EastGodavari

News April 12, 2024

తూ.గో.: మండపేట టికెట్‌.. చంద్రబాబు క్లారిటీ

image

మండపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థిని మారుస్తారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో అమలాపురంలోని కిమ్స్‌లో మండపేట జనసేన ఇన్‌ఛార్జి వేగుళ్ళ లీలాకృష్ణ, ఎమ్మెల్యే జోగేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారితో మాట్లాడారు. మండపేట కూటమి అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావే ఉంటారని స్పష్టం చేశారు. లీలాకృష్ణ రాజకీయ భవిష్యత్తును అధికారంలోకి రాగానే చూసుకుంటామన్నారు.

News April 12, 2024

మండపేట: అడబాల బాబ్జీ సతీమణి మృతి

image

మాజీ ఎంపీపీ, సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, వైసీపీ నాయకుడు అడబాల సూర్యనారాయణ (బాబ్జీ)కి సతీవియోగం కలిగింది. ఆయన భార్య రామలక్ష్మి అనారోగ్యంతో (45) గురువారం రాత్రి మృతి చెందారు. ఆమె మృతి పట్ల ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

News April 12, 2024

CBN నివాసంలో భేటీ.. అనపర్తి, ఉండి టికెట్లపై చర్చ!

image

ఉభయ గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారిన అనపర్తి, ఉండి టికెట్లపై త్వరలో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో లోకేశ్, జనసేన అధినేత పవన్, బీజేపీ స్టేట్ చీఫ్ పురందీశ్వరి, సిద్ధార్థ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ప్రచార శైలి, భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. వీటితో పాటు అనపర్తి, ఉండి టికెట్లపైనా ఈ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

News April 12, 2024

తూ.గో: ఇంటర్ పరీక్షలు రాసిన.. పాసైన వారి వివరాలిలా..

image

ఉమ్మడి తూ.గో వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు.. పాసైన వారి సంఖ్య ఇలా ఉంది.
➠ ఫస్ట్ ఇయర్: తూ.గోలో 19,039 మందికి గానూ 14,357 మంది(75%).. కాకినాడలో 19,656 మందికి 11,873 మంది(60%).. కోనసీమలో 10,745 మందికి 6,444 మంది (60%) పాసయ్యారు.
➠ సెంకడ్ ఇయర్: తూ.గోలో 15,394 మందికి గానూ 12,837 మంది (83%).. కాకినాడలో 15,969 మందికి 11,337 మంది(71%).. కోనసీమలో 8,844 మందికి 6,338 మంది (72%) పాసయ్యారు.

News April 12, 2024

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ ఫలితాల్లో తూ.గో 5వ స్థానం

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా 75 శాతం(ఉత్తీర్ణత)తో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో 83 శాతంతో 5వ స్థానంలో ఉంది.
➠ కాకినాడ జిల్లా ఫస్ట్ ఇయర్‌లో 60 శాతంతో 15వ స్థానంలో ఉండగా.. సెకండ్ ఇయర్‌లో 71 శాతంతో 18వ స్థానంలో నిలిచింది.
➠ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఫస్ట్ ఇయర్‌లో 60 శాతంతో 17వ స్థానంలో ఉండగా.. సెకండ్ ఇయర్‌లో 72 శాతంతో 16వ స్థానంలో నిలిచింది.

News April 12, 2024

తూ.గో: తీవ్ర ఉత్కంఠ.. మరో గంటే..!

image

ఉమ్మడి తూ.గో ఇంటర్ విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 25,256 మంది, తూ.గో-41,382 మంది, కాకినాడ జిల్లాలో 44,179 మంది ఫస్ట్, సెంకడ్ ఇయర్ విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాశారు. గతేడాది ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి తూ.గో జిల్లా ఫస్ట్ ఇయర్‌లో 6వ, సెకండ్ ఇయర్‌లో 8వ స్థానంలో నిలిచింది. ఈసారి కొత్త జిల్లాల వారీగా ఫలితాలు వెలువడనుండగా.. ఏ జిల్లా ఏ స్థానంలో నిలువనుందో..?

News April 12, 2024

కాకినాడ జిల్లాలో రూ.5కోట్ల విలువైన ఆభరణాల పట్టివేత

image

కాకినాడ జిల్లాలో రూ.5 కోట్ల విలువైన 8కిలోల బంగారం, 46కిలోల వెండి పట్టుబడింది. ఆభరణాలతో వెళుతున్న వాహనాన్ని పెద్దాపురం పోలీసులు పట్టుకున్నారు. ఓ వాహనంలో ఎలాంటి పత్రాలు లేకుండా వాటిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాకినాడ నుంచి విశాఖ వెళ్తూ మధ్యలో పెద్దాపురంలోని ఓ నగల దుకాణానికి రావడంతో డీఎస్పీ లతాకుమారి ఆదేశాల మేరకు సీఐ రవికుమార్, ఎస్ఐ సురేష్ ఆ వాహనం, నగలను స్వాధీనం చేసుకున్నారు.

News April 12, 2024

UPDATE: విషాదం.. భర్త డెడ్‌బాడీ లభ్యం

image

ప.గో జిల్లా యలమంచిలి మండలం చించినాడ గోదావరి వంతెనపై నుంచి రెండేళ్ల చిన్నారి సహా దంపతులు దూకి గల్లంతైన విషయం తెలిసిందే. కుటుంబ యజమాని బొంతు కిషోర్ మృతదేహాన్ని గురువారం సాయంత్రం గుర్తించారు. భార్య యోచన, కుమార్తె శ్రీనిధి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆర్థిక సమస్యల కారణంగానే ఈ దంపతులు పాపతో సహా గోదావరిలో దూకినట్లు తెలుస్తోంది. భీమవరానికి చెందిన వీరు 3 నెలల కింద అమలాపురానికి జీవనోపాధి నిమిత్తం వెళ్లారు.

News April 12, 2024

కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థిపై కేసు నమోదు

image

కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రమణయ్యపేటలో తమను నిర్భంధించి దౌర్జన్యం చేశారని వాలంటీర్లు ఫిర్యాదు చేయగా.. నానాజీతో పాటు మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సర్పవరం SI శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు. జనసేన నేతలు ఆరుగురు వాలంటీర్లను గదిలో నిర్భంధించి తాళం వేసి, దురుసుగా ప్రవర్తించారని అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News April 11, 2024

తూ.గో: తెలుగు రాష్ట్రాల్లో ఎత్తైన గాలి గోపురాల ఆలయం

image

పెదపూడి మండలం గొల్లల మామిడాలో అపర భద్రాద్రిగా ఖ్యాతి గాంచిన కోదండ రామస్వామి వారి ఆలయం ఎంతో ప్రఖ్యాతి గాంచింది. తెలుగు రాష్ట్రాలలోనే అత్యంత ఎత్తైన గాలి గోపురాలు గల రామాలయం ఇది ఒక్కటే. ఈ ఆలయాన్ని 1889వ సంవత్సరంలో నిర్మించారు. మయసభను తలపించేలా ఉండే అద్దాల మండపం
ఈ దేవాలయంలో చెప్పుకోదగ్గ మరో విశేషం.

error: Content is protected !!