయాలని పోలీసులు పలు సూచనలు చేశారు. డయాస్ పాస్ కలిగిన నేతల వాహనాలు వేమగిరి జంక్షన్ విందు రెస్టారెంట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రాంతంలో పార్కింగ్ చేయాలన్నారు. వీవీఐపీ పాసులు కలిగిన వాహనాలు 4ఏ వద్ద, విజయవాడ వైపు నుంచి వచ్చే బస్సులు పార్కింగ్-3లో, ఇతర కార్లు, ఆటోలు, బైక్స్ పార్కింగ్-1, 3 స్థలాల్లో నిలపాలన్నారు.
కాకినాడ జిల్లా తొండంగిలో విషాదం నెలకొంది. భార్యాభర్తలు పురుగు మందు తాగగా.. చికిత్స పొందుతూ భర్త మృతి చెందినట్లు ఎస్సై వినయ్ ప్రతాప్ తెలిపారు. లోకారెడ్డి శ్రీనివాస్(30)-సౌజన్యకు ఏడాది కింద వివాహమైంది. ఆర్థిక సమస్యలతో వీరిద్దరూ రెండ్రోజుల కింద ఇంట్లోనే సూసైడ్‌కు యత్నించారు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా.. కాకినాడ GGHలో చికిత్స పొందుతూ భర్త శ్రీనివాస్ మృతి చెందాడు. సౌజన్య చికిత్స పొందుతుంది.
Sorry, no posts matched your criteria.