India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డా.బీఆర్ అంబేడ్కర్ జిల్లా మండపేట నియోజకవర్గ MLA అభ్యర్థిగా ‘నవతరం పార్టీ’ నుంచి దివ్యాంగుడు నందికోళ్ల రాజు బరిలో ఉన్నారు. కాగా ఆయన గురువారం మండలంలోని తాపేశ్వరం గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఏం చేశాయో యువత గమనించాలన్నారు.
అమలాపురం రాజకీయం రసవత్తరంగా మారింది. అమలాపురం ఎంపీ చింతా అనురాధ వైసీపీలో కొనసాగుతుండగా ఆమె భర్త టీఎస్ఎన్ మూర్తి బీజేపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. బీజేపీలో చేరిన మూర్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరిని గురువారం కలిశారు. పి.గన్నవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా మూర్తి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
కొత్తపేట అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా బరిలో చిర్ల జగ్గిరెడ్డి ప్రస్తుతం ఐదోసారి పోటీలో ఉన్నారు.2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2009లో ఓటమి చెందారు. 2014, 2019లో వైసీపీ అభ్యర్థిగా వరుస విజయాలు సాధించారు. పోటీ చేసిన నాలుగు సార్లు, ప్రస్తుతం కూడా ఆయన ప్రత్యర్థి బండారు సత్యానందరావు కావడం విశేషం. మరి జగ్గిరెడ్డి ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొడతారా? కామెంట్ చేయండి.
కొత్తపేట నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు 1994 నుంచి ఇంతవరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా 3 సార్లు గెలిచి, 3 సార్లు ఓటమి చెందారు. టీడీపీ తరఫున (1994,1999), 2009లో ప్రజారాజ్యం తరఫున గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కొన్నాళ్ళు ఆ పార్టీలో కొనసాగి తిరిగి టీడీపీలో చేరారు. గత రెండు ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన ఈసారి గెలుస్తారా?కామెంట్ చేయండి.
216వ నంబర్ జాతీయ రహదారిపై తాళ్లరేవు మండలం చొల్లంగి వద్ద బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలైనట్టు కోరంగి పోలీసులు తెలిపారు. యానాం నుంచి కాకినాడ వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు కాకినాడ ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం లలిత రైస్ ఇండస్ట్రీలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. లారీ వెనక్కి తీస్తుండగా క్యాబిన్‌కు-గోడకు మధ్య చిక్కుకొని కామేశ్వరి(60), నాగరత్నం(65) మృత్యువాత పడ్డారు. వర్షం వస్తోందని గోడ పక్కన నిలుచున్న వీరిని లారీ ఢీ కొట్టింది. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తూ.గో జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఈ నేపథ్యంలో ఎవరైనా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పి.జగదీశ్ హెచ్చరించారు. ట్రోలింగ్, ఆన్‌లైన్ వేధింపులు, తప్పుడు వార్తల ప్రచారాలపై ప్రత్యేక నిఘా ఉందని పేర్కొన్నారు. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే ఆయా వాట్సప్, ఫేస్‌బుక్ గ్రూప్స్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. SHARE IT..
వంగా గీత 1994లో పిఠాపురం నుంచి పోటీ చేశారు. TDPలో వర్గపోరుతో తొలుత ఆమెను అభ్యర్థిగా ప్రకటించినా బీఫారం వెన్నా నాగేశ్వర రావుకు అందించారు. అప్పట్లో ఆమెకు చంద్రబాబు, బాలయోగి ఆశీస్సులు ఉన్నా టికెట్ దక్కలేదు. నామినేషన్ తర్వాత బీఫారం కోసం చివరి వరకు ఆమె హైదరాబాద్‌లో ఉండటంతో దాన్ని ఉపసంహరించుకునే ఛాన్స్ దక్కలేదు. ఆమె పేరు బ్యాలెట్ పేపర్ మీద ఉన్నా ఎటువంటి ప్రచారం చేయలేదు. అయినా 169 ఓట్లు దక్కాయి.
గతంలో గాజువాక, భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయారని అతనికి ఓటమి కొత్త ఏమి కాదని వైసీపీ సెంట్రల్ ఇన్‌ఛార్జ్ వెల్లంపల్లి అన్నారు. నేడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పిఠాపురంలో లక్ష మెజార్టీ కాదు లక్ష ఓట్లు కూడా పవన్‌కి పడతాయా అని ఎద్దేవా చేశారు. అనంతరం చంద్రబాబు, లోకేశ్ వారి నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తుంటే పవన్‌ని ఎందుకు మార్చారో చెప్పాలన్నారు.
జనసేనలోకి పిఠాపురం వైసీపీ MLA అభ్యర్థి వంగా గీతను, పవన్ కళ్యాణ్ ఆహ్వానించడంపై ఆమె స్పందించారు. పవన్ కళ్యాణ్‌వి దింపుడు కళ్లెం ఆశలని ఎద్దేవా చేశారు. ‘నేను కూడా పవన్ కళ్యాణ్‌ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది’ అని మండిపడ్డారు. పిఠాపురంలో కేవలం ‘నా మెజార్టీ కోసమే ఎన్నికలు జరుగుతున్నాయి’అని ధీమా వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.