EastGodavari

News February 21, 2025

తాళ్లపూడి : ప్రేమించలేదని యువతిపై దాడి

image

సీనియర్ ఇంటర్ చదువుతున్న యువతిపై ప్రేమించడంలేదని దిలీప్ కుమార్ (19) దాడి చేసిన ఘటన తాళ్లపూడిలో జరిగింది. చదువు ఆపేసి జులాయిగా తిరిగే దిలీప్ కొంత కాలంగా యువతిని వేధించేవాడు. బుధవారం ఆమె కళాశాల వద్దకు వెళ్లి ప్రేమించకుంటే తన జీవితం నాశనం చేస్తానని బెదిరించి , దాడి చేశాడు. బాలిక తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.యువకుడిని గురువారం కోర్టుకు తరలించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

News February 21, 2025

నల్లజర్ల: గుండెపోటుతో పాస్టర్ మృతి

image

నల్లజర్ల మండలం, చీపురుగూడెం గ్రామానికి చెందిన పాస్టర్ గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. చీపురుగూడెం గ్రామ నివాసి పాస్టర్ వెంకటేశ్వరరావు గుండెపోటుతో అకస్మాత్తుగా పడిపోవడంతో 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. అంబులెన్సు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఆయ‌న మృతి చెందినట్లు నల్లజర్ల 108 సిబ్బంది నిర్ధారించారు. 

News February 21, 2025

కొవ్వూరు: భార్యను హత్య చేసిన భర్త

image

కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామంలోని బంగారంపేటలో  గురువారం భర్త దాడి చేయడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాలు..గత కొంతకాలంగా వివాదాల కారణంగా భార్యా భర్తలు, దూరంగా ఉన్నారని 7 నెలల క్రితమే ఇద్దరు కలిశారన్నారు. కుటుంబ కలహాల కారణంగా హత్య హత్యాయత్నం చేసినట్లుగా కొవ్వూరు పట్టణ పోలీసులు భావిస్తున్నారు. దాడిని ఆపేందుకు ప్రయత్నించిన మామయ్యకు గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. 

News February 21, 2025

RJY: పరామర్శ పేరుతో జగన్ రైతులపై దండయాత్ర

image

గుంటూరు మిర్చి యార్డులో పరామర్శ పేరుతో జగన్ రైతులపై దండయాత్ర చేస్తున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా కూటమి నేతలతో గురువారం జరిగిన సమావేశానికి ఆయన అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు పరదాల చాటున దాక్కొన్న జగన్ పదవి కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

News February 20, 2025

రాజమండ్రి: క్యూ ఆర్ కోడ్‌తో మెరుగైన పౌర సేవలు

image

ప్రజలకు అందుబాటులో ఉన్న పౌర సేవల విషయంలో క్యూ ఆర్ కోడ్ ద్వారా అందుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఏపీపీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు, ఇంటర్ పరీక్షలు తదితర అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. తూ.గో జిల్లాలో ఇంటర్ పరీక్షలు కోసం 51 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News February 20, 2025

తూ.గో: కోడిపందేలపై పోలీసుల దాడులు

image

నల్లజర్ల మండలం ముసళ్లకుంట గ్రామంలో కోడిపందేల స్థావరంపై నల్లజర్ల పోలీసులు గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 28 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 28 సెల్ ఫోన్లు, 7 కార్లు, ఒక మోటార్ సైకిల్ , 2 కోడి పుంజులు , రూ.6.2లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు నల్లజర్ల పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News February 20, 2025

రాజానగరం : రెండు లారీల మధ్య నలిగిపోయి వ్యక్తి మృతి 

image

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమూరు గామన్ బ్రిడ్జిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు ఇనుప ఊచలు లోడుతో వెళ్తున్న లారీని డ్రైవర్ శ్రీనివాసరావు(45) రోడ్డు పక్కకు ఆపి, టైర్లలో గాలి చెక్ చేస్తుండగా మరో లారీ ఢీకొంది. ప్రమాదంలో రెండు లారీల మధ్య నలిగి, అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడని ఎస్ఐ మనోహర్ తెలిపారు.

News February 19, 2025

27న తూ.గో జిల్లాలో సెలవు

image

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. పలువురు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈక్రమంలో 27వ తేదీన స్పెషల్ లీవ్ మంజూరైందని ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సెలవును అడ్జస్ట్ చేసుకోవాలని ఆమె సూచించారు.

News February 19, 2025

కొవ్వూరు : గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

కొవ్వూరు ఇంటిలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న డేవిడ్ రాజు మంగళవారం సాయంత్రం మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

News February 19, 2025

రాజమండ్రి: జగన్ జైలుకు వెళ్లడం ఖాయం: గన్ని కృష్ణ

image

చేసిన తప్పుకు జైలు ఊచలు లెక్కపెడుతున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలోనే జగన్ జైలుకు వెళ్ళడం ఖాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ జోస్యం చెప్పారు. భవిష్యత్‌లో తాను వెళ్ళబోతున్న జైల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకోడానికి జగన్ వెళ్ళాడా అనే అనుమానాలు ఉన్నాయన్నారు. నాడు చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టిన రోజులను మరిచిపోయినట్లుగా జగన్ నీతులు చెబితే ఎలా అని గన్ని ఎద్దేవా చేశారు.

error: Content is protected !!