EastGodavari

News February 9, 2025

దేవరపల్లి హైవేపై ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

image

దేవరపల్లి మండలం గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం సంగాయిగూడెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు ముగ్గురు పిల్లలతో కలిసి కొవ్వూరు వైపు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి ప్రమాదానికి గురయ్యారు. భార్య, భర్త, కుమారుడిని గోపాలపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా మిగిలిన ఇద్దరు కుమార్తెలను మరో ఆసుపత్రికి తరలించారు.

News February 9, 2025

రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం మహిళ మృతి

image

ప్రత్తిపాడులో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం(M) కొండ్రుపోలుకు చెందిన లక్ష్మి మృతిచెందింది. భర్త సత్యనారాయణతో దువ్వలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రత్తిపాడు హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయమై చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI స్వామి తెలిపారు.

News February 9, 2025

తూ.గో: 26 మంది ఉద్యోగులకు షాకోజ్ నోటీసులు

image

విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న 26 మంది ఉద్యోగులకు శనివారం కలెక్టర్ షాకోజ్ నోటీసులు జారీ చేశారు. వారిలో 12 మంది డిప్యూటీ తహశీల్దార్లు , 12 మంది మండల సర్వేయర్లు, ఇద్దరు గ్రామ సర్వేయర్లు ఉన్నారు. రాజమండ్రి రూరల్, పెరవలి, గోపాలపురం, చాగల్లు, గోకవరం, కడియం, దేవరపల్లి, నల్లజర్ల, బిక్కవోలు, కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల డిప్యూటీ తహశీల్దార్లు ఉన్నారు.

News February 9, 2025

RJY: సంగీతా నృత్య పాఠశాలను సందర్శించిన మంత్రి

image

రాజమండ్రిలోని విజయశంకర్ ప్రభుత్వ సంగీతా నృత్యపాఠశాలను శనివారం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక ,సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినీవిద్యార్థులతో మాట్లాడారు. సంగీత నృత్య పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక శాఖ కమీషన్‌ ఛైర్‌పర్సన్‌ పొడపాటి తేజస్విని పాల్గొన్నారు.

News February 8, 2025

తూ.గో: వైసీపీలోకి ఉండవల్లి! సోషల్ మీడియాలో ప్రచారం

image

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం నెట్టింట జోరందుకుంది. ఈ నెల 26న ఆయన వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుంటారని వైసీపీ శ్రేణులు నెట్టింట పోస్టులు పెడుతున్నాయి. ఈ ప్రచారంపై ఉండవల్లి స్పందించాల్సి ఉంది. కాగా ఉండవల్లికి వైఎస్ ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.

News February 8, 2025

అనపర్తి MLA కుమారుడి పెళ్లికి హాజరైన CM

image

హైదరాబాద్ జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ హల్‌లో అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్- సుమేఘరెడ్డిల వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం ఆశీర్వదించారు. అనంతరం MLAతో కాసేపు ముచ్చటించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

News February 8, 2025

రాజానగరం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

రాజానగరం హైవే గైట్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. బొమ్మూరుకి చెందిన వాకలపూడి వెంకటేశ్వరరావు అతని భార్య రాజేశ్వరి(65)తో కలిసి రాజనగరం మండలం పల్లకడియంలో ఉంటున్న కుమార్తె ఇంటికి స్కూటీపై బయలుదేరారు. దీంతో వెనుక నుంచి వస్తున్న లారీ వారిని ఢీకొనడంతో తలకు బలమైన గాయమై రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు.

News February 8, 2025

రాజమండ్రి: పార్కులు థీమ్స్ పార్క్‌లు అభివృద్ధి చేయాలి- కలెక్టర్

image

రాజమండ్రిలోని పార్కులను మూస పద్ధతిలో కాకుండా ఒక ప్రత్యేకత కలిగిన థీమ్‌లతో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. 2027 పుష్కరాల నాటికి ఆమేరకు పనులు పూర్తి చెయాలని తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. నగరంలోని 26 పార్కులను ఆయా పార్కుల అభివృద్ధి ఒక ప్రత్యేకత కలిగి ఉండేలా చూడాలని సూచించారు.

News February 7, 2025

రాజమండ్రి: పార్కులు థీమ్స్ పార్క్‌లు అభివృద్ధి చేయాలి- కలెక్టర్

image

రాజమండ్రిలోని పార్కులను మూస పద్ధతిలో కాకుండా ఒక ప్రత్యేకత కలిగిన థీమ్‌లతో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. 2027 పుష్కరాల నాటికి ఆమేరకు పనులు పూర్తి చెయాలని తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. నగరంలోని 26 పార్కులను ఆయా పార్కుల అభివృద్ధి ఒక ప్రత్యేకత కలిగి ఉండేలా చూడాలని సూచించారు.

News February 7, 2025

తూ.గో: 13 మద్యం షాపులకు 17 దరఖాస్తులు

image

జిల్లాలో కల్లుగీత వృత్తులకు కేటాయించిన 13 మద్యం షాపుల దరఖాస్తులకు 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగించామని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి చింతాడ లావణ్య తెలిపారు. ఇప్పటివరకు 13 మద్యం షాపులకు 17 దరఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. 9న దరఖాస్తులు పరిశీలన, 10న రాజమండ్రి ఆర్‌డీవో కార్యాలయంలో షాపులు కేటాయింపునకు సంబంధించి డ్రా తీసి అదేరోజు షాపులు కేటాయిస్తామన్నారు.