EastGodavari

News April 2, 2024

పుట్టెడు దు:ఖంలోనూ ఓ కుటుంబం ఔదార్యం

image

పుట్టెడు దు:ఖంలోనూ అవయవదానంతో ఔదార్యం చాటుకుంది ఓ కుటుంబం. ఇటీవల మారేడుబాకలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ బ్రెయిన్డెడ్ కావడంతో రాజు(38) అనే వ్యక్తి కోమాలోకి చేరుకున్నాడు. అతడి భార్య మణి, కుటుంబ సభ్యులు రాజు అవయవాల దానానికి అంగీకారం తెలిపారు. విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రి నుంచి రాజు మృతదేహాన్ని స్వగ్రామం మారేడుబాక తీసుకు రానున్నారు. మృతుడికి పిల్లలు భార్గవ ప్రవీణ, అవినాష్ ఉన్నారు.

News April 2, 2024

దారుణం.. దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓ నీచుడు దివ్యాంగురాలిపై అత్యాచారానికి యత్నించాడు. ఆత్రేయపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన దివ్యాంగురాలు(30) తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లగా ఒక్కతే ఇంట్లో ఉంది. సోమవారం అదే గ్రామానికి చెందిన అంజి అనే యువకుడు ఇంట్లోకి వెళ్లి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. కేకలు వేయడంతో పారిపోయాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక యువతి వారికి చెప్పడంతో ఆత్రేయపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News April 2, 2024

కూటమిలో BJP కలవాలని నేనూ కృషి చేశా: RRR

image

TDP-జనసేన కూటమితో BJP కలవాలని పవన్ కృషి చేశారని, ఇదే విషయమై ఎవరికీ తెలియకుండా తాను ఎన్నో రోజులు ఢిల్లీలో గడిపానని నరసాపురం MP రఘురామకృష్ణరాజు అన్నారు. ‘రచ్చబండ’లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సమాచార లోపంతో తనకు టికెట్ రాలేదని, ఒకట్రెండు రోజుల్లో చంద్రబాబు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. నియంతను నువ్వెంత అని ప్రశ్నించిన వ్యక్తినని, ప్రజల కోసమే ఒంటరి పోరాటం చేస్తున్నానని ఆయన తెలిపారు.

News April 1, 2024

కాకినాడలో పేలిన ఆయిల్ ట్యాంకర్..UPDATE

image

శంఖవరం మండలం కత్తిపూడి శివారు ప్రాంతంలో మరమ్మతుల కోసం తీసుకువచ్చిన ఆయిల్ ట్యాంకర్‌కు వెల్డింగ్ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలి ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా
మృతులు కత్తిపూడికి చెందిన కొచ్చర్ల ప్రభాకర్ (38), బూరా సోమరాజు(39)గా గుర్తించారు. బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

News April 1, 2024

కోనసీమ: ఈ నెల 3న చంద్రబాబు రాక

image

ఈ నెల 3వ తేదీన కోనసీమ జిల్లా రావులపాలెంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నట్లు ఆ పార్టీ కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.

News April 1, 2024

పిఠాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్

image

జనసేన అధినేత అనారోగ్యానికి గురైన నేపథ్యంలో పిఠాపురంలో ఎన్నికల కార్యక్రమం వాయిదా వేసుకొని హైదరాబాద్ వెళ్లిన విషయం తెలిసిందే. కాగా అక్కడ వైద్యపరీక్షలు చేయించుకొని సోమవారం మధ్యాహ్నం పిఠాపురం చేరుకున్నారు. ఈ తరుణంలో ప్రచారానికి సంబంధించి ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు.

News April 1, 2024

తూ.గో: ఎలక్షన్@2024.. పోలింగ్ శాతం పెరిగేనా..?

image

ఉమ్మడి తూ.గోలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. అనపర్తి-87.4, రాజానగర-87.4, రామచంద్రపురం-87.1, మండపేట-86.9, జగ్గంపేట-85.6, కొత్తపేట-84.4, ముమ్మిడివరం-83.6, తుని-83.2, అమలాపురం-83.1, గన్నవరం- 82.4, పత్తిపాడు-81.3, పిఠాపురం-81.2, పెద్దాపురం-80.6, రాజోలు- 80, రంపచోడవరం-77.4. రాజమండ్రి రూరల్‌-74.2, కాకినాడ రూరల్-74, కాకినాడ సిటీ-67, రాజమండ్రి సిటీ-66.2. ఈసారి ఆ శాతం పెరిగేలా అధికారుల చర్యలెలా ఉన్నాయి..?

News April 1, 2024

రాజోలు: 578 ఓట్ల తేడాతో MLA అయ్యాడు!

image

రాజోలులో 1952-2019 వరకు 15సార్లు ఎన్నికలు జరిగితే.. 3సార్లు అతి తక్కువ ఓట్ల తేడాతో MLA పీఠం దక్కించుకున్నారు. 1989లో ఎం.గంగయ్య(కాంగ్రెస్‘ఐ’) AVS నారాయణరాజు(TDP)పై 611 ఓట్ల తేడాతో గెలవగా.. 1999లో AVS నారాయణరాజు(TDP) ఏ.కృష్ణంరాజు(కాంగ్రెస్‘ఐ’)పై 578 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019లో జనసేన నుంచి బరిలో దిగిన రాపాక బి.రాజేశ్వరరావు(వైసీపీ)పై 814 ఓట్ల తేడాతో గెలిచినా.. ఆయన తర్వాత వైసీపీలో చేరారు.

News April 1, 2024

పవన్.. ప్రజల మధ్య చిచ్చుపెడితే ఊరుకోం: వంగా గీత

image

పిఠాపురం వైసీపీ MLA అభ్యర్థి వంగా గీత జనసేనాని పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. పిఠాపురంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ చేబ్రోలు సభలో పవన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్నారు. MLA, MPగా తాను 100 ఆలయాలను అభివృద్ధి చేశానని, మతపరమైన విషయాలను తెరపైకి తెచ్చి ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. పవన్ గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా వచ్చీరాని మాటలు మాట్లాడటం సరికాదన్నారు.

News April 1, 2024

చంద్రబాబుతో నల్లమిల్లి భేటి.. న్యాయం చేస్తానని హామీ!

image

టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం రాత్రి పార్టీ అధినేత చంద్రబాబుతో భేటి అయినట్లు తెలుస్తోంది. జోన్-2 ఇన్‌ఛార్జి సుజయ్ కృష్ణ రంగారావుతో కలిసి బాపట్లలో సీబీఎన్‌ను కలిశారు. అనపర్తి టికెట్ మార్పుతో TDP శ్రేణుల్లో భావోద్వేగ పరిస్థితులను వివరించారని సమాచారం. నల్లమిల్లిని వదులుకునే ఉద్దేశం లేదని, ఒకట్రెండు రోజుల్లో సమస్య పరిష్కరించి న్యాయం చేస్తానని సీబీఎన్ హామీ ఇచ్చారట.