EastGodavari

News April 4, 2024

రాజానగరంలో ఈనెల 12 పవన్ కళ్యాణ్ పర్యటన

image

రాజానగరం నియోజకవర్గంలో ఈ నెల 12న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తారని కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ తెలిపారు. కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News April 4, 2024

కొవ్వూరు: ఇద్దరి యువకులపై పోక్సో కేసు నమోదు

image

బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరి యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు. కొవ్వూరు మండలం వాడపల్లికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్, అతని సోదరుడు అఖిల్ సహకారంతో ప్రేమిస్తున్నానని వెంటపడి బుధవారం అసభ్యంగా ప్రవర్తించి, దౌర్జన్యం చేశారు. దీనిపై బాలిక కొవ్వూరు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు యువకులపై ఎస్సై జుబేర్ పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News April 4, 2024

తూ.గో.: ఈ నెల 15 నుంచి చేపల వేట నిషేధం

image

సముద్ర జలాల్లో ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేటను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా మత్స్యశాఖ అధికారులు బుధవారం తెలిపారు. మెకానిజం మోటార్ బొట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల వేటను నిషేధిస్తూ మత్స్యశాఖ కమిషనర్ సూర్య కుమారి ఆదేశాలు జారీ చేశారన్నారు. చేప, రొయ్యల జాతుల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

News April 3, 2024

అమలాపురం జనసేన ఇన్‌ఛార్జ్ రాజీనామా

image

అమలాపురం జనసేన ఇన్‌ఛార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. జనసేన కంచుకోటను టీడీపీకి ధారాదత్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి నుంచి నేటి వరకు జనసేన జెండా జీవితంగా, పార్టీ తన ప్రాణంగా బతికానన్నారు. తాను రాసిన లేఖకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి కూడా అధిష్ఠానానికి వీలు చిక్కని ప్రవర్తనతో విసుగు చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

News April 3, 2024

కాకినాడ: కమ్యూనిటీ భవనంలో డెడ్‌బాడీ కలకలం

image

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామంలోని ఓ కమ్యూనిటీ హాల్ నందు మృతదేహం కలకలం రేకెత్తిస్తోంది. బుధవారం ఉదయం స్థానికులు కమ్యూనిటీ హాల్లో ఒక వ్యక్తి మృతిచెంది ఉండటాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News April 3, 2024

తూ.గో.: 3 పార్లమెంటు స్థానాల్లో.. 3 పార్టీలు

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 3పార్లమెంట్ స్థానాల నుండి TDP- జనసేన- బీజేపీ కూటమిలోని 3 పార్టీలు పోటీ చేస్తుండటంతో ఇక్కడ రాజకీయంగా కొంత ఆసక్తి నెలకొంది. కాకినాడ నుండి జనసేన అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, రాజమండ్రి నుండి బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురందీశ్వరి బరిలో నిలిచారు. అమలాపురం నుండి టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ఉన్నారు. మరి గెలుపు మూడు పార్టీల అభ్యర్థులను వరించేనా..? మీ కామెంట్.?

News April 3, 2024

తూ.గో: మంత్రి వేణు వ్యాఖ్యలపై మీ కామెంట్..?

image

వాలంటీర్లపై టీడీపీ కక్ష కట్టిందని సమాచార శాఖ మంత్రి, రూరల్ వైసీపీ ఎమ్మేల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. మంగళవారం కడియంలోని గిరజాల రైస్‌మిల్ ఆవరణలో మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామి నాయుడుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తూ ఎందరో వికలాంగులకు, వృద్ధులకు సేవలందిస్తున్న వాలంటీర్లను కించపరచడం టీడీపీకి తగదన్నారు.
– మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్..?

News April 2, 2024

కోనసీమ జిల్లాకు రేపు చంద్రబాబు రాక 

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు  చంద్రబాబు డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు రేపు(బుధవారం) రానున్నారు.  కొత్తపేట, ద్రాక్షారామ నందు నిర్వహించనున్న బహిరంగ సభలకు ఆయన హాజరవుతారని టీడీపీ శ్రేణులు తెలిపాయి. ఈ సభలో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారన్నారు.  

News April 2, 2024

కాకినాడ ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థి నేపథ్యం ఇదే..

image

కాకినాడ ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా M.M పల్లం రాజును కాంగ్రెస్‌ అధిష్ఠానం మంగళవారం ఖరారు చేసింది. ఈయన కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి 1989లో భారత జాతీయ కాంగ్రెస్ తరఫున లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ సహాయమంత్రిగానూ పనిచేశారు. 2022 నవంబరు 23న ఏపీ కాంగ్రెస్ ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యాడు. తాజాగా ఎంపీ టికెట్ దక్కించుకున్నారు.

News April 2, 2024

రాజమండ్రి ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థి నేపథ్యం ఇదే..

image

రాజమండ్రి ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజును కాంగ్రెస్‌ అధిష్ఠానం మంగళవారం ఖరారు చేసింది. అమలాపురం ప్రాంతానికి చెందిన రుద్రరాజు కాంగ్రెస్‌లో సీనియర్‌ నేత. కార్యకర్త స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. YS షర్మిల రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌ అయ్యే వరకూ ఆయనే కొనసాగారు. అనంతరం 2024 జనవరి 16న రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా కాంగ్రెస్ హై కమాండ్ నియమించింది.