EastGodavari

News September 1, 2024

కూలర్ రిపేర్ చేస్తుండగా షాక్.. వ్యక్తి మృతి

image

రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలంలోని పల్లూరులో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. ఆవుల రామారావు రిపేర్‌కు వచ్చిన ఓ కూలర్ మరమ్మతులు చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడని గ్రామస్థులు తెలిపారు. ఆపస్మారక స్థితికి చేరుకొన్న అతడిని కోతులగుట్టలోని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మరణించాడు. రామారావుకు ఇంకా వివాహం కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 1, 2024

రేపు తూ.గో. జిల్లాలో విద్యాసంస్థలు బంద్

image

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు రేపు (సోమవారం) సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి ఆమె ఆదివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు.

News September 1, 2024

అన్నవరం సత్యదేవుడి ప్రసాదం చరిత్రకు 133 ఏళ్లు

image

అన్నవరం సత్యదేవుడి ఆలయం 1891లో ప్రతిష్టితమైంది. అప్పటి నుంచి భక్తులకు గోధుమ రవ్వ ప్రసాదాన్నే అందిస్తున్నారు. అన్నవరం ప్రసాదం అంటే భక్తులకు ఎంత ప్రీతిపాత్రమో చెప్పనక్కర్లేదు. భారత ఆహార ప్రమాణాల సంస్థ తాజాగా FSSAI గుర్తింపునిచ్చింది. ఏటా 2కోట్లకు పైగా స్వామి ప్రసాదం ప్యాకెట్లను దేవస్థానం విక్రయిస్తోంది. ఒక్క ప్రసాదాల ద్వారా ఏటా రూ.40 కోట్ల ఆదాయం సమకూరుతోంది. కాగా ఈ ప్రసాద చరిత్రకు నేటికి 133 ఏళ్లు.

News September 1, 2024

సత్యదేవుని ఆలయానికి రూ.25.32 కోట్లు

image

శంఖవరం మండలం అన్నవరం సత్యదేవుని ఆలయ అభివృద్ధికి ‘ప్రసాద్ పథకం’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.25.32 కోట్లు మంజూరు చేసంది. నిధులతో చేపట్టబోయే పనులపై కేంద్ర మంజూరు, పర్యవేక్షణ కమిటీ గత నెల 20న సమావేశమైంది. త్వరలోనే అనుమతులు రానున్నాయని, వెంటనే టెండర్ల ప్రక్రియ నిర్వహించి పనులు ప్రారంభిస్తామని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.

News September 1, 2024

కాకినాడ పోర్టులో నిలిచిపోయిన ఎగుమతులు

image

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడటంతో సోమవారం సాయంత్రం వరకు జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో కాకినాడ పోర్టునుంచి 3వ రోజు కూడా విదేశాలకు బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. ఎక్కడి బార్జీలు అక్కడే పోర్టులో ఉండిపోయాయి. సోమవారం వరకు బియ్యం ఎగుమతులు తాత్కాలికంగా నిలిపివేశారు.

News September 1, 2024

‘అద్విక-24’ టెక్ ఫెస్ట్ బ్రోచర్ ఆవిష్కరించిన వీసీ

image

నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19, 20 తేదీలలో ‘అద్విక 24’ జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య శ్రీనివాసరావు తెలిపారు. యూనివర్సిటీలో శనివారం ఇంజినీరింగ్ ఫ్రెషర్స్ పార్టీలో ‘అద్విక-24’ జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను వీసీ ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. ఇంజినీరింగ్ తో పాటు కంప్యూటర్ కోర్సులు చేస్తున్నవారు దీనికి అర్హులన్నారు.

News September 1, 2024

తాండవ ప్రాజెక్ట్‌కు వరద.. పెరిగిన నీటిమట్టం

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ ఏజెన్సీలో భారీగా వర్షం కురవడంతో తాండవ జలాశయానికి వరద నీరు చేరి నీటి మట్టం గణనీయంగా పెరిగిందని ప్రాజెక్టు డీఈ అనురాధ తెలిపారు. ప్రస్తుత నీటిమట్టం 377.8 అడుగులకు చేరిందని.. 378.50 అడుగులు చేరగానే నీటిని స్లిప్ వే గేట్లు ఎత్తి దిగువకు వదులుతామని తెలిపారు.

News August 31, 2024

తూ.గో: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

image

తూ.గో జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన సంధ్యాకుమారి శుక్రవారం ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇద్దరు మగ, ఒక ఆడపిల్ల పుట్టింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సంధ్యాకుమారికి ఆపరేషన్ జరిగింది. తల్లితో పాటు పిల్లలు ముగ్గురూ తగిన బరువుతో ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. పెళ్లైన ఐదేళ్లకు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టడంతో వారి ఆనందానికి అవధులు లేవు.

News August 31, 2024

తూ.గో: భారీ వర్షాలు.. రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు

image

రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొన్ని రైళ్లను రూట్ మార్చినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. వాటి వివరాల కోసం ఉమ్మడి తూ.గో జిల్లాలోని హెల్ప్ లైన్ నెంబర్లను రైల్వే శాఖ ప్రకటించింది. రాజమండ్రి- 0883-2420541, 0883-2420543, తుని- 7815909479, నిడదవోలు-08813-223325 నంబర్లకు సంప్రదించాలని పేర్కొంది.

News August 31, 2024

భారీ వర్షాలు.. ఉమ్మడి తూ.గో కంట్రోల్ రూం నంబర్లు ఇవే

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కింది జాగ్రత్తలు పాటిద్దాం.
☞ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు, స్తంభాల వద్ద ఉండొద్దు.
☞ వర్షం పడేటప్పుడు చెట్ల కిందికి వెళ్లకండి.
☞ నదులు, కాలువలు, మ్యాన్‌హోళ్ల వద్ద జాగ్రత్త.
☞ రోడ్డుపై నీరుంటే జాగ్రత్తగా వెళ్లండి.
➠ కంట్రోల్ రూం నంబర్లు: 8977935609(తూ.గో), 08856-293104(కోనసీమ), 18004253077(కాకినాడ).