India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చింతూరు మండలం నిమ్మలగూడెం రహదారి మలుపు వద్ద సత్తుపల్లి నుండి వస్తున్న టిప్పర్ ఆదివారం అర్ధరాత్రి వరద నీటిలో చిక్కుకుంది. డ్రైవర్ మర్రి నవీన్ పక్కనే ఉన్న తాటిచెట్టుపైకి ఎక్కి రాత్రంతా ఉండిపోయాడు. ఆ గ్రామానికి చెందిన వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో బోటుపై వెళ్లి డ్రైవర్‌ను సోమవారం ఒడ్డుకు తెచ్చారు. అతను నిడదవోలుకు చెందిన వ్యక్తి అని సమాచారం.
కాకినాడ భానుగుడి సెంటర్ నుంచి టూ టౌన్ వరకు గల రైల్వే ఫ్లైఓవర్‌పై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కాకినాడ డ్రైవర్స్ కాలనీకి చెందిన రెడ్డి చంద్రబోస్ (37) బైక్‌పై వెళ్తుండగా.. కాకినాడ నుంచి ఏలేశ్వరం వెళ్తున్న ఏలేశ్వరం డిపో బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు.
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సోమవారం రాత్రి 8 గంటల వరకు 14.60 అడుగులతో గోదావరి నీటిమట్టం నిలకడగా ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ నుంచి 14.60 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 3 పంట కాలువల ద్వారా 8,700 క్యూసెక్కుల నీటిని పంట సాగుకు విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
మామిడికుదురు మండలం కొమరాడ గ్రామానికి చెందిన పెచ్చేట్టి సుబ్బయ్య కరోనా సమయంలో మరణించారు. ఈ మేరకు బాధిత కుటుంబీకులకు రూ.లక్ష నగదును కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం అందజేశారు. అదేగ్రామానికి చెందిన కొర్లపాటి శ్రీరాములు డయాలసిస్‌తో బాధపడుతుండగా రూ.20 వేల సాయం అందించారు.
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని నెహ్రూ కాలనీకి చెందిన కింతాడ మంగా (40) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. ఆమె తన ఇంటి వద్ద నీళ్లు పట్టేందుకు మోటార్ స్విచ్ వేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది. ఈ ఘటనపై జగ్గంపేట ఏఎస్ఐ నూకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా భార్య మృతదేహంపై భర్త పడి ఏడ్చిన దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది.
మధ్యాహ్న భోజన పథకానికి ‘డొక్కా సీతమ్మ’ పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈమె భవానీశంకరం-నరసమ్మల(మండపేట) కూతురు. ఎందరో ఆకలి తీరుస్తున్న గొప్ప మనసు గల సీతమ్మను చూసి లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న ఆమెను పెళ్లి చేసుకున్నారు. పిఠాపురం మహారాజు, మంత్రి మారువేషాల్లో వచ్చి సీతమ్మ వద్ద భోజనం చేశారని, బ్రిటీష్ కింగ్ ఎడ్వర్డ్-7 పట్టాభిషేకానికి సీతమ్మ వెళ్లకపోతే ఆమె ఫొటో పెట్టి వేడుక చేశారని చెబుతుంటారు.
సామర్లకోట మాజీ కౌన్సిలర్ గోపీ దుర్గాభవాని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. సామర్లకోట పాత తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రస్తుత 7వ వార్డుకు చెందిన గోపీ దుర్గాభవానీ(35) ఉరేసుకొని మృతి చెందారు. దంపతుల మధ్య గొడవ జరగడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తనతో అప్పులు చేయించి భర్త మోసం చేశాడంటూ విశాఖపట్నంకు చెందిన అచ్యుతాంబ ఆదివారం ఆరోపించారు. కాకినాడ అర్బన్ జగన్నాథపురం ముత్తానగర్‌లో భర్త ఇంటి ముందు నిరసన చేపట్టారు. ముత్తానగర్‌కు చెందిన జయరాజు 2019లో తనను వివాహం చేసుకున్నారన్నారు. వ్యాపారం కోసం విశాఖలో పలువురి నుంచి రూ.28 లక్షలు తన ద్వారా అప్పుగా తీసుకున్నారని, 20 కాసుల బంగారం తాకట్టుపెట్టి రూ.10 లక్షలు ఇవ్వగా, తనను మోసం చేశాడని వాపోయారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని ఊడిమూడిలంక గ్రామంలో <<13725482>>పడవ బోల్తా<<>> పడిన ఘటనలో ఒకరు గల్లంతైన విషయం తెలిసిందే. సదరు వ్యక్తి ఊడుమూడి లంక గ్రామానికి చెందిన చదలవాడ విజయ్ కుమార్(38)గా స్థానికులు తెలిపారు. గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.
కేరళలో నిఫా వైరస్ జాడలు వెలుగు చూడటంతో కాకినాడ జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు కాకినాడ GGHలో నిఫా వైరస్ ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. ఈఎన్‌టీ వార్డు భవనంలో 6 బెడ్‌లతో వార్డు సిద్ధం చేశారు. అనస్థీషియా, మైక్రోబయాలజీ, మెడిసిన్, ఫల్మనాలజీ తదితర విభాగాలకు చెందిన వైద్యనిపుణులతో కమిటీని నియమించారు. మందులు, ఇతర వైద్య పరికరాలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.