EastGodavari

News November 14, 2024

పంచారామక్షేత్రంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె పూజలు

image

సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయాన్ని మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మితా  దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఆమె ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలు అందించారు. ఆమె మాట్లాడుతూ.. కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

News November 14, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాలో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా

image

తూర్పుగోదావరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. గురువారం లీటరు పెట్రోల్ ధర రూ.109.40 ఉండగా డీజిల్ ధర రూ.96.79 ఉంది. అలాగే కాకినాడ జిల్లాలో పెట్రోల్ రూ.108.91 ఉండగా డీజిల్ రూ.96.78 గా ఉంది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో లీటరు డీజిల్ ధర రూ. 97.55 ఉండగా, పెట్రోల్ రూ.109.73 గా ఉంది.

News November 14, 2024

పెద్దాపురం: హత్యకేసులో ముద్దాయికి జీవిత ఖైదు

image

కల్లు గీత కత్తితో ఇద్దరిని హతమార్చిన కేసులో ముద్దాయికి బుధవారం జీవిత ఖైదు విధిస్తూ పెద్దాపురం కోర్టు తుది తీర్పు ఇచ్చినట్లు జగ్గంపేట సీఐ శ్రీనివాస్ తెలిపారు. జగ్గంపేటకు చెందిన వానశెట్టి సింహాచలం భార్యతో నైనపు శ్రీను వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు అతడిని, దానికి సహకరించిన బత్తిన భవానీని హతమార్చాడు. దీనిపై 2013లోనే కేసు నమోదైంది. ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత తుది తీర్పు వెలువడింది.

News November 13, 2024

గోకవరం: 1250 కేజీల నకిలీ టీపొడి స్వాధీనం..

image

గోకవరం మండలం రంపఎర్రంపాలెంలోని రైస్ మిల్లులో నకిలీ టీపొడి తయారు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 31 బస్తాల్లో నిల్వ ఉన్న 1250 కేజీల నకిలీ టీపొడిని ల్యాబ్‌కు పంపించామన్నారు. వాటితోపాటు 15క్రీం మెటీరియల్ బ్యాగులను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. టీపొడి నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. 

News November 13, 2024

సైబర్ నేరాలపై తస్మాత్ జాగ్రత్త : ఎస్పీ నరసింహ

image

ప్రస్తుత తరుణంలో సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి షేర్ చేయడం గాని, సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చే కాల్స్‌, మెసేజ్‌లకు ఎట్టి పరిస్థితులలోను స్పందించవద్దన్నారు. అపరిచిత వ్యక్తులను నమ్మి ఆన్లైన్లో డబ్బులు పంపించడం చేయరాదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

News November 13, 2024

పెద్దాపురం: కిడ్నాపర్ నుంచి బాలికను రక్షించిన పోలీసులు

image

పెద్దాపురం పరదేశమ్మ కాలనీ వద్ద కిడ్నాపర్ నుంచి ఓ బాలికను పెద్దాపురం పోలీసులు బుధవారం తెల్లవారుజామున రక్షించారు. ఇటీవల HYD మియాపూర్‌లో కిడ్నాప్ చేసి పెద్దాపురం పరదేశమ్మ పేటలో బాలికను నిర్బంధించినట్లు ఒక ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశామన్నారు. కొత్త ఆనంద్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని, ఘటనపై డీఎస్పీ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

News November 13, 2024

తూ.గో జిల్లాలో ఇసుక ధరలు ఇవే

image

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రీచ్‌ల వారీగా ఇసుక ధరల వివరాలను జిల్లా గనుల, భూగర్భ శాఖ మంగళవారం ప్రకటించింది. వేమగిరి, కడియపులంకలో రూ.61.37, వంగలపూడి 1,2లలో రూ 70.19, 67.59, ములకలలంక, కాటవరంలలో రూ.61.36, తీపర్రు రూ.96.02, ముక్కామల 2 రూ.116.49, కాకరపర్రు 117.02, పందలపర్రు రూ.104.42గా నిర్ణయించారు. ఈ ధరలకు మించి వసూలు చేస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.

News November 12, 2024

నేను వైసీపీని వీడట్లేదు: MLC రవీంద్రబాబు

image

వైసీపీని తాను వీడుతున్నట్లు వస్తున్న వార్తలను ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు ఖండించారు. కాకినాడలోని క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. వైసీపీను వీడాల్సిన అవసరం తనకు లేదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని కులాలతోపాటు దళితులకు కూడా పెద్దపీట వేసిన వైసీపీ అధినేత జగన్‌తోనే తన ప్రయాణమని ఆయన స్పష్టం చేశారు.

News November 12, 2024

గోకవరంలో మహిళపై లైంగిక దాడికి యత్నం.. నలుగురిపై కేసు

image

మహిళపై అత్యాచారయత్నం చేసిన రాజమండ్రిలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్న యువకులపై కేసు నమోదైంది. SI పవన్ కుమార్ కథనం..ఓ మహిళ రాజమండ్రి -గోకవరం వచ్చి అక్కడ నుంచి కృష్ణునిపాలెంకు నడుచుకుంటూ వెళ్తోంది. సమీప పెట్రోల్ బంకు వద్ద యువకుడు గమనించి, పెట్రోలు బంకులోకి లాక్కెళ్లాడు. ఆమె కేకలు వేయడంతో కొందరు రక్షించారు. యువకుడితో పాటు ముగ్గురు ఫ్రెండ్స్ పారిపోగా.. సోమవారం పట్టుకుని కోర్టుకు తరలించామని తెలిపారు.

News November 12, 2024

బడ్జెట్ కేటాయింపులో మన ఉమ్మడి తూ.గో జిల్లాకు ఎంతంటే..!

image

రాష్ట్ర ప్రభుత్వం సోమవారం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఎంత నిధులు కేటాయించారంటే..(కోట్లలో)
➤జలవనరుల ప్రాజెక్టులకు: రూ. 82.77,
➤అన్నదాత సుఖీభవ: రూ. 4.500,
➤ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం: రూ.422,
➤కాకినాడ జేఎన్టీయూ: రూ. 55,
➤ఆదికవి నన్నయ యూనివర్శిటీ : రూ.11.55,
➤పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీ: రూ5.18 కోట్లు కేటాయించారు.