EastGodavari

News July 5, 2024

దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ పవన్‌కళ్యాణ్ పూజలు

image

ఉపముఖ్యమంత్రి, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ప్రస్తుతం వారాహి ఏకాదశ దినదీక్షలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదిత్యయంత్రం ఎదుట ఆశీనులై వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ సూర్యారాధన చేశారు.

News July 4, 2024

తూ.గో.: BREAKING: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

image

అమలాపురం రూరల్ మండలం కామనగురువు పంచాయతీ పరిధిలోని కిమ్స్ ఆసుపత్రి సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సు ఢీకొన్న ఘటనలో బట్నవిల్లి గ్రామానికి చెందిన తొత్తరమూడి బుల్లి సత్యనారాయణ (53) అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

News July 4, 2024

తూ.గో.: బీ.టెక్‌తో ఉద్యోగాలు

image

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కియా ఆధ్వర్యంలో డిప్లమా, బీ.టెక్ చదివిన వారికి ట్రైనీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తూ.గో. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండలరావు గురువారం తెలిపారు. 2019- 2024లో ఉత్తీర్ణత సాధించి, 18-25 సంవత్సరాలలోపు వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. https://forms.gle/7EzcxnL6Z2CqcbpC6 వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 4, 2024

కత్తిపూడి జాతీయ రహదారిపై ప్రమాదం.. మహిళ మృతి

image

కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ(62) అక్కడికక్కడే మృతి చెందింది. కత్తిపూడి నుంచి రావికంపాడు వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు గాయలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే అథారిటీ గాయాలైన భర్తను అంబులెన్సులో తుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News July 4, 2024

తూ.గో: ఈ నెల 10న బైకుల వేలం

image

తూ.గో జిల్లాలోని ఎస్ఈబీ దేవరపల్లి స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు ఈ నెల 10వ తేదీన వేలం నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనే వారు తమ ఆధార్ కార్డు తీసుకురావాలని, రూ.5 వేల ధరావతు చెల్లించాలని సీఐ కె.వెంకటేశ్వరస్వామి తెలిపారు.. పాట దక్కించుకున్న వారు అదే రోజు వేలం సొమ్ముతో పాటు GST కలిపి చెల్లించాలని సూచించారు.

News July 4, 2024

రాజానగరం: రూ.40 లక్షల నిధుల గోల్ మాల్

image

రాజానగరం మండలం జి.యర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో రూ.40 లక్షలు గోల్ మాల్ జరిగిందని సమాచారం. దీనికి సంబంధించి బిజినెస్ కరస్పాండెంట్ నానిబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారని తూ.గో. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. మహిళా సభ్యులు చేసిన ఫిర్యాదుతో జూన్ 20న విచారణ చేపట్టి నివేదికను అందించారన్నారు. DRDA అధికారి జనార్ధన్ రావు దీనిపై విచారణ చేస్తారన్నారు.

News July 4, 2024

రామచంద్రపురం: బాలికను అపహరించి అత్యాచారం

image

ప్రేమ పేరుతో బాలికను యువకుడు అపహరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన రామచంద్రపురంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు జూన్ 24న బాలిక అదృశ్యమైంది. సురేశ్ ప్రేమ పేరుతో ఆమెను హైదరాబాద్ తీసుకువెళ్లి ఒక లాడ్జిలో అత్యాచారం చేశాడని ఎస్సై సురేశ్ బాబు తెలిపారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదుతో యువకుడిపై కిడ్నాప్, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశామన్నారు. సురేశ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందన్నారు.

News July 4, 2024

ప్రత్తిపాడు: బాలుడి విక్రయం కేసులో మహిళ అరెస్ట్

image

ఏడాదిన్నర బాలుడి విక్రయం కేసులో ప్రత్తిపాడుకు చెందిన అమ్ములును మహారాష్ట్ర పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆమెను ముంబైకి తీసుకువెళ్లారని ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు. మానవ అక్రమ రవాణా కేసులో నిందితురాలి కోసం ముంబై కంజూర్మార్క్ పోలీసులు 3 రోజులుగా గాలిస్తున్నారు. నిందితురాలిగా అనుమానిస్తున్న తోట మంగతాయారు పరారీలో ఉంది. ఆమె బంధువు అమ్ములు కేసులోని వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చిందని అరెస్టు చేశారు.

News July 4, 2024

తూ.గో: నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్స్

image

వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం నిర్వహించే సదరం స్లాట్ బుకింగ్ శిబిరాలు గురువారం నుంచి తూ.గో జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జులై నుంచి సెప్టెంబర్ వరకు వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. దీనికోసం మీసేవా, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ముందస్తు స్లాట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.

News July 4, 2024

కాలేజీలో సీట్లు పునరుద్ధరించాలని ఎంపీ వినతి

image

రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీలో పీజీ సీట్లను పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి ప్రతాప్ రావు గణపతిరావు జాదవ్‌ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ, దగ్గుబాటి పురందీశ్వరి కోరారు. కేంద్ర మంత్రిని కలిసి బుధవారం వినతిపత్రం సమర్పించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు.