India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఉ.11 గంటలకు గౌరీపట్నంలో వరద ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించి రైతులు, అధికారులతో మాట్లాడుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి వచ్చే రైల్వే అధికారులతో కలిసి స్టేషన్‌లో కొత్త ప్లాట్‌ఫాంల ఏర్పాటు, ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనులపై సమీక్షిస్తారని అధికారులు వెల్లడించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ITIలో ఉత్తీర్ణులైన వారు ఆర్టీసీ అప్రెంటీస్ ఉద్యోగాలకు ఆగస్టు 16వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిల అశోక శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. డీజిల్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, మోటార్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్‌లకు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలో సముద్రం ఒడ్డుకు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చింది. శుక్రవారం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. ఒంటిమీద బట్టలు లేని వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చిందని తెలిపారు. దీనిపై పలు పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసుల వివరాలను సేకరిస్తున్నారు.
అమలాపురం రూరల్ మండలం గున్నేపల్లి అగ్రహారానికి చెందిన డ్వాక్రా యానిమేటర్ యార్లగడ్డ సుశీల భర్త దుర్గారావు కలిసి అదృశ్యమైంది. సుశీల అదృశ్యం అయిన తర్వాత ఆమె పేరిట ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. ‘తమ కోసం వెతకొద్దని, చనిపోతామని’ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. సుశీలకు ఆర్థిక ఇబ్బందులతో పాటు స్త్రీనిధి రుణాలకు సంబంధించి రూ.2 లక్షల వరకు నగదు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది.
ఆషాఢమాసం ముగిసి శ్రావణమాసం రానున్న తరుణంలో ఈ నెల 5 నుంచి పెళ్లిబాజాలు మోగనున్నాయి. దాదాపు 3 నెలల విరామం తర్వాత పెళ్లిళ్ల కోసం ఉమ్మడి తూ.గో. జిల్లాలో కళ్యాణ మండపాలను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి ఏప్రిల్ 31 వరకు వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. సెప్టెంబర్ నెల భాద్రపద మాసంలో ముహూర్తాలు లేవని, మళ్లీ అశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసంలో ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు నంబర్ 20833/20834 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు సామర్లకోట రైల్వేస్టేషన్లో హాల్ట్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వందేభారత్‌లో ప్రయాణించే వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గురువారం రాత్రి ఒంటి గంటకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం 11.70 అడుగులకి చేరిందని అధికారులు తెలిపారు. సర్‌ప్లస్ (surplus) వాటర్ 9,86,016కి చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినట్లు ప్రకటించారు. ఈ మేరకు రివర్ కన్జర్వేటర్ & గోదావరి హెడ్‌వర్క్స్ డివిజన్ ఈఈ కాశీ విశ్వేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు.
వర్గీకరణపై సుప్రీం తీర్పును అంగీకరించబోమని అమలాపురం మాజీ MP హర్షకుమార్ పేర్కొన్నారు. టీడీపీ కృష్ణ మాదిగను పావులా వాడుకుందన్నారు. రాజమండ్రిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. 351 ఆర్టికల్ షెడ్యూల్ కులాలకు ఉద్దేశించబడినదని చెప్పారు. వర్గీకరణ చేసేందుకు పార్లమెంట్‌కు కూడా అధికారం లేదన్నారు. ఇది మోదీ, చంద్రబాబు కలిసి ఆడిన కుట్రగా అభివర్ణించారు.
భారీ వర్షాలు రొయ్యల సాగుకు ప్రతిబంధకంగా మారాయి. వర్షాలతో ఆక్సిజన్ అందక రొయ్యలు చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు బ్యాక్టీరియా, వైరస్ ఉద్ధృతి, వైట్ స్పాట్ రొయ్యల సాగుకు ప్రతికూలంగా పరిణమించాయి. కోనసీమ జిల్లాలో 14,400 హెక్టార్లలో, కాకినాడలోని 8,600 హెక్టార్లలో, తూ.గో. జిల్లాలోని 982 హెక్టార్లలో రొయ్యలు సాగు జరుగుతోంది. 3 జిల్లాల్లో కలిపి 28,596 మంది రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు.
ఓ వైసీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదైంది. సీతానగరం SI రామకృష్ణ తెలిపిన వివరాలు.. ముగ్గళ్లకు చెందిన గుర్రాల అయ్యప్పస్వామి బర్త్‌డే సందర్భంగా గత నెల 27న రాత్రి వేడుకలు నిర్వహించారు. కొందరు యువకులు మద్యం మత్తులో కేకలు వేయగాతో స్థానిక ఉపసర్పంచి, TDP వర్గీయుడు రవికుమార్ వారిని వారించారు. దీంతో కులం పేరుతో దూషించి, చంపేస్తామని బెదిరించాడని ఉపసర్పంచి ఫిర్యాదుచేశాడు. ఈ మేరకు కేసు నమోదుచేశామన్నారు.
Sorry, no posts matched your criteria.