EastGodavari

News May 4, 2024

రేపు పిఠాపురానికి మెగా హీరో.. రూట్ మ్యాప్ ఇదే

image

తన మావయ్య పవన్‌ను గెలిపించాలంటూ హీరో సాయిధరమ్ తేజ్ ఆదివారం (రేపు) పిఠాపురంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ విడుదలైంది. పాత కండ్రవాడ , కొత్త కండ్రవాడ, చిత్రాడ, తాటిపర్తి, వన్నెపూడి, కొడవలి గ్రామాల్లో ప్రచారం సాయిధరమ్ తేజ్ ప్రచారం చేయనున్నట్లు జనసేన నేతలు ప్రకటించారు. 

News May 4, 2024

తూ.గో: మరో 8 రోజులే.. ఇక వారి ఓట్లే టార్గెట్!

image

పోలింగ్ తేదీ ముంచుకొస్తుండటంతో ఉమ్మడి తూ.గో జిల్లా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి వ్యూహాల్లో వారున్నారు. ప్రతి ఓటు కీలకమేనంటూ వలస ఓటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన వారి వివరాలు సేకరిస్తూ వారితో టచ్‌లోకి వెళ్తున్నారట. పోలింగ్ రోజు ఓటేసేలా రైల్వే, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులకు ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు.

News May 4, 2024

పి.గన్నవరం: 2019లో 10మంది, ఇప్పుడు 13.. గెలుపెవరిది?

image

2019 ఎన్నికల్లో పి.గన్నవరం నియోజకవర్గం నుంచి 10మంది పోటీ చేశారు. వారిలో వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో 13 మంది బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా వైసీపీ నుంచి విప్పర్తి వేణుగోపాలరావు, కూటమి నుంచి గిడ్డి సత్యనారాయణ (జనసేన), కాంగ్రెస్ నుంచి కొండేటి చిట్టిబాబుతో పాటు మరో 10 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందో కామెంట్ చేయండి.

News May 4, 2024

తూ.గో: విషాదం.. వడదెబ్బతో ఇద్దరు మృతి

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. వడదెబ్బకు వ్యక్తులు పిట్టల్లా రాలుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన ఉపాధిహామీ కూలీ చెరుకూరి సాహెబ్(68) శనివారం ఉదయం పనులకు వెళ్లి వడదెబ్బకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మారేడుమిల్లి మండలం పుల్లంగికి చెందిన కోర కాంతయ్య అనే వృద్ధుడు సైతం వడదెబ్బతో మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు.

News May 4, 2024

తూ.గో.: గుండెపోటుతో ASI మృతి

image

తూ.గో. జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు ASI పీవీ నాగేశ్వరరావు గుండెపోటుతో శనివారం మృతిచెందారని చింతూరు ఎస్సై శ్రీనివారావు తెలిపారు. ఆయన ఏడుగురాళ్లపల్లి అవుట్ పోస్ట్‌లో డ్యూటీ చేస్తుండగా కుప్ప కూలిపోవడంతో రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని తెలిపారు. దీంతో చింతూరులో విషాదం నెలకొంది.

News May 4, 2024

బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి: ముద్రగడ

image

బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన బ్రాహ్మణుల సంఘం పెద్దలు శనివారం కిర్లంపూడిలో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ విజయానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. అనంతరం ముద్రగడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇచ్చింది వైసీపీ మాత్రమేనని చెప్పారు. బ్రాహ్మణులకు పదవులు కేటాయించిన ఘనత జగన్‌కు దక్కిందన్నారు.

News May 4, 2024

తూ.గో.: ఘోరం.. గోదావరిలో మునిగి మరో ఇద్దరు మృతి

image

సీతపల్లి వాగులో మునిగి సామర్లకోటకు చెందిన ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన మరువక ముందే కోనసీమ జిల్లాలో మరోఇద్దరు యువకులు మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తపేట మండలం వానపల్లికి చెందిన ఆరుగురు యువకులు కపిలేశ్వరపురం మండలం నారాయణలంక వెళ్లారు. కాసేపు క్రికెట్ ఆడిన తర్వాత గోదావరిలో స్నానానికి దిగారు. నాగసతీష్(23), ప్రసన్నకుమార్(25) మునిగిపోగా స్థానికులు బయటకు తీశారు. అప్పటికే వారు మృతిచెందారు.

News May 4, 2024

హామీలను స్టాప్ పేపర్‌పై రాసిచ్చిన MLA అభ్యర్థి

image

ఎన్నికల మేనిఫెస్టోను స్టాంప్ పేపర్‌పై రాసి ఇచ్చి ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే కోర్టుకు వెళ్లవచ్చని భారత్ నేషనల్ పార్టీ తరఫున రాజమండ్రి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య ప్రకటించారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు కోర్టుకు వెళ్లవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.

News May 4, 2024

తూ.గో: ఈవీఎంలలో బ్యాలెట్ పత్రాల జోడింపు: కలెక్టర్

image

జిల్లాలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఈవీఎమ్ యూనిట్‌లలో బ్యాలెట్ పత్రాలు జోడించే కమిషనింగ్ ప్రక్రియ ఆయా నియోజక వర్గాల పరిధిలో శుక్రవారం నిర్వహించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె.మాధవీలత తెలిపారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎమ్‌ల కమిషనింగ్ రిటర్నింగ్ అధికారి ఎన్.తేజ్ భరత్ ఆధర్యంలో నిర్వహిస్తున్న ప్రక్రియని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.

News May 3, 2024

సర్పంచ్‌లను MLA చేసిన చరిత్ర ‘అనపర్తి’ ఓటర్లది

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో అనపర్తి నియోజకవర్గ ఓటర్ల నాడీ పట్టడం కష్టమే. ఇప్పటివరకు ఇక్కడ 15సార్లు ఎన్నికలు జరగ్గా.. సర్పంచ్‌లకు సైతం ఎమ్మెల్యేలుగా పట్టం కట్టి అసెంబ్లీకి పంపిన చరిత్ర ఇక్కడి ఓటర్లది. 1971లో రామవరం సర్పంచ్‌గా గెలిచిన మూలారెడ్డి 1983లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే కాగా.. అనపర్తి సర్పంచ్‌గా గెలిచిన రామారెడ్డిని కాంగ్రెస్ తరఫున 1989, 2004లో ఎమ్మెల్యేగా గెలిపించారు.

error: Content is protected !!