India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రధాని మోదీ రాజమండ్రి టూర్‌కు సంబంధించి రూట్ మ్యాప్ ఇలా ఉంది. 1:35 PMకు మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 2:25కు రాజమండ్రికి చేరుకుంటారు. అక్కడి నుంచి 2:50కి వేమగిరిలోని హెలిప్యాడ్‌కు వస్తారు. 2:55కు రోడ్డు మార్గాన బయలుదేరి 3 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 3:45 వరకు వేదికపై ఉంటారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 3:55కి హెలిప్యాడ్‌కు చేరుకొని అనకాపల్లి వెళ్తారు.
రాజమండ్రిలో నేడు ‘విజయ శంఖారావం’ పేరిట నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని మోదీ రానున్న విషయం తెలిసిందే. 60 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. ప్రాంగణంలో 50వేల మంది, వేదికపై 44 మంది ఆశీనులు అయ్యేట్లు ఏర్పాట్లు చేశారు. మోదీతో పాటు పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, పురందీశ్వరి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం MP అభ్యర్థులు, రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు MLA అభ్యర్థులకు స్థానం కల్పించనున్నారు.
పోలింగ్ విధులకు కేటాయించబడిన ఉద్యోగులు, సిబ్బంది ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,927 మంది ఉద్యోగులు, సిబ్బంది వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. మొత్తం 11,671 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
కాకినాడ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఆదివారం 4,520 ఉద్యోగులు పోస్టల్ ఓట్లు వేశారని ఎన్నికల అధికారి జె.నివాస్ తెలిపారు. మొత్తం 7,944 మందికి గాను 4,520 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. తుని నియోజకవర్గంలో 585 మంది, ప్రత్తిపాడులో 335 మంది, పిఠాపురంలో 764 మంది, కాకినాడ రూరల్ లో 1,207 మంది, పెద్దాపురంలో 510 మంది, కాకినాడ సిటీలో 773 మంది, జగ్గంపేటలో 346 మరి ఓట్లు వేశారన్నారు.
కోరుకొండ మండలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా తెలిపారు. ఈ నెల 7వ తేదీన కోరుకొండ దేవాలయం రోడ్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు భారీగా హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని జక్కంపూడి రాజా కోరారు.
దేవీపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా చాలా గ్రామాలు నీట మునగడంతో వారందరికీ కాలనీలు నిర్మించి తరలించిన విషయం తెలిసిందే. గోదావరిలో నీరు ఎక్కువగా ఉన్న సమయంలో ఆ గ్రామాలన్నీ మునిగి ఉంటాయి. ప్రస్తుతం ఎండల వల్ల గోదావరి నీటిమట్టం భారీగా తగ్గిపోవడంతో ఊర్లు బయట పడుతున్నాయి. దేవీపట్నం మండల పోలీస్ స్టేషన్ తాజాగా నీటి నుంచి బయటపడింది. యువకులు ఆసక్తిగా భవనాలు, బ్రిడ్జ్‌ల ఫొటోస్ తీస్తున్నారు.
కాకినాడలో పోస్టల్ ఓటింగ్‌లో ఓ పార్టీ నేతలు సిబ్బందిని ప్రలోభపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పీఆర్ డిగ్రీ కాలేజ్‌లోని ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న కొందరు సిబ్బంది.. ఆ సెంటర్ నుంచి బయటకు వచ్చి ఓటు వేసినట్లు ఫొటోలు చూపించి రూ.3 వేల చొప్పున తీసుకున్నట్లు సమాచారం. ఇతర పార్టీల నేతలు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అలెర్ట్ అయ్యి.. ఫోన్స్ తీసుకెళ్లకుండా చూసినట్లు తెలుస్తోంది.
ప్రత్తిపాడులో 70 ఏళ్లుగా పర్వత, ముద్రగడ, వరుపుల కుటుంబాలకు చెందిన వ్యక్తులే MLAలుగా ఎన్నికవడం గమనార్హం. ప్రత్తిపాడులో 14 సార్లు ఎన్నికలు జరగగా.. పర్వత గుర్రాజు కుటుంబానికి చెందిన వారు 5సార్లు, ముద్రగడ పద్మనాభం 4సార్లు, ఆయన తండ్రి వీరరాఘవరావు 2సార్లు గెలిచారు. వరుపుల జోగిరాజు కుటుంబానికి చెందిన వారు 3 సార్లు గెలుపొందారు. ఈ సారి YCPనుంచి వరుపుల సుబ్బారావు, కూటమి నుంచి వరుపుల సత్యప్రభ బరిలో ఉన్నారు.
బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన తూ.గో జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వనలక్ష్మి (15) ఇటీవల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో ఫెయిల్ అయింది. దీంతో తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు నల్లజర్ల ఏఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడ జిల్లాలోని 10 మండలాల్లో ఆదివారం వడ గాల్పులు వీచే అవకాశం ఉందని కాకినాడ జిల్లా కలెక్టర్ జె.నివాస్ శనివారం తెలిపారు. గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, కోటనందూరు, పెద్దాపురం, పిఠాపురం, రౌతులపూడి, శంఖవరం, ఏలేశ్వరం మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. కిర్లంపూడి, జగ్గంపేట మండలాల్లో 41.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయిందన్నారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Sorry, no posts matched your criteria.