India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భద్రాచలం వద్ద గోదావరి వరద ఆదివారం 38.02 అడుగులుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎడతెరిపి లేని వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు గోదావరిలో కలుస్తుండటంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ రాత్రికి భద్రాచలం వద్ద వరద 43 అడుగులు దాటవచ్చని CWC అధికారులు అంచనా వేశారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉందన్నారు.
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఓ యువకుడిపై కేసు నమోదుచేసినట్లు SI రాజేశ్ కుమార్ తెలిపారు. పోలీసుల వివరాలు.. అయినవిల్లి మండలం తొత్తరమూడికి చెందిన యువకుడు వెంకటరమణ మండలంలోని ఓ గ్రామంలో బంధువుల ఇంటికి కొంతకాలం క్రితం వెళ్లాడు. ఈ క్రమంలో 15 ఏళ్ల బాలికను విలస గ్రామంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అప్పటినుంచి శారీరకంగా, మానసికంగా వేధించడంతో బాధితురాలి తల్లి ఫిర్యాదుచేసిందన్నారు.
ఏపీలో 62 మంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. తూ.గో జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హిమాన్షు కౌశిక్ రానున్నారు. అంబేడ్కర్ కోనసీమ జాయింట్ కలెక్టర్‌గా నిశాంతి నియమితులు కాగా.. ప్రస్తుతం అక్కడ జేసీగా ఉన్న నుపూర్ అజయ్ బదిలీ అయ్యారు. కాకినాడ జాయింట్ కలెక్టర్‌గా ఆర్.గోవిందరావు బదిలీపై రానున్నారు. రాజమండ్రి మున్సిపల్ కమిషనర్‌గా కేతన్ గార్గ్ నియమితులయ్యారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. సీఐ శ్రీధర్ వివరాల ప్రకారం.. ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన నరేశ్(38)కు మతిస్థిమితం లేదు. తరచూ గొడవ పడుతుంటాడు. ఇంటి వెనుక ఉండే అప్పారావును గతంలో కొట్టగా.. అతడి కొడుకు పోతురాజు నరేశ్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈనెల 15న పోతురాజు అతడి ఫ్రెండ్స్ రాజు, కె.రాంబాబు, శ్రీను, డి.రాంబాబుతో కలిసి దాడి చేయగా నరేశ్ మృతి చెందాడు.
☞ కడియంలో మహిళతో అసభ్యప్రవర్తన.. అరెస్ట్
☞ పిఠాపురంలో దాడిపై జగన్ స్పందించరా?: వర్మ
☞ 45 గ్రామాలు మునిగే ఛాన్స్: కోనసీమ కలెక్టర్
☞ ది ఆర్యాపురం కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు
☞ తూ.గో జిల్లాలో తీర ప్రాంతాల్లో అలల అలజడి
☞ 10వేల హెక్టార్లలో పంట నష్టం: తూ.గో కలెక్టర్
☞ నిండుకుండలా డొంకరాయి జలాశయం
☞ జాబ్ మేళాతో యువతకు ఉపాధి: మంత్రి సుభాశ్
☞ వైసీపీ నేతలపై దాడులు ఆపాలి: జక్కంపూడి
తూ.గో జిల్లా కడియంలో ఓ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు CI తులసీధర్ వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. కడియంకు చెందిన చల్లా కొండరాజు అదే ఏరియాకు చెందిన వివాహితతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె భర్తపై దాడి చేశాడు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు SI నాగ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి కొండరాజును అరెస్టు చేశారు. అతడిని కోర్టుకు తరలించగా రిమాండ్ విధించింది.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారుల తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి తూ.గో. జిల్లాలోని పెద్దాపురంలో మాత్రమే నవోదయ విద్యాలయం ఉంది. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.
ఎన్నికల సందర్భంగా ఉమ్మడి తూ.గో. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన 24 మండలాల పరిధిలోని 70 మంది తహశీల్దార్లు తిరిగి సొంత జిల్లాకు రానున్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి 70 మంది ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాలకు బదిలీపై వెళ్లారు.
ఉప్పాడ ప్రాంతంలో సముద్ర కోత నుంచి తీరానికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాకినాడ వాకలపూడిలోని లైట్ హౌస్ నుంచి ఉప్పాడ కొత్త హార్బర్ ప్రాంతం వరకు కోత ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య 14.5 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మించాలని నిర్ణయించారు. సుబ్బంపేట నుంచి హార్బర్ వరకు కెరటాల ప్రభావం తగ్గించడానికి గ్రోయల్ గట్లు నిర్మించనున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించినట్లు డీఈవో కే.వాసుదేవరావు తెలిపారు. అయితే.. విద్యార్థులకు మాత్రమే సెలవు ప్రకటిస్తున్నామని, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది యథావిధిగా హాజరు కావాలని ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.