EastGodavari

News July 26, 2024

ATMలలో జమ చేయాల్సిన డబ్బుతో ఉద్యోగి పరారీ

image

ATMలలో డిపాజిట్ చేయాల్సిన డబ్బుతో ఉద్యోగి పరారైన ఘటన రాజమండ్రిలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ఉద్యోగి అశోక్ కుమార్ ATMలలో నగదు డిపాజిట్ కోసం వెళ్లాడు. అయితే.. వాటిని డిపాజిట్ చేయకుండా ఉడాయించడంతో పోలీసులకు సమాచారం వచ్చింది. అశోక్ దాదాపు రూ.2.40 కోట్లతో పరారైనట్లు తెలిపారు. దీంతో పోలీసులు చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని అలర్ట్ చేసి అతడి కోసం గాలిస్తున్నారు.

News July 26, 2024

ధవళేశ్వరం వద్ద వరద పరిస్థితి ఇలా.. (తాజా అప్‌డేట్)

image

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద నిలకడగా ఉంది. ఇక్కడ వరద నీటిమట్టం 13.70 అడుగులుగా ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద 47.10 అడుగులకు వరద చేరడంతో అక్కడ సైతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ప్రస్తుతం 12.70 లక్షల క్యూసెక్కుల జలాలు సముద్రంలోకి వదలడంతో పలు లంక గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి.

News July 26, 2024

ధవళేశ్వరం బ్యారేజీ తాజా UPDATE

image

ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం ఉదయం 10 గంటలకు నీటిమట్టం 13.60 అడుగులకు చేరింది. దీంతో ఇరిగేషన్ అధికారులు 175 గేట్లను ఎత్తి 12.58 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. మూడు పంట కాలువలు ద్వారా 5,400 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు.

News July 26, 2024

పిఠాపురంలో NIEL IT ఏర్పాటు..?

image

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గురువారం కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పిఠాపురంలో కేంద్రప్రభుత్వ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (NIEL IT) ఏర్పాటుచేయాలని ఎంపీ కోరారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

News July 25, 2024

సౌదీలో చిక్కుకున్న యువకుడు ప్రయాణం వాయిదా

image

సౌదీ అరేబియాలో చిక్కుకున్న అంబాజీపేటలోని ఇసుకపూడికి చెందిన యువకుడు వీరెంద్రకూమార్‌ను ప్రభుత్వం బుధవారం స్వదేశానికి తీసుకువచ్చే చర్యలు చేపట్టింది. అయితే బాధితుడికి యాజమాని ఇంకా పాస్ పోర్ట్ ఇవ్వకపోవడంతో ప్రయాణం వాయిదా పడిందని అధికారులు తెలిపారు. సమస్యపై కలెక్టర్ మహేశ్ పాస్ పోర్ట్ అధికారులను సంప్రదింపులు చేసి, రెండు రోజుల్లో తీసుకువచ్చే అవకాశం ఉందని తెలిపారు.

News July 25, 2024

సీతానగరం: బాలికను అపహరించి అత్యాచారం

image

ఓ బాలికను అత్యాచారం చేసి వివాహం చేసుకున్న ఘటన సీతానగరంలో చోటుచేసుకుంది. ఎస్సై రామకృష్ణ కథనం మేరకు.. ఓ వ్యాపారి ఇంటి నిర్మాణానికి చినకొండేపూడి వాసి 16 ఏళ్ల వీరబాబు పనికోసం వెళ్లి, ఆ ఇంట్లో 16 ఏళ్ల బాలికను ఈ నెల 11న అపహరించుకుపోయాడన్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడి, ద్వారకా తిరుమలలో ఆమె మెడలో తాళి కట్టాడని తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని బుధవారం రిమాండ్‌కు తరలించారు.

News July 25, 2024

తూ.గో: రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

image

రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి శాంతించింది. ప్రస్తుతం నీటి ప్రవాహం13.70 అడుగులకు ఉంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. కాగా మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా నేడు, లేదా రేపటికి గోదావరి నది ప్రవాహం సాదారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

News July 25, 2024

కేంద్ర మంత్రిని కలిసిన రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి

image

రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి ఢిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పొగాకు అదనపు పంటపై జరిమానా మాఫీ చేయడం పట్ల ఆయనకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.

News July 24, 2024

రేపు ఏజెన్సీ పరిధిలోని పాఠశాలలకు సెలవు: కలెక్టర్ దినేశ్

image

రంపచోడవరం, చింతూరు డివిజన్‌లో అన్ని పాఠశాలలకు గురువారం జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సెలవు ప్రకటించారు. ఏజెన్సీలో భారీ వర్షాలు ఇంకా కురుస్తున్నందున, వాగులు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని బుధవారం ఆయన తెలిపారు. విద్యార్థులను బయటకు పంపకుండా ఇళ్ల వద్దే ఉంచాలని కోరారు. ప్రైవేట్ విద్యాలయాలు కూడా సెలవు పాటించాలని కోరారు.

News July 24, 2024

విద్యకు ప్రాధాన్యం.. విద్యార్థుల్లో ఆనందం

image

దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు రూ.10 లక్షలు కేటాయిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఉమ్మడి తూ.గో జిల్లాలో విద్యార్థులకు ఊరట నిచ్చింది. కాకినాడ JNTU పరిధిలో 341 అనుబంధ కళాశాలలు, నన్నయ వర్సిటీ పరిధిలో 434 కళాశాలలు ఉన్నాయి.