EastGodavari

News January 7, 2026

రాజానగరం: తొలిసారిగా ‘నన్నయ వర్సిటీ’కి ఫైవ్ స్టార్ గౌరవం

image

ఉన్నత విద్యారంగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మకమైన ‘ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్’ సర్టిఫికెట్ లభించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తొలిసారిగా నన్నయ వర్సిటీ ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోవడం విశేషం. మంగళవారం అమరావతిలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ఈ సర్టిఫికెట్‌ను వర్సిటీ వీసీ ప్రసన్నశ్రీకి అందజేసి అభినందించారు.

News January 6, 2026

జిల్లా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌గా సుబ్బారాయుడు

image

తూ.గో. జిల్లా ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్‌గా బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు నియమితులయ్యారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడైన ఆయన, 2026 నుంచి 2029 వరకు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షులు రాజా, కార్యదర్శి శ్రీనివాస్ ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.

News January 6, 2026

రెండేళ్ల నిరీక్షణకు ఫలితం.. బాధితురాలి ఖాతాలో పెన్షన్ సొమ్ము జమ!

image

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జోక్యంతో పి.పద్మావతి అనే బాధితురాలికి న్యాయం చేకూరింది. ఆమెకు రావాల్సిన రూ.11,09,637 పెన్షన్ బకాయిలు ఈనెల 2న బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. అలాగే నెలకు రూ.14 వేల పింఛను మంజూరైంది. 2022లో ఆమె దాఖలు చేసిన అర్జీపై స్పందించి పరిష్కరించినందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంథం సునీత, కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మిలకు పద్మావతి కృతజ్ఞతలు తెలిపారు.

News January 6, 2026

రాజానగరం: తొలిసారిగా ‘నన్నయ వర్సిటీ’కి ఫైవ్ స్టార్ గౌరవం

image

ఉన్నత విద్యారంగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మకమైన ‘ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్’ సర్టిఫికెట్ లభించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తొలిసారిగా నన్నయ వర్సిటీ ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోవడం విశేషం. మంగళవారం అమరావతిలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ఈ సర్టిఫికెట్‌ను వర్సిటీ వీసీ ప్రసన్నశ్రీకి అందజేసి అభినందించారు.

News January 6, 2026

సంక్షేమమే లక్ష్యం.. అబ్కారీ శాఖపై మంత్రి కొల్లు సమీక్ష

image

రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌ వేదికగా మంగళవారం అబ్కారీ, మధ్యపాన నిషేధ శాఖపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్‌, ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, సమాజ సంక్షేమమే ధ్యేయంగా అబ్కారీ శాఖ పనిచేయాలని ఆదేశించారు. శాఖాపరమైన పనితీరులో పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు.

News January 6, 2026

10న రాజమండ్రిలో జాబ్ మేళా..!

image

నిరుద్యోగ రహిత రాజమండ్రిని నిర్మించడమే లక్ష్యంగా ఈనెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి మాజీ MP మార్గాని భరత్ సోషల్ మీడియా వేదికగా మంగళవారం వెల్లడించారు. ఆరోజు ఉదయం 9గం. నుంచి మంజీరా కన్వెన్షన్ సెంటర్ వద్ద జాబ్ మేళా జరుగుతుందన్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బి.ఫార్మసీ, MBA చదివిన వారు అర్హులన్నారు.

News January 6, 2026

పోలీసుల ‘వాట్సాప్’ నంబర్ ఇదే.. సేవ్ చేసుకోండి!

image

ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండానే సేవలు పొందేలా ప్రభుత్వం ‘వాట్సాప్ గవర్నెన్స్’ను అందుబాటులోకి తెచ్చిందని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. ప్రజలు తమ మొబైల్స్‌లో 9552300009 నంబరును సేవ్ చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ఈ-చలాన్ చెల్లింపు, ఎఫ్.ఐ.ఆర్ (FIR) కాపీలు, కేసు దర్యాప్తు స్థితిగతులను సులభంగా తెలుసుకోవచ్చన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని ప్రజలు సమయాన్ని ఆదా చేసుకోవాలని ఎస్పీ కోరారు.

News January 5, 2026

తూ.గో: పోలీసు పీజీఆర్ఎస్‌కు 26 ఆర్జీలు

image

తూ.గో. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కు 26 ఆర్జీలు వచ్చినట్లు ఎస్పీ డి.నరసింహకిశోర్‌ తెలిపారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం వహించరాదని స్పష్టం చేశారు.

News January 5, 2026

RJY: నేడు కలెక్టరేట్‌లో ‘రెవెన్యూ క్లినిక్’

image

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్‌తో పాటు ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై. మేఘస్వరూప్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని తహశీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. మండల స్థాయిలో డిప్యూటీ తహశీల్దార్లు PGRS నిర్వహిస్తారని స్పష్టం చేశారు. భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు.