India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రముఖ యాంకర్ శ్యామల నియమితులయ్యారు. కాకినాడలోని ఇంద్రపాలేనికి చెందిన శ్యామల సీరియల్ నటిగా, యాంకర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు సినిమాల్లోనూ నటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లాలో వైసీపీ తరఫున విస్తృత ప్రచారం చేశారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ ఇన్‌ఛార్జి సీఈవోగా పాఠంశెట్టి నారాయణ మూర్తి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన కాకినాడ డివిజన్ డీఎల్డీవో విధులు నిర్వర్తిస్తున్నారు. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇంతవరకు ఇక్కడ సీఈవోగా పనిచేసిన ఎ.శ్రీరామచంద్రమూర్తి రిలీవ్ అయిన విషయం తెలిసిందే.
రాజమండ్రి పరిధి హుకుంపేటకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు బొమ్మూరు CI కాశీ విశ్వనాథం శుక్రవారం తెలిపారు. వివరాలు.. కుటుంబ కలహాల నేపథ్యంలో వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు వచ్చి బస్టాప్‌లో ఉంటుందన్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. లేవలేని స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామన్నారు.
దివాన్ చెరువు అటవీ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాలో చిరుత సంచారానికి సంబంధించిన చిత్రాలు కనిపించాయని జిల్లా అటవీశాఖ అధికారి భరణి శుక్రవారం తెలిపారు. చిరుతను ట్రాప్ బోనులో పట్టుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నామని, కచ్చితంగా దాన్ని పట్టుకుంటామన్నారు. మరోవైపు అటవీ ప్రాంత సమీపంలోని ఆటోనగర్ నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ వరకు నేషనల్ హైవేపై అప్రమత్తంగా ఉండాలని బోర్డులు ఏర్పాటుచేశామన్నారు.
అమలాపురం మండలం సాకుర్రు గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి వీర వెంకట సత్యనారాయణకు ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారని రూరల్ సీఐ వీరబాబు శుక్రవారం తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ఈ సంఘటన జరిగిందన్నారు. అత్యాచారయత్నానికి ప్రయత్నించి అడ్డువచ్చిన అమ్మమ్మపై దాడి చేశారన్నారు.
రంపచోడవరం ఏపీ గిరిజన బాలికల గురుకుల కళాశాల ఇంగ్లీషు లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న కె.ఉషాకిరణ్(42) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. రాజమండ్రిలో నివాసం ఉంటూ కొంత కాలంగా ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారని స్నేహితులు తెలిపారు. ఆమెకు భర్త, ఇరువురు పిల్లలు ఉన్నారు. గతంలో రాజవొమ్మంగి, బుట్టాయిగూడెం గురుకుల పాఠశాలల్లో పని చేశారని ఆమె మరణం జీర్ణించకోలేక పోతున్నామని తోటి ఉద్యోగులు తెలిపారు.
పిఠాపురం నియోజకవర్గంలో మాజీ సీఎం YS జగన్ పర్యటన కొనసాగుతోంది. మాధవపురం గ్రామంలో బాధితులను కలిసేందుకు కాన్వాయ్ దిగారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి జగన్‌ను కలిసేందుకు కాన్వాయ్ ఎక్కాడు. అప్రమత్తమైన సిబ్బంది అతణ్ని అక్కడి నుంచి పంపించేశారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఎస్ఐలను అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేటాయిస్తూ ఏలూరు రేంజి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. తూ.గో. జిల్లాకు చెందిన టి.శివకుమార్, కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన షరీఫ్, టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన చినబాబును ఏఎస్ఆర్ జిల్లాకు కేటాయించారు.
కమ్యూనిస్ట్ నేత సీతారాం ఏచూరికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. గురువారం ఆయన మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా తూ.గో. జిల్లాలో విషాదం అలుముకొంది. కడియం మండలంలోని జేగురుపాడులో ఆయన తల్లిదండ్రులు ఏచూరి కల్పకం, సర్వేశ్వర సోమయాజులు చాలా ఏళ్లు ఉన్నారు. అనంతరం కాకినాడలోని రామారావు పేటలో స్థిరపడ్డారు.
కాకినాడలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ చిన్నారావుపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ముద్దాయి దుర్గాప్రసాద్ కు 18 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ కాకినాడ రెండవ అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ విజయబాబు గురువారం తీర్పు చెప్పారు. 2023 మార్చి 17వ తేదీన హత్యాయత్నానికి పాల్పడ్డా ఘటనలో అప్పట్లో కేసు నమోదు చేశారు. కేసులో నేరం రుజువు కావడంతో జడ్జ్ శిక్ష విధించారని సీఐ అప్పలనాయుడు తెలిపారు.
Sorry, no posts matched your criteria.