India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సంక్రాంతి వేళ ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తూ.గో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్.సురేశ్ మంగళవారం హెచ్చరించారు. RTC ఛార్జీలపై గరిష్టంగా 50 శాతం మాత్రమే అదనంగా వసూలు చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తే బస్సు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రద్దీ దృష్ట్యా ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు.

డిసెంబర్ 7న NMMS పరీక్ష రాసిన విద్యార్థులు కుల, ఆదాయ, 7వ తరగతి ధృవీకరణ పత్రాలను ఈ నెల 20లోపు సిద్ధం చేసుకోవాలని DEO వాసుదేవరావు మంగళవారం సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వివరాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తల్లిదండ్రులు గడువులోగా ఈ పత్రాలను సిద్ధం చేసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే స్కాలర్‌షిప్ పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

వరకట్న నిషేధ చట్టం-1961 అమలుపై అవగాహన పెంచాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ సూచించారు. మంగళవారం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఈ చట్టం అమలు, మహిళలపై వేధింపుల నివారణకు ప్రత్యేక బోర్డ్ కమిటీని ఏర్పాటు చేశారు. వరకట్న దురాచారంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అవసరమని పేర్కొన్నారు. మహిళల రక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కడియం పల్ల వెంకన్న నర్సరీలో మంగళవారం సంక్రాంతి సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకుని మొక్కలతో రూపొందించిన ప్రత్యేక ఆకృతులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. భోగి మంట, పాలకుండ, గాలిపటం, ఎద్దు, కోడిపుంజు వంటి పండుగ ప్రతీకలను సృజనాత్మకంగా తీర్చిదిద్దారు. సంక్రాంతి శోభను ప్రతిబింబిస్తున్న ఈ మొక్కల కళాఖండాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

తూ.గో జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 16 ఆర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ ప్రజల నుంచి స్వయంగా ఆర్జీలు స్వీకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.

కుటుంబ కలహాలు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నిడదవోలు(M) అట్లపాడులో బండి కోట సత్యనారాయణ(28) అనే యువకుడు తన తమ్ముడు సాయిరాం చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం జరిగిన ఈ ఘటనలో సాయిరాం రోకలిబండతో అన్న తలపై బలంగా కొట్టడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తల్లి దుర్గ భవాని ఉన్నారు. సమిశ్రగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.

కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాన్ని బలిగొన్నాయి. రాజమండ్రి రూరల్(M) కొంతమూరులోని బూసమ్మకాలనీకి చెందిన కన్నారామకృష్ణ శనివారం అర్ధరాత్రి భార్య పద్మ(36)తో గొడవపడి, పదునైన ఇనుపరాడ్‌తో దాడి చేసి కిరాతకంగా హతమార్చాడు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వీరయ్యగౌడ్ వెల్లడించారు.

తూ.గో జిల్లాలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం PGRS కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. నేడు భూమి సంబంధిత సమస్యల తక్షణ పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారులు పలు రెవెన్యూ రికార్డులతో ఈ ప్రోగ్రామ్‌కు హాజరుకావాలన్నారు.

Sorry, no posts matched your criteria.