India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రత్తిపాడు నియోజకవర్గానికి ‘పర్వత’ కుటుంబం ఐదుగురు MLAలను అందించింది. 1955లో పర్వత గుర్రాజు గెలవగా, ఆయన వారసుడు పర్వత సుబ్బారావు 1994లో గెలిచారు. సుబ్బారావు భార్య బాపనమ్మ 1999లో విజయం సాధించారు. ఆమె కుమారుడు పర్వత సత్యన్నారాయణ మూర్తి 2009లో గెలుపొందారు. అదే కుటుంబం నుంచి పర్వత పూర్ణ చంద్రప్రసాద్‌కి 2019లో విజయం దక్కింది. దీంతో ఆ కుటుంబం నుంచి ఐదుగురు నేతలు అసెంబ్లీలో అడుగు పెట్టినట్లయింది.
టీడీపీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీశ్ మాధుర్ పోటీ చేయనున్నట్లు అధినేత చంద్రబాబు ప్రకటించారు. హరీశ్ 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి మళ్లీ ఇదే పార్లమెంట్ స్థానం నుంచి ఆయనకు అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈయన జీఎంసీ బాలయోగి కుమారుడు.
టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. అమలాపురం MLA అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావు, కాకినాడ సిటీ MLA అభ్యర్థిగా వనమాడి వెంకటేశ్వరరావును అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. అమలాపురంలో వైసీపీ అభ్యర్థి పినిపె విశ్వరూప్.. కాకినాడ సిటీలో వైసీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బరిలో ఉన్నారు. కాగా.. 2019లోనూ ఈ రెండు చోట్ల వీరే ప్రత్యర్థులు కాగా, ఈసారి ఎవరు నెగ్గుతారో చూడాలి.
ప్రపంచంలో ఏ మూలనున్నా సొంతూరు రాజకీయాలపై ఉండే ఆసక్తే వేరు. ఐదేళ్లకోసారొచ్చే ఎన్నికల పండక్కి ఎలాగైనా వచ్చి ఓటేస్తుంటారు NRI ఓటర్లు. ఉమ్మడి తూ.గో జిల్లాలో 1,006 మంది NRI ఓటర్లు ఉంటే.. పురుషులు-790, స్త్రీలు- 215, థర్డ్ జెండర్ ఒకరు ఉన్నారు. తూ.గో జిల్లాలో 442, కాకినాడ-292, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 272 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో రాజమండ్రి నుంచి అధికంగా 173 మంది ఉంటే.. తుని నుంచి ముగ్గురు ఉన్నారు.
తూ.గో జిల్లాలో పలు భద్రతా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి గౌరవం దక్కింది. ఉగాది పురస్కారాలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజపత్రం గురువారం రాత్రి విడుదల చేశారు. డీసీఆర్బీలో పనిచేస్తున్న ఏఎస్‌ఐ బీవీఆర్ వర్మకు ఉత్తమ సేవా పథకం లభించింది. ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్ జే.శ్రీనివాసరావు, కొవ్వూరు పీఎస్‌లో పనిచేస్తున్న హెచ్‌సీ కె.శ్రీనివాసరావు, ఉండ్రాజవరం పీఎస్‌లోని హెచ్‌సీ వై.నాగేశ్వరరావు ఉన్నారు.
జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను మే 16 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నట్లు సెట్ ఛైర్మన్, ఉప కులపతి జీవీఆర్ ప్రసాద్ రాజు గురువారం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాత షెడ్యూల్ ను సవరించినట్లు పేర్కొన్నారు. సెట్ కు సంబంధించి సందేహాలు ఉంటే 0884 2359599, 0884 2342499 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
ఇటీవల వైసీపీలో చేరిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడిలోని ఆయన నివాసం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి వారు ఇరువురు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలలో తన గెలుపు కోసం సహకరించాలని ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్యేను కోరారు.
కాకినాడ భానుగుడి సెంటర్లో కోటగిరి సిటీ కాంప్లెక్స్‌లోని ఈసా స్పా సెంటర్లో బాడీ మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని కాకినాడ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కత్తాకు చెందిన ఒక మహిళతో పాటు ఇద్దరు విటులను, ఇద్దరు స్పా సెంటర్ నిర్వాహకులను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. వారిని కోర్టుకు తరలించగా 14 రోజులు రిమాండ్ విధించారని టౌన్ సీఐ నాయక్ తెలిపారు.
రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో మార్గదర్శకాలు ఉల్లంఘించిన 23 మంది వాలంటీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు రాజమండ్రి అర్బన్ రిటర్నింగ్ అధికారి/మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, ఉద్యోగులు కచ్చితంగా ఎన్నికల నియమావళిని అనుసరించాలని తెలిపారు. స్థానిక 44వ వార్డు పరిధిలోని సచివాలయం 76, 77లకు చెందిన వాలంటీర్లు సస్పెన్షన్ కు గురయ్యారు.
తాను వైసీపీ నుంచి వేరే పార్టీలోకి మారుతున్నట్లు ప్రచారం సాగుతుందని ఇది పూర్తిగా అవాస్తవం అని అమలాపురం MP చింతా అనురాధ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాను పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన సందర్భంలో సీఎం జగన్ చేసిన సాయం మరువలేనిదన్నారు. అటువంటి వ్యక్తి నీడలోనే పని చేస్తాను తప్ప మరో గూటికి చేరే వ్యక్తిని కాను అని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.