India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి తూ.గో జిల్లా రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంగా ఇమ్మానియేలు ఒక్క రోజు మాత్రమే పనిచేసి రిటైర్ అయ్యారు. స్కూల్ అసిస్టెంట్‌గా పని చేసిన ఆయన పదోన్నతిపై హెచ్‌ఎంగా జూన్ 29న బోర్నగూడెం ఆశ్రమ పాఠశాలలో జాయిన్ అయ్యారు. జూన్ 30తో ఆయనకు 62 ఏళ్ల వయసు నిండటంతో పదవీ విరమణ చేశారు. తోటి ఉపాధ్యాయులు ఆయనను మంగళవారం ఘనంగా సన్మానించారు.
కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా డిప్యూటీ CM పవన్ షెడ్యూల్‌ని అధికారులు ప్రకటించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. 11 నుంచి 11:30 వరకు RWS అధికారులతో, 11:30 నుంచి 12గంటల వరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో, మధ్యాహ్నం 12 నుంచి 1వరకు అటవీ, 2గంటల వరకు రీజినల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు.
గొల్లప్రోలులో సోమవారం పెన్షన్ల పంపిణీ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.10 లక్షల బీమా చెక్కును లబ్ధిదారు చెక్క చిట్టితల్లికి అందించారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గ్రూప్ యాక్సిడెంట్ కార్డు పాలసీ ద్వారా బీమా పరిహారాన్ని అందజేశారు. పాలసీ తీసుకున్న వ్యక్తి కరెంటు స్తంభంపై పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించగా.. అతని భార్యకు బీమా చెక్కు అందించారు. తపాలా శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఓ యువకుడు కరెంట్ షాక్‌తో చనిపోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. చొల్లంగి ఇందిరమ్మ కాలనీకి చెందిన పిల్లి వినయ్ (20) చిన్నాన్న నిర్మిస్తున్న ఇంటి వద్ద మోటార్ ఆన్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తెగిపడిన విద్యుత్ తీగను చేత్తో పట్టుకోగా షాక్‌కు గురయ్యాడు. కాకినాడ GGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. వినయ్ డిగ్రీ ఫైనల్ ఈయర్ చదువుతున్నాడు. కేసు నమోదైంది.
తూ.గో జిల్లాలో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉ. 5 గంటల నుంచి ప్రారంభమైంది. 4,092 మంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ నగదు పంపిణీ చేసినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. సాయంత్రం 7.30 గంటల వరకు 95.87 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయ్యిందన్నారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడులు పెరిగాయని, వాటిని అరికట్టి దోషులను శిక్షించి శాంతిభద్రతలను కాపాడాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ రాష్ట్ర డీజీపీని కోరారు. రాజమండ్రిలో ఎప్పుడూ లేని విష సంస్కృతిని టీడీపీ ప్రేరేపిస్తోందని ఆరోపిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అమరావతిలోని డీజీపీ కార్యాలయంలో ఆయననను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎన్నికల అనంతరం జరిగిన ఘటనలపై విచారణ జరిపించాలన్నారు.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో మిగిలిన సీట్లను ఈ నెల 4న భర్తీ చేస్తామని జిల్లా సమన్వయకర్త వెంకట్రావు తెలిపారు. ఉదయం 10 గంటలకు స్పాట్ అడ్మిషన్ లాటరీ పద్ధతి ద్వారా ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో మిగిలిన సీట్లు భర్తీ చేస్తారని, ఆసక్తి కలిగిన విద్యార్థులు వారికి అనువుగా ఉండే పాఠశాలకు వెళ్లి దరఖాస్తు చేయాలన్నారు. ➠ SHARE IT..
పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్స్‌లో ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో అమలు చేయాలని ఉచిత విద్య విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు కొమ్ము సత్తిబాబు, సెక్రటరీ సుధీర్ బాబు, ట్రెజరీ దేవి డిమాండ్ చేశారు. రాజమండ్రిలోని కలెక్టరేట్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.
మంత్రి వాసంశెట్టి సుభాశ్ మానవత్వం చాటుకున్నారు. రామచంద్రపురంలోని సూర్యనగర్‌లో ఉంటున్న సుహాస్ అనే బాలుడు బ్రెయిన్ ఫిట్స్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకొని బాలుడి తండ్రి శివ (ఆర్టీసీ కండక్టర్), తల్లి ఉమాదేవితో మాట్లాడారు. తక్షణ సాయం కింద తన క్యాంపు కార్యాలయంలోనే రూ.10 వేలు అందజేశారు. ప్రతి నెలా తనవంతు సాయంగా రూ.6 వేలు ఇస్తానని వారికి హామీ ఇచ్చారు. దీంతో ఆ దంపతులు వాసంశెట్టికి కృతజ్ఞతలు తెలిపారు.
పిఠాపురం నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని స్థానిక MLA, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ.. పిఠాపురం అభివృద్ధి కోసం ఏం చేయగలనా..? అంటూ నిత్యం ఆలోచిస్తానని, ఈ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చాకే తనను ఊరేగించండని అక్కడి ప్రజలతో అన్నారు. ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పని చేస్తానన్నారు. డొక్కా సీతమ్మ పేరుతోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.