India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘సినిమాల్లో నటించండి. రాజకీయాల్లో నటించకండి ప్లీజ్..’ అంటూ పవన్‌పై ముద్రగడ పద్మనాభం సెటైర్స్ వేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన కాపు ఆత్మీయ సమావేశంలో గురువారం ముద్రగడ మాట్లాడుతూ.. పవన్ రాజకీయాల్లో నటించి యువతను పాడు చేయొద్దని అన్నారు. అధికారంలోకి వస్తే స్వచ్ఛ నీరు ఇస్తామని కాకుండా స్వచ్ఛ సారా అందిస్తామనడమేంటని ప్రశ్నించారు. పవన్ తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఉంటే బాగుంటుందని ముద్రగడ అన్నారు.
నేడు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ బహిరంగ సభ దృష్ట్యా అమలాపురంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అమలాపురం మీదుగా వెళ్లే వాహనాలకు అమలాపురం పట్టణంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.. కాకినాడ, రాజమండ్రి, రాజోలు, పి.గన్నవరం వైపు వెళ్లే వాహనాలను వివిధ మార్గాల్లో మళ్లించామన్నారు.
ప.గో జిల్లాలో చించినాడ వశిష్ఠ గోదావరి వంతెనపై నుంచి కుటుంబం బుధవారం దూకి గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భీమవరానికి చెందిన కిషోర్ కుమార్,భార్య యోచన, కుమార్తె శ్రీనిధి అమలాపురంలో నివాసముంటున్నారు. అయితే వీరు ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆ నిర్ణయం తీసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బ్యాగు, ఫోను, చించినాడ గోదావరి వంతెనపై ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ సముద్ర తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో బోటులో ఈ నెల 5వ తేదీన జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మత్స్యకారుడు రేఖాడి సత్తిబాబు(43) మృతి చెందారు. సత్తిబాబు మృతితో ఆయన స్వగ్రామమైన కాట్రేనికోన మండలం బలుసుతిప్పలో విషాదం నెలకొంది. 81 శాతం శరీరం కాలిన గాయాలతో 4 రోజుల నుంచి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న సత్తిబాబు బుధవారం ఉదయం కన్నుమూశాడని డాక్టర్ మోహనరావు తెలిపారు.
జగ్గంపేట మండలంలోని రామవరం గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హైవే పోలీసులు
వివరాల ప్రకారం.. రామవరం గ్రామానికి చెందిన ఎద్దుమాటి దేవి తన భర్త వీరబాబు(32)తో కల్లు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపారం ముగించుకొని గ్రామంలో హైవే దాటుతుండగా గుర్తు తెలియని బైక్ ఢీ కొనడంతో మృతి చెందినట్లు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఎన్నికల నేపథ్యంలో తూ.గో జిల్లాలో ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించేందుకు బుధవారం రాత్రి స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రాంమోహన్ మిశ్రా రాజమహేంద్రవరం చేరుకున్నారు. జిల్లాలో పరిశీలన నిమిత్తం విచ్చేసిన స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రాకు పొట్టి లంక చెక్‌పోస్ట్ వద్ద కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే.మాధవీలత, జిల్లా ఎస్పీ పి.జగదీశ్‌లు మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందచేశారు.
రావికంపాడు – అన్నవరం రైల్వే స్టేషన్ల మధ్య సుమారు 55 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని మహిళ బుధవారం రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడింది. తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సుమారు 5అడుగులు ఎత్తు కలిగి పచ్చని చీర కట్టుకుని ఉంది. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రి మార్చురీలో తరలించారు. ఆమె ఆచూకీ తెలిసినవారు తుని రైల్వేపోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఎస్సై లోవరాజుని సంప్రదించాలని కోరారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 12వ తేదీ శుక్రవారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ సిబ్బందితో శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో రాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ మేరకు ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రాండమైజేషన్ ప్రక్రియపై ఆయన వారికి అవగాహన కల్పించారు.
జనసేన అధినేత పవన్ మగాడయితే.. నేరుగా తనమీద మాట్లాడాలంటూ YCP నాయకులు ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ‘పవన్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. పవన్ హైదరాబాద్‌లో పుట్టారు. ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు. హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చి పవన్ MLA కావాలనుకోవడం ఎంత వరకు సబబు?’ అని ప్రశ్నించారు.
రానున్న ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ అభ్యర్థిగా బీఎస్పీ నుంచి పాలమూరి మోహన్ పోటీ చేస్తారని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి తెలిపారు. ఉప్పలగుప్తం మండలం సరిపెల్ల గ్రామానికి చెందిన మోహన్ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్నారు. పార్టీ ఆశయాల పట్ల ఆకర్షితులై ఇటీవల బీఎస్పీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో నియోజవర్గంలో మోహన్‌ను గెలిపించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.