EastGodavari

News June 15, 2024

రాజమండ్రిలో ఫ్లైఓవర్ కింద 2 మృతదేహాలు

image

రాజమండ్రి సిటీలో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శంభూనగర్ ఫ్లై ఓవర్ కింద శనివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు మృతి చెంది ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రెండో పట్టణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. వీరిద్దరూ సోదరులని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

News June 15, 2024

అంతర్వేదిలో హోంమంత్రి వంగలపూడి అనిత పూజలు

image

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో కొలువుదీరిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన హోం మంత్రి అనితకు అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆమె అర్చకుల నుంచి వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఈవో సత్యనారాయణ మంత్రికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

News June 15, 2024

రాజమండ్రిలో ‘స్పా’ ముసుగులో వ్యభిచారం

image

రాజమండ్రిలో ‘స్పా’ కేంద్రం ముసుగులో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో తూ.గో జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. ఏవీ అప్పారావు రోడ్డులో జిమ్, స్పా కేంద్రం నిర్వహిస్తున్నారు. అందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులతో పాటు సిబ్బందిగా ఉన్న మరో యువతిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News June 15, 2024

పిఠాపురం మండలంలో దారుణ హత్యకు కారణమిదే

image

పిఠాపురం మండలం భోగాపురంలో ప్రసాద్ అనే వ్యక్తి హత్యకు గురైన విషయం<<13436940>> తెలిసిందే.<<>> ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ప్రసాద్(48), పద్మరాజు కాకినాడలో పనికి వెళ్లేవారు. డబ్బుల విషయంలో వీరి మధ్య గొడవ జరగ్గా.. ఇవ్వకపోతే చంపేస్తానని ప్రసాద్ పద్మరాజును బెదిరించాడు. కోపం పెంచుకున్న పద్మరాజు.. ఆలయం ముందు నిద్రించిన ప్రసాద్‌ను బండరాయితో మోది హతమార్చాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News June 15, 2024

తూ.గో.: తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు నంబరు మార్పు

image

విశాఖపట్నం నుంచి కడప వయా తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి మీదుగా వెళ్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్‌ను రైల్వే అధికారులు మార్పు చేశారు. ప్రస్తుతం 17487/ 17488 నంబర్లపై రైలు నడుస్తుండగా, జూలై నెల 1వ తేదీ నుంచి 18521/ 18532 నంబర్లగా రైల్వే అధికారులు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పును రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు. ☛  SHARE IT

News June 14, 2024

తూ.గో.: రేపటి నుంచి వేట షురూ

image

చేపల సంతానోత్పత్తి, మత్స్య సంపద వృద్ధి లక్ష్యంగా సముద్రంలో 2 నెలల పాటు అమలుచేసిన చేపల వేట నిషేధం శుక్రవారం అర్ధరాత్రితో ముగియనుంది. దీంతో శనివారం నుంచి వేట షురూ కానుంది. ఏప్రిల్ 14 నుంచి వేట నిషేధం ప్రకటించారు. కాకినాడ జిల్లాలో తొండంగి నుంచి తాళ్ళరేవు వరకు 94 కిలోమీటర్ల మేర సాగర తీరం విస్తరించి ఉంది. జిల్లాలో 1,95,184 మంది మత్స్యకారుల్లో 36,101 మంది సముద్రంలో వేట ద్వారా ఉపాధి పొందుతున్నారు.

News June 14, 2024

తూ.గో: మంత్రులుగా అప్పుడు ముగ్గురు.. ఇప్పుడు ఇద్దరు

image

ఉమ్మడి తూ.గో నుంచి గత ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులుగా చేశారు. చెల్లుబోయిన- బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, I&PR శాఖ, పినిపే విశ్వరూప్- సాంఘిక సంక్షేమ శాఖ, దాడిశెట్టి రాజా- రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా చేశారు. ఇప్పుడు పవన్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్&టెక్నాలజీ, అటవీ శాఖలు, వాసంశెట్టికి లేబర్, ఫ్యాక్టరీలు, వైద్య, బీమా సేవలు శాఖలు దక్కాయి.

News June 14, 2024

ఉమ్మడి తూ.గో మంత్రులకు దక్కిన శాఖలివే

image

ఉమ్మడి తూ.గో నుంచి ముగ్గురికి మంత్రివర్గంలో చోటు దక్కగా.. వారికి నేడు శాఖలు కేటాయించారు. ☞ పిఠాపురం MLA పవన్ కళ్యాణ్- డిప్యూటీ సీఎం, పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్&టెక్నాలజీ, అటవీ శాఖలు. ☞ రామచంద్రపురం MLA వాసంశెట్టి సుభాశ్- లేబర్, ఫ్యాక్టరీలు, ఇన్‌స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్. ☞ నిడదవోలు MLA కందుల దుర్గేశ్- కందుల దుర్గేశ్ – పర్యాటకం, సినిమాటోగ్రఫీ.

News June 14, 2024

అన్న క్యాంటీన్లు.. 30వేల మందికి ఆహార భద్రత

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్న క్యాంటీన్ల ద్వారా 30 వేల మందికి ఆహార భద్రత లభించనుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో అవి మూతపడ్డాయి. ప్రస్తుతం చంద్రబాబు అన్న క్యాంటీన్ల పునః ప్రారంభానికి సంతకం చేశారు. జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, అమలాపురం తదితర ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నారు.

News June 14, 2024

మంత్రి పదవి రానందుకు బాధ లేదు: గోరంట్ల

image

తాను మంత్రి పదవి ఆశించానని, అయితే ఇవ్వడం ఇవ్వకపోవడం అధిష్ఠానం నిర్ణయమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి అన్నాక ఎన్నో లెక్కలు ఉంటాయని, మంత్రి పదవి దక్కనందకు తనకు ఎలాంటి బాధలేదని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో హద్దుమీరి ప్రవర్తించి ఏ అధికారిని వదిలేది లేదని, కలెక్టరేట్ నుంచి పంచాయతీ వరకూ ఆరోపణలు ఉన్నవారిపై విచారణ చేయిస్తామన్నారు.