India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమలాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 10వ తరగతి బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిషోర్ శుక్రవారం తెలిపారు. ఫిర్యాదు అందిన 36 గంటల్లో నిందితుడిని పట్టుకుని అమలాపురం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించిందని తెలిపారు. అతడిని కొత్తపేట జైలుకి పంపామన్నారు.
కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాయితీపై కంది పప్పు, బియ్యం విక్రయాలను ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు.వైసిపి పాలనలో అడ్డూ అదుపు లేకుండా పెరిగిన ధరలు తగ్గించి పేదలకు సాధ్యమైనంత ఊరట కల్పించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంఎస్ ఓ ప్రసాద్ పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాజమండ్రి రూరల్, అనపర్తి ,కోనసీమ, సామర్లకోట,ఏజెన్సీ తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందన్నారు. పనుల కోసం అడవులలోకి వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.
ఉత్తరాఖండ్ యాత్ర, జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రలకు భారత్ గౌరవ యాత్ర స్పెషల్ రైళ్లు ఆగస్టు 4, 8 తేదీల్లో నడుపుతున్నామని IRCTC ఏరియా మేనేజర్ రాజా గురువారం తెలిపారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ లో రైళ్ల వివరాల బ్రోచర్లను స్టేషన్ మేనేజర్ రంగనాథ్, సీటీఐ చంద్రమౌళితో కలిసి ఆవిష్కరించారు. ఉత్తరాఖండ్ యాత్ర ఆగస్టు 8న విశాఖపట్నంలో బయలు దేరి రాజమహేంద్రవరం వస్తుందన్నారు. 11 రోజులు యాత్ర సాగుతుందన్నారు.
బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన కొత్తపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. విద్యార్థిని బుధవారం స్నేహితురాలితో మరుగుదొడ్డికి వెళ్ళింది. బాత్‌రూమ్‌లో నక్కిన ఆగంతకుడు కత్తితో బెదిరించి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు రక్షించారు.దీనిపై గురువారం కొత్తపేట ఎస్సై అశోక్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పెద్దాపురం మరిడమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం అమ్మవారి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఈవో రామ్మోహన్ రావు, ధర్మకర్త బ్రహ్మాజీ తెలిపారు. గురువారం రాత్రి అమ్మవారికి మహా కుంభం నిర్వహించినందున శుక్రవారం ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. శనివారం మహా సంప్రోక్షణ అనంతరం మరిడమ్మ తల్లి దర్శనాలు యధావిధిగా కొనసాగుతాయని రామ్మోహన్‌రావు తెలిపారు.
కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో గురువారం ఓ బాలుడు మిస్సింగ్ అయినట్లు సమాచారం రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సదరు బాలుడి తల్లిదండ్రులు, గ్రామస్థులతో కలిసి పోలీసులు అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టారు. అయినా ఆచూకీ దొరకలేదు. ఎందుకైనా మంచిదని పోలీసులు వెళ్లి మరోసారి ఇంట్లో వెతకగా.. ఆ బాలుడు మంచం కింద నక్కి కనిపించాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఉప్పాడ తీర ప్రాంతంలో ఎప్పుడు అలలు మింగేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ఉప్పాడలో ఇప్పటివరకు 1,360 ఎకరాలు కోతకు గురయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనతో చెన్నైకి చెందిన NCR నిపుణుల బృందం ఉప్పాడ తీరంలో కోత కట్టడికి 20ఏళ్లకు ప్రణాళిక సిద్ధం చేసింది. రక్షణ గోడ, గ్రోయన్ ఏర్పాటుకు రూ.200-250 కోట్ల వరకు అవుతుందని పేర్కొంది.
ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించిన చించినాడ బ్రిడ్జి మృత్యు వారధిగా మారింది. నిర్వహణ లోపంతో 24 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన గోతులు పడి తరచూ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. వంతెనపై ఎక్కడికక్కడ గోతులు ఏర్పడడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వంతెనపై ఏర్పాటు చేసిన సోలార్ లైట్లు అలంకార ప్రాయంగా మారాయి. రహదారిని అభివృద్ధి చేయాలని కోరుతూ స్థానికులు బుధవారం ధర్నా చేశారు.
నిడదవోలు నియోజకవర్గంలోని కొందరు వైసీపీ నేతలు టీడీపీ, జనసేనలో చేరేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. 3ఏళ్ల కిందట పురపాలక ఎన్నికల్లో 27 వార్డుల్లో వైసీపీ, ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి గెలవగా.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో పలువురు కౌన్సిలర్లు పార్టీ మారేందుకు అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. నిడదవోలు నుంచి గెలిచిన కందుల దుర్గేశ్ మంత్రి అయిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.