India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు ప్రకటించారు. రాజమండ్రి రూరల్, అనపర్తి, కాకినాడ, కోనసీమ, సామర్లకోట, పెద్దాపురం, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ప్రజల చరవాణిలకు సంక్షిప్త సందేశాలు సైతం వచ్చాయి.
భారీ వర్షాల కారణంగా శనివారం తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు పి.ప్రశాంతి, మహేశ్ కుమార్, షాన్‌మోహన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం సాధారణ సెలవు కావడంతో వర్షాల తీవ్రతను పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామన్నారు.
➠ SHARE IT..
భారీ వర్షాల కారణంగా శనివారం తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్లు ప్రశాంతి, మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఓ ప్రకటన జారీ చేశారు. ఆదివారం సాధారణంగా సెలవు కావడంతో వర్షాల తీవ్రతను పరిశీలించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పెరిగింది. వాగులు, కాలువల్లోకి గోదావరి నీరు చేరుతుండటంతో ఈ సీజన్‌లో మాత్రమే కనిపించే ‘చీరమేను’ రకం చేపలు లభ్యమవుతున్నాయి. వరదల సమయంలో దొరికే ఈ చేపలకు మార్కెట్‌లో గిరాకీ ఎక్కువ. ఈ చిన్ని చేపల రుచి అమోఘంగా ఉంటుందని గోదావరి జిల్లా వాసులు చెబుతుంటారు. అయితే.. ఇవి మామూలు వలలకు చిక్కవు. దోమతెరల వంటి ప్రత్యేక వలలతో పడతారంట.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం కరవాకకు చెందిన మత్స్యకారుడు కొప్పనాతి రాంబాబు(38) చేపల వేటకెళ్లి మృతి చెందినట్లు నగరం SI పి.సురేష్ శుక్రవారం తెలిపారు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఉదయం వేటకు వెళ్లిన రాంబాబు.. వల విసురుతుండగా ప్రమాదవశాత్తు అదే వలలో చిక్కుకుని నీటిలో పడి మునిగిపోయాడన్నారు. రాంబాబు మృతితో కరవాకలో విషాదం నెలకొంది.
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో జనం రోడ్ల మీదే వలలు వేసి చేపలు పడుతున్నారు. భారీ వర్షాలకు చుట్టూ ఉన్న చెరువులు నుంచి చేపలు రోడ్డుపైకి వస్తున్నాయి. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఎదురుగా ఉన్న రోడ్డుపైకి భారీగా చేపలు చేరుతున్నాయి. రోడ్డు పైనే చేపలు పడుతూ యువకులు సందడి చేస్తున్నారు.
వర్షాల కారణంగా తూ.గో జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా సిబ్బందిని అందుబాటులో ఉంచామని ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డివిజన్, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. రాజమండ్రిలో జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నెం.0883-2463354,7382299960, టౌన్ 94408 12585, రూరల్ 7382585487 నంబర్లను సంప్రదించాలని కోరారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుఫాన్ బాధితులు ఫోన్ నెంబర్లు 9913148180, 7801007227, 7095454117, 9989900094 నెంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు. అలాగే రాజమండ్రిలో ఉమ్మడి తూ.గో జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నెం. 0883-2463354,7382299960.
ఉమ్మడి తూ.గో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పి.గన్నవరం మండలం గంటిపెదపూడిలో నదిపాయకు వేసిన తాత్కాలిక గట్టు గురువారం తెగిపోయింది. దీంతో గంటిపెదపూడి, బురుగులంక, అదిగెలవారిపాలెం, ఉడేమూడిలంక గ్రామాల మధ్య రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు పడవలపైనే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులో రజా హుస్సేన్‌కు చెందిన ఏటీఎం కార్డును ఓ వ్యక్తి కాజేసి రూ.40,600 విత్ డ్రా చేశాడు. బాధితుడు గురువారం నగరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుస్సేన్ ఖాతాలో బుధవారం రూ.50 వేలు జమయ్యాయి. ఏటీఎం నుంచి హుస్సేన్ రూ.10 వేలు డ్రా చేశాడు. అతనిని గమనిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి హుస్సేన్ ఏటీఎం కార్డు కాజేసి డూప్లికేట్ కార్డు ఇచ్చాడు. ఒరిజినల్ కార్డుతో మిగతా నగదు కాజేశాడు.
Sorry, no posts matched your criteria.