EastGodavari

News February 22, 2026

తూ.గో: ‘ఈ నెల 22వ తేదీన విద్యుత్ బిల్లులు చెల్లించొచ్చు’

image

తూ.గో జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లోని విద్యుత్ బిల్లులు వసూళ్ల కౌంటర్లు ఈ నెల 22వ తేదీ (ఆదివారం) పని చేస్తాయని APEPDCL ఎస్.ఈ కె.తిలక్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలతో పాటు APEPDCL సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, ATP సెంటర్లలో కూడా బిల్లులు చెల్లించవచ్చన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 21, 2026

సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలి: కలెక్టర్

image

తూ.గో జిల్లాలోని గ్రామపంచాయితీల పరిధిలో ఇంటి పన్నులు, పన్నేతర బకాయిలను సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. జిల్లాలోని 342 గ్రామ పంచాయితీల్లో ప్రస్తుతం ఇంటి పన్నులు, పన్నేతరముల బకాయిలు రూ.125.11 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు రూ.54.00 కోట్లు వసూలైనట్లు వెల్లడించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా బకాయిలు చెల్లించాలన్నారు.

News February 21, 2026

రాజమండ్రి: టెన్త్‌తో ఉద్యోగాలు..19-35 ఏళ్లు వారే అర్హులు

image

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఫిబ్రవరి 23వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ శనివారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్, ITI, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి 19-35 ఏళ్లు ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హులని వివరించారు.

News February 21, 2026

ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ నరసింహ

image

ఇంటర్ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి సమయానికి పరీక్షలకు హాజరై, చక్కగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ శనివారం సూచించారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ & సోలార్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.

News February 21, 2026

నల్లజర్ల: కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

image

నల్లజర్ల మండలం పుల్లలపాడు జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. విధులు నిర్వహిస్తున్న బీట్ కానిస్టేబుల్ రవిని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో రవికి తీవ్ర గాయాలు కాగా, పోలీసులు ఆయనను తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన బస్సు ఆపకుండా వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 21, 2026

సంక్షేమ పథకాలే లక్ష్యంగా ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’: కలెక్టర్

image

ఏపీ ప్రభుత్వం స్వర్ణగ్రామ/స్వర్ణవార్డ్ ఆధ్వర్యంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తోందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ పథకాల పారదర్శక అమలు, లబ్ధిదారులకు వేగంగా సేవలు అందించేందుకు సమగ్ర డేటా సేకరించడమే ఈ సర్వే ఉద్దేశమని పేర్కొన్నారు. సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు తప్పనిసరిగా సహకరించి వివరాలు అందించాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఆమె కోరారు.