India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తూ.గో. జిల్లా పర్యటన ఖరారైంది.
జూలై 8న రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అనపర్తికి చేరుకుంటారు. అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వంద పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రాజమండ్రిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
రాజోలు మండలం పొన్నమండకు చెందిన ఓ బాలికను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు SI పృథ్వీ తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అయ్యప్పస్వామి అదే గ్రామానికి చెందిన బాలికను రెండేళ్ల క్రితం పరిచయం చేసుకొని భయపెట్టి రహస్యంగా పెళ్లిచేసుకున్నాడు. గతనెల 26న బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 2 నెలల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకోగా విషయం తెలిసిన బాలిక పోలీసులకు ఫిర్యాదుచేసింది.
ప్రపంచ జూనోసిస్ డే రోజునే ప్రాణాంతక రేబిస్ వ్యాధితో కార్మిక నాయకుడు మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. తాళ్లరేవు మండలం జెల్లావారిపేటకు చెందిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు మందనక్క తనుకురాజు (64) నెల క్రితం కుక్కకాటుకు గురయ్యాడు. వైద్యం చేయించుకోగా 2 రోజుల క్రితం అతనికి రేబిస్ సోకినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.
నిడదవోలుకు చెందిన ఓ యువతి (22) కోనసీమ జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రాజేష్ రెండేళ్లుగా ప్రేమించున్నారు. ప్రియుడికి ఏడాది క్రితం మరో యువతితో వివాహమైంది. రాజేష్‌ను రెండో పెళ్లి చేసుకుంటానని యువతి పేరెంట్స్‌తో చెప్పగా నిరాకరించారు. మనస్తాపంతో తాడేపల్లిగూడెంలో తాను నర్సుగా పనిచేస్తున్న ఆసుపత్రిలో శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మెరుగైన చికిత్సకోసం విజయవాడ తరలించగా చికిత్సపొందుతూ చనిపోయింది.
కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు సమీపంలో పోలవరం కాలువ గట్టు వద్ద కొన్నిరోజులుగా సంచార జాతులకు చెందిన కొందరు గుడారాలు వేసుకొని ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వారు ఒక ఎనుబోతును బలిఇచ్చి పూజలుచేస్తుండగా స్థానికులు గుర్తించి ప్రశ్నించారు. ఈ క్రమంలో గొడవ జరిగి సంచారజాతులకు చెందిన ఓ వ్యక్తి స్థానికుడిపై కత్తితో దాడి చేశాడు. తుని గ్రామీణ పోలీసులకు ఫిర్యాదుచేయగా.. విచారణ చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమండ్రి MP దగ్గుబాటి పురందీశ్వరిని స్థానిక జేఎన్ రోడ్డులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ది, పర్యటక పరంగా అభివృద్ధి, తదితర అంశాలపై వారు చర్చించారు.
ఐ.పోలవరం మండలంలోని యానాం-ఎదురులంక బాలయోగి వారధి పైనుండి ఓ మహిళ గోదావరిలో దూకి శనివారం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. సకాలంలో మత్స్యకారులు సాయం అందించి రక్షించడంతో ప్రాణాలతో బయటపడింది. అనంతరం ఆమెను యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెను ఐ.పోలవరం మండలం కేశనకుర్రు గ్రామానికి చెందిన గుత్తుల పద్మ కుమారిగా పోలీసులు గుర్తించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో గురువారం అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. కాగా ఘటనాస్థలాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం సాయంత్రం పరిశీలించారు. దోషులను వెంటనే శిక్షించేందుకు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు.
విభజన హామీలు, ఇతర పెండింగ్ అంశాల కోసం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో సహచర మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌లతో కందుల దుర్గేశ్ భేటీ అయ్యారు. IAS అధికారి ప్రేమ్ చంద్రారెడ్డితో కలిసి పలు అంశాలపై చర్చించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడి 9 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా కోల్‌కతాలో మొట్ట మొదటిసారి రూ.90 నాణేన్ని ముద్రించారు. ఆ నాణేన్ని అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త కృష్ణ కామేశ్వర్ సేకరించారు. ఆ నాణెం 40 గ్రాముల బరువు ఉండి, పూర్తిగా వెండితో తయారు చేసి ఉన్నట్లు తెలిపారు. నాణేనికి ఒక వైపు రూ.90 ముఖ విలువ, మరో వైపు రిజర్వ్ బ్యాంక్ చిహ్నం ముద్రించి ఉందని కామేశ్వర్ చెప్పారు.
Sorry, no posts matched your criteria.