India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజకీయ ఉద్దండుల కోటగా పేరుగాంచిన జగ్గంపేట నియోజకవర్గంలో ఓటర్లు గత ఆరేళ్లుగా భిన్న తీర్పును ఇస్తున్నారు. 1994 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. 1994, 1999లో టీడీపీ, 2004, 2009లో కాంగ్రెస్, 2014, 2019లో వైసీపీకి పట్టం కట్టారు. ఒక్కోపార్టీకి 2 సార్లు అవకాశం ఇస్తూ వచ్చిన జగ్గంపేట ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి మరి.
– మీ కామెంట్ ఏంటి..?
కోనసీమ జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ దుక్కిపాటి విజయచంద్రను ప్రకటించింది. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ తనను ఎంపిక చేశారని వెల్లడించారు. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక గ్రామ పరిధి రామాలయ పేటకు చెందిన విజయచంద్ర బీటెక్ చదివారు.
తూర్పు గోదావరి జిల్లాలో లబ్ధిదారులకు శనివారం నాటికి 98.78 శాతం పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ మాధవి లత తెలిపారు. ఈ మేరకు ఆమె శనివారం రాత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న మొత్తం 2,43,831 మంది పెన్షన్ దారులకు రూ.72,39,79,500 అందించాల్సి ఉందని ఆమె తెలిపారు. 98.78శాతం పూర్తి కాగా.. మిగిలిన వారికీ వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు.
తాళ్లపూడి మండలంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. తాళ్లపూడి నుంచి రాజమండ్రి వైపు యాసిడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి గోదావరి గట్టుపై నుంచి లోయలోకి పల్టీ కొట్టింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్యాంకర్‌ను బయటకు తీసి యాసిడ్‌ను మరో ట్యాంకర్ ద్వారా రాజమండ్రికి తరలించారు.
రాజమండ్రిలో అభివృద్ధి జరగలేదని, మరోవైపు కేంద్ర నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందని ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థి పురంధీశ్వరి అనడం విడ్డూరంగా ఉందని ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరు విషయంలో, రాష్ట్ర విభజన హామీల అమలు విషయంలో తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.
3 రోజుల కింద జనసేనకు రాజీనామా చేసిన అమలాపురం ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజాబాబు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో అమలాపురం నుంచి పోటీ చేసిన రాజాబాబు 45వేలకు పైగా ఓట్లు సాధించారు. ఈసారి పొత్తులో భాగంగా టికెట్ TDPకి ఇవ్వడంతో అసంతృప్తికి లోనయ్యారు. చివరకు ఈ రోజున వైసీపీ గూటికి చేరారు.
పవన్ 20 సీట్లతో ముఖ్యమంత్రి ఎలా అయిపోతారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. శనివారం తణుకులో వైసీపీ కాపు నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తామని చెబుతున్న చంద్రబాబునాయుడు.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదా ..?అని అడిగారు.
కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన ప్రేమ జంట సూసైడ్ చేసుకుంది. ఏలేశ్వరం వాసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని పెద్దవీధికి చెందిన అశోక్(25), మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించరనే భయంతో శుక్రవారం నర్సీపట్నంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అపస్మారస్థితిలో పడి ఉండగా.. కాకినాడకు తరలించి వైద్యం అందిస్తుండగా వారిద్దరూ మృతి చెందారు. దీంతో విషాదం నెలకొంది.
కాకినాడ జిల్లా ఏటమొగకు చెందిన 9 మంది మత్స్యకారులు ఈ నెల 24న చేపల వేటకు శ్రీదుర్గాభవాని బోటులో బయలుదేరారు. శుక్రవారం విశాఖతీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో వేట సాగిస్తుండగా జనరేటర్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ నౌక (వీర) వెంటనే అక్కడికి చేరుకొని మత్స్యకారులను రక్షించింది. గాయపడిన వారిని కేజీహెచ్‌కు తరలించారు. ధర్మారావు, సత్తిబాబుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2వ విడత పర్యటన ఖరారైంది. 7వ తేదీన అనకాపల్లి, 8వ తేదీన యలమంచిలిలో పర్యటించి అక్కడ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనంతరం 9వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. 9వ తేదీ అనంతరం షెడ్యూల్‌ను తర్వాత విడుదల చేస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Sorry, no posts matched your criteria.