EastGodavari

News November 28, 2024

తూ.గో: ముమ్మరంగా వాహనాల తనిఖీలు

image

తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల ప్రకారం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో గురువారం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ముఖ్య కూడళ్లలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలు, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి జరిమానాలు విధించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ప్రమాదాల నివారణకు సహకరించాలని పోలీసులు కోరారు.

News November 28, 2024

రాజానగరం: 29న పీజీ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్స్

image

నన్నయ విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎం.ఏ, ఎం.కామ్, ఎంపీఈడీ, ఎంఎస్సీ కోర్సుల్లో భర్తీ చేయని సీట్లకు 29న స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నామని వీసీ వై.శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ పీజీసెట్ రాయకపోయినా, రాసి అర్హత సాధించకపోయినా స్పాట్ అడ్మిషన్‌లో పీజీ కోర్సులో ప్రవేశం పొందవచ్చన్నారు. డిగ్రీలో ఉత్తీర్ణత శాతం ఓసీ, బీసీలకు 50శాతం, ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం సాధించిన వారు అర్హులన్నారు.

News November 28, 2024

రేపు ఉమ్మడి తూ.గో జిల్లాలో భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం రేపు ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం ఉదయం TN-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 4రోజుల పాటు వర్షాలు కురుస్తాయంది. రేపు కాకినాడ, కోనసీమ,తూ.గో జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.

News November 28, 2024

రాజమండ్రి బ్రిడ్జికి నిధుల విడుదల

image

రాజమండ్రి హేవ్ లాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెంట్స్ స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం ద్వారా రూ.62.33 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కృషితో ఈ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం రూ.94.44 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం విడుదల చేసిన నిధులు వ్యయం చేసిన తరువాత మిగిలిన నిధులను విడుదల చేయనున్నారు.

News November 28, 2024

రాజమండ్రి: నేర సమీక్షా సమావేశం నిర్వహించిన SP

image

రాజమండ్రిలోని తూ.గో జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ బుధవారం జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రౌడీ షీటర్లు& పాత ముద్దాయిలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నాటు సారా, గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి దాడులు చేయాలని ఆదేశించారు. సైబర్ భద్రత, రోడ్డు భద్రత, మహిళా భద్రతపై అవగాహన కల్పించాలన్నారు.

News November 27, 2024

రాజమండ్రి: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్

image

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తూ.గో జిల్లా SP నర్సింహ కిషోర్ బుధవారం తెలిపారు. ఏప్రిల్ 25న రాజమండ్రికి చెందిన బి.రమేష్ SVS కోచింగ్ సెంటర్‌‌పై గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై అతను 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విశాఖ జిల్లాకు చెందిన నిందితుడు డి.నాగేశ్వరావును అదుపులోకి తీసుకున్నారు.

News November 27, 2024

కడియం: రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

image

కడియం మండలం వేమగిరి 216 జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందినట్లు స్థానిక ఎస్ఐ బి.నాగదుర్గ ప్రసాద్ తెలిపారు. వేమగిరి గట్టుకి చెందిన కల్లా దుర్గ ఆమె మేనకోడలు పితాని రూపాదేవి స్కూటీపై డిగ్రీ పరీక్షలు రాసేందుకు రాజమండ్రి వెళ్తుండగా వేమగిరి సెంటర్ వద్ద ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రూపాదేవి మృతిచెందగా మరో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.

News November 27, 2024

రాజమండ్రి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ముగ్గురు ఆత్మహత్యాయత్నం

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రాజమండ్రి జెఎన్ రోడ్డులోని సాయి సుధా రెసిడెన్సీలో బుధవారం ఉదయం ఒక కుటుంబంలోని భార్య, భర్త, కుమారుడు ముగ్గురు కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకొని తాగారు. అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News November 27, 2024

108 సేవలు నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు: కలెక్టర్ మహేశ్

image

వైద్యపరంగా అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్‌ను అభ్యర్థించి రవాణా, వైద్య సంరక్షణను అందించే 108 ఉచిత అత్యవసర సేవలు నిలిచిపోకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నట్లు కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన వైద్యరోగ్య శాఖ అధికారులు, 108 సమన్వయ అధికారులతో సమావేశం నిర్వహించారు. 108 వాహన డ్రైవర్లు ధర్నాకు దిగడంతో ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

News November 26, 2024

IPL: కాకినాడ కుర్రాడికి సువర్ణావకాశం

image

ఐపీఎల్లో ముంబై టీమ్‌ కొనుగోలు చేసిన కాకినాడ కుర్రాడు సత్యనారాయణరాజు రోహిత్, బుమ్రా, హార్దిక్, బోల్ట్ వంటి స్టార్ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోనున్నారు. వారి అనుభవాలను తెలుసుకుని కెరీర్‌ను పటిష్ఠం చేసుకునే సువర్ణావకాశం మన జిల్లా కుర్రాడికి దక్కింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే TEAM INDIA ఎంట్రీకి ఇదే తొలి అడుగు అవుతుందనడంలో సందేహం లేదు. దీనిపై మీ కామెంట్..