India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ పాలన ఎమర్జెన్సీ కాలంనాటి రోజులను తలపించిందని బీజేపీ స్టేట్ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి అన్నారు. రాజమండ్రిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కేశారో ప్రజలు గమనించే ఓడించారని తెలిపారు. బాధ్యతతో మెలుగుతూ ఏపీ అభివృద్ధికి సహకరిద్దామని పురందీశ్వరి అన్నారు.
సమస్యల పరిష్కారం నిమిత్తం 2 వారాలకొకసారి కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ స్వయంగా పిఠాపురంలో అందుబాటులో ఉంటానని ముందుకు వచ్చినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడ సభా వేదికపై వెల్లడించిన విషయం తెలిసిందే. పవన్‌కు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కలెక్టర్ షాన్‌మోహన్ సోమవారం పిఠాపురం విచ్చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
కాకినాడకు చెందిన ఇద్దరు మాజీ కార్పొరేటర్లు గోడి సత్యవతి, గరిమెళ్ల శర్మ బీజేపీ గూటికి చేరారు. గోడి సత్యవతి భర్త వెంకట్ సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. గతంలో BJPలో ఉన్న వీరు YCPలో చేరారు. తిరిగి ఆదివారం సొంతగూటికి రాగా.. బీజేపీ స్టేట్ చీఫ్, రాజమండ్రి MP పురందీశ్వరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్‌కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి 2 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 40 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బస్సులను సుమారు రూ.80 లక్షల వ్యయంతో సిద్ధం చేస్తున్నారు. భక్తులు రాకపోకలు సాగించేందుకు ప్రస్తుతం ఉన్న బస్సులు పూర్తిస్థాయిలో సరిపోవటం లేదు. కొన్ని బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో రెండు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నారు.
అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి 2 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 40 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బస్సులను సుమారు రూ.80 లక్షల వ్యయంతో సిద్ధం చేస్తున్నారు. భక్తులు రాకపోకలు సాగించేందుకు ప్రస్తుతం ఉన్న బస్సులు పూర్తిస్థాయిలో సరిపోవటం లేదు. కొన్ని బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో రెండు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని మూలస్థానం అగ్రహారం పంట కాలువలో ఆదివారం స్థానిక రైతులకు అరుదైన ‘డెవిల్ ఫిష్’ దొరికింది. ఒంటిపై మచ్చలతో ఉన్న ఈ చేపను డెవిల్ ఫిష్ (దెయ్యం చేప)గా పిలుస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. వాటి చుట్టూ ఉండే చేపలను గాయపరిచి, చంపి తినడం ఈ చేపలకు అలవాటని అన్నారు. ఇవి ఉన్న చోట మిగతా చేపలు అంతరించిపోతాయని పేర్కొన్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం నుంచి 6 స్టాక్ పాయింట్లలో ఉచిత ఇసుక విధానం అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధమైందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం పేర్కొన్నారు. స్టాక్ పాయింట్ల వద్ద టన్ను ఇసుక రూ.245లకు విక్రయించనున్నట్లు తెలిపారు. అలాగే అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ కలెక్టరేట్ వద్ద నేడు ఉదయం 10 గంటల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరుగుతుందని, ఫిర్యదులు అందజేయవచ్చని అన్నారు.
పామర్రు మండలం కోటిపల్లిలో ఆరాద్రి అంజనీకుమారి అనే వృద్ధురాలి భూమి కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని మంత్రి వాసంశెట్టి సుభాశ్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే వెళ్లి ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించారు. భూమిని ఆక్రమించుకున్నది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అంజనీకుమారికి ధైర్యం చెప్పి.. తక్షణమే ఆమెకు న్యాయం జరగాలని పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 9న వికాస ఔట్‌సోర్సింగ్ జిల్లా సంస్థ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో అవుట్ సోర్సింగ్ సంస్థ జిల్లా కార్యాలయంలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. బీఎస్సీ, బీటెక్, బీసీఏ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని తెలిపారు.
రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తూ.గో. జిల్లా పర్యటన ఖరారైంది.
జూలై 8న రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అనపర్తికి చేరుకుంటారు. అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వంద పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రాజమండ్రిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Sorry, no posts matched your criteria.