EastGodavari

News April 21, 2024

కాకినాడ: రేపే చంద్రబాబు పర్యటన.. SP పర్యవేక్షణ

image

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు కాకినాడ జిల్లా జగ్గంపేటలో పర్యటించనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలించారు. ఆయన వెంట పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి, సీఐ లక్ష్మణరావు, ఎస్ఐలు ఉన్నారు. హెలిప్యాడ్, రోడ్ షో నిర్వహించే ప్రాంతాన్ని సిబ్బందితో పరిశీలించారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

News April 21, 2024

రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందీశ్వరి ఆస్తుల వివరాలు

image

☞ విద్యార్హతలు: B.A (Literature)
☞ భర్త: దగ్గుబాటి వెంకటేశ్వరరావు
☞ కేసులు, వ్యవసాయ భూమి, వాహనం లేవు.
☞ చరాస్తులు: రూ.11.75కోట్లు (కుటుంబీకులందరివి కలిపి)
☞ స్థిరాస్తులు: రూ.49.70 కోట్లు (కుటుంబీకులందరివి)
☞ బంగారం: 1.6 కిలోల బంగారం, 74 క్యారెట్ల వజ్రాలు, 10గ్రా ముత్యాలు (రూ.1.19 కోట్లు).
☞ HYD బంజారాహిల్స్‌‌లో ఇల్లు(రూ.5.55 కోట్లు).
☞ అప్పులు: రూ.6.73 కోట్లు.
➠ తాజా అఫిడవిట్ వివరాల ప్రకారం

News April 21, 2024

కాకినాడ: ఎన్నికల ప్రచారంలో నేతకు గాయాలు

image

కాకినాడ జిల్లా సామర్లకోటలో నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. రాష్ట్ర నేత కంటే వీరరాఘవరావు తీవ్ర గాయాలకు గురయ్యారు. పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దొరబాబు శనివారం రాత్రి సామర్లకోటలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. బాణాసంచా పేల్చుతూ, తారాజువ్వలు వేశారు. కంటే వీరరాఘవరావు తలపై ఒక తారాజువ్వ పడటంతో అతడికి గాయాలయ్యాయి. నాయకులు ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

News April 21, 2024

రాజోలు జనసేన అభ్యర్థికి సెకండ్ హ్యాండ్ కారు

image

☞ విద్యార్హతలు: MSC(బోటనీ), రిటైర్ట్ IAS
☞ కేసులు: లేవు
☞ చరాస్తులు: నగదు రూ.10,50,000. బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.2,21,04,207. సెకండ్ హ్యాండ్ క్రీటా కారు (రూ.15 లక్షలు).
☞ బంగారం: భార్య పేరున 550గ్రా గోల్డ్ (రూ.2,49,64,207).
☞ స్థిరాస్తి: దిండిలో 50 సెంట్ల వ్యవసాయ భూమి, అమరావతి సమీప ఐనవోలులో 4,500చ. అడుగుల వ్యవసాయేతర భూమి. HYDలో 275చ. గజాల స్థలంలో 4000చ. అడుగుల్లో భవనం.
☞ అప్పులు: రూ.10,65,943.

News April 21, 2024

అనపర్తి నుంచి BJP అభ్యర్థిగా నల్లమిల్లి పోటీ..?

image

అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ దాదాపు ఖరారైంది. కానీ.. పోటీ చేసే పార్టీ మారనున్నట్లు సమాచారం. అనపర్తి సీటు BJPకి వెళ్లగా.. అప్పటికే TDP టికెట్ పొందిన నల్లమిల్లి నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో BJP నుంచే నల్లమిల్లిని బరిలో దింపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జెండా ఏదైనా ఎజెండా గెలవాలని చంద్రబాబు సైతం ఆయనకు నచ్చజెప్పినట్లు సమాచారం. నల్లిమిల్లి నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

News April 21, 2024

ఉమ్మడి తూ.గో.లో మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్

image

ఉమ్మడి తూ.గో జిల్లాలోని బాలికల గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో మిగిలిన సీట్ల భర్తీకి ధవళేశ్వరంలోని బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఈ నెల 23న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపల్ ఎ.వాణి తెలిపారు. ఉమ్మడి తూ.గో జిల్లా పరిధిలో 351 ఖాళీలు ఉన్నాయన్నారు. SC-220, BC-31, BC-67, ST-23, OC-10 సీట్లు ఉన్నాయని, ఆయా కేటగిరీలకు చెందినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 21, 2024

రేపు జగ్గంపేటలో పర్యటించనున్న చంద్రబాబు

image

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జగ్గంపేటలో పర్యటించనున్నట్లు ఆపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. చంద్రబాబు రోడ్ షోలో భాగంగా శనివారం హెలీప్యాడ్ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. గోకవరం రోడ్డులో కోడూరి రంగారావుకు చెందిన స్థలం వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

News April 21, 2024

విధుల్లో ఉన్న వారందరికీ పోస్టల్‌ బ్యాలెట్: కలెక్టర్

image

ఎన్నికల రోజున విధుల్లో ఉన్న వారందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తారని తూ.గో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవిలతా తెలియజేశారు. అవసరమైన వారు దీనిని ఉపయోగించుకోవచ్చని అన్నారు. జిల్లాలో సుమారు 6 వేల మందికి పైగా పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోనున్నారని వెల్లడించారు. జిల్లాలో ఉద్యోగ నిర్వహణలో ఉన్నవారు 12D ద్వారా పోస్టల్‌ ఓటు నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు.

News April 20, 2024

కాకినాడ: పవన్‌కళ్యాణ్‌పై మరోసారి ముద్రగడ కామెంట్స్

image

సినిమా నటులు చెప్పే మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. శనివారం ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన పలువురు కాపు నేతలు ముద్రగడ పద్మనాభంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాపు ఉద్యమాన్ని అణచివేసిన చంద్రబాబుకు పవన్‌కళ్యాణ్ మద్దతు పలకటం సిగ్గుచేటని అన్నారు. వైసీపీకి ఘన విజయం అందించాలని పిలుపునిచ్చారు.

News April 20, 2024

కాకినాడ: విద్యార్థులు సస్పెండ్.. నారా లోకేశ్ స్పందన ఇదే

image

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం సూరంపాలెం ఆదిత్య కాలేజ్‌కు చెందిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెన్షన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. సూరంపాలెం వద్ద జగన్ బస్సు ఆపి విద్యాదీవెన, వసతి దీవెన అందుతున్నాయా అని విద్యార్థులను అడగ్గా, అందడం లేదని వారు సమాధానమివ్వడమే నేరమైందని అన్నారు. తక్షణమే కళాశాల యాజమాన్యం సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

error: Content is protected !!