India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం నిర్వహించే సదరం స్లాట్ బుకింగ్ శిబిరాలు గురువారం నుంచి తూ.గో జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జులై నుంచి సెప్టెంబర్ వరకు వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. దీనికోసం మీసేవా, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ముందస్తు స్లాట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.
అల్లూరి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం జిల్లాలోని పలు లోతట్టు గ్రామాల్లో పర్యటించారు. ఈ క్రమంలో పెదబయలు అనే గ్రామం వద్ద ప్రజా సమస్యలు చెప్పేందుకు వచ్చిన బాలంనాయుడుకు 100 ఏళ్ల వయసు అని, అతను మాజీ ఎంపీపీ అని తెలిసి సంతోషపడ్డారు. అతనిని ఎత్తుకొని అందర్నీ ఆశ్చర్య పరిచారు. ప్రజా సమస్యల పట్ల నాయుడు శ్రద్ధను కలెక్టర్ మెచ్చుకొని అభినందించారు.
తూర్పు గోదావరి జిల్లాలో 99.05% పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం పూర్తయిందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ విషయాన్ని ఆమె మంగళవారం రాత్రి మీడియాకు తెలియజేశారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 2,41,771 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా 2,39,479 మందికి పెన్షన్లను అందించామని స్పష్టం చేశారు.
మొబైల్ యాప్, వెబ్‌సైట్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చునని ఏపీఈపీడీసీఎల్ రాజమండ్రి ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షణ ఇంజినీర్ టీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. రాష్ట్ర తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు ఈ వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఛాన్స్ లేదన్నారు.
రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ తూ.గో జిల్లాలోని పలు నియోజకవర్గాలలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. రాజమండ్రిలో గోదావరి గట్టుపై ఉన్న ఎస్వీ రంగారావు విగ్రహం వద్ద, ధవళేశ్వరంలో జరిగే ఎస్వీ రంగారావు జయంతి వేడుకలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు విజ్జేశ్వరం, ఒంటి గంటకు కొండ గుంటూరులలో జరిగే ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి దుర్గేశ్ పాల్గొంటారు.
మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలోని శ్రీ బాలా బాలాజీ స్వామి వారి ఆలయంలో బుధవారం బ్రహ్మశ్రీ డా.చాగంటి కోటేశ్వరరావు గారితో వేంకటేశ్వర వైభవం ప్రవచనం ఏర్పాటు చేసినట్లు గ్రంధి మాధవి మంగళవారం తెలిపారు. సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ప్రవచనం జరుగుతుందన్నారు. వెంకటేశ్వర వైభవ్ అనే అంశంపై ప్రవచనం చేస్తారని తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విజయవాడ పోలీసులు యువతి మిస్సింగ్ కేసును ఛేదించారు. దాదాపు 9నెలల తరువాత యువతి ఆచూకీ లభ్యమైంది. భీమవరానికి చెందిన శివకుమారి తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఓ యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకువస్తున్నారు.
అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా తనముద్ర వేసుకున్నారు. ఎంతలా అంటే.. జిల్లాలోని 2 వంతెనలకు ఆయన పేరు పెట్టుకునేంత. మామిడికుదురు-అప్పనపల్లిని కలిపే వంతెనకు ‘శుక్లా వారధి’ అని.. లుటుకుర్రు-పాశర్లపూడిని కలిపే వంతెనకు ‘హిమాన్షు శుక్లా రామసేతు’ అని ఆయా గ్రామ పంచాయతీలలో తీర్మానం చేసి నామకరణం చేసుకున్నారు. ఈ వంతెన నిర్మాణంలో హిమాన్షు శుక్లా ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రావిరాల మహేశ్ కుమార్ రానున్నారు. మహేశ్ కుమార్ ప్రస్తుతం APSWREIS సెక్రటరీగా పని చేస్తున్నారు. కాగా.. ఇక్కడి నుంచి బదిలీ అయిన హిమాన్షు శుక్లా పోస్టింగ్ గురించి మెన్షన్ చేయలేదు.
ఉమ్మడి తూ.గో జిల్లా రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంగా ఇమ్మానియేలు ఒక్క రోజు మాత్రమే పనిచేసి రిటైర్ అయ్యారు. స్కూల్ అసిస్టెంట్‌గా పని చేసిన ఆయన పదోన్నతిపై హెచ్‌ఎంగా జూన్ 29న బోర్నగూడెం ఆశ్రమ పాఠశాలలో జాయిన్ అయ్యారు. జూన్ 30తో ఆయనకు 62 ఏళ్ల వయసు నిండటంతో పదవీ విరమణ చేశారు. తోటి ఉపాధ్యాయులు ఆయనను మంగళవారం ఘనంగా సన్మానించారు.
Sorry, no posts matched your criteria.