India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లిలోని ఉప్పాడ చేపల రేవులో ఓ వ్యక్తికి 5 అడుగుల పొడవు ఉన్న 80 కిలోల చేప వలలో చిక్కింది. ఇది నల్లమట్ట జాతికి చెందిన చేప అని ..ఇవి చాలా అరుదుగా లభిస్తాయని అన్నారు. దీనికి వేలం నిర్వహించగా ఓ వ్యాపారి రూ.7 వేలకు కొనుగోలు చేసినట్లు మత్స్యకారులు తెలిపారు.
దేవీపట్నం మండలం గోదావరిలో పాపికొండల బోట్ విహార యాత్రను భారీ వర్షం కారణంగా బుధవారం నుంచి నిలిపివేస్తున్నామని టూరిజం అధికారులు ప్రకటించారు. ఈ ప్రాంతంలో రెండు రోజుల పాటు పిడుగులు, ఉరుములతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణం శాఖ ప్రకటించడంతో సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ ఆదేశాల మేరకు నిలిపివేసినట్లు తెలిపారు. తిరిగి ప్రకటించే వరకు బోట్ యాత్ర ఉండదని పర్యాటకులు గమనించాలని కోరారు.
కాకినాడ జిల్లా తుని మండలం RSపేటలోని ఓ బావిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు బీహార్‌కు చెందిన ఉత్తమ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. బేకరీలో కుక్‌గా పని చేస్తున్న ఉత్తమ్.. గత 10 రోజులుగా కనబడటం లేదని బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతడు బావిలో శవమై కనిపించడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేను పురస్కరించుకొని ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాల (డ్రగ్స్) వినియోగం, వాటి దుష్ప్రభావాలపై చేపట్టిన ఈ ర్యాలీని పుష్కర్ ఘాట్ వద్ద ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సమాజానికి చేటు చేస్తున్న డ్రగ్స్ నియంత్రణే లక్ష్యంగా పని చేస్తామన్నారు.
పిఠాపురం మాజీ MLA, టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మకు MLC పదవిపై హామీ దక్కినట్లు సమాచారం. కూటమి పొత్తులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ముందుకు రాగా.. వర్మ ఆ సీటును త్యాగం చేశారు. అటు పవన్‌తోనూ ప్రచారంలో పాల్గొని గెలుపులో తనవంతు పాత్ర పోషించారు. ఇప్పటికే MLC విషయంలో TDP అధినేత, CM చంద్రబాబు వర్మకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వర్మ సైతం ‘X’లో పోస్ట్ చేశారు.
ఈ నెల 29న ఏపీ డిప్యూటీ సీఎం,పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ కొండగట్టుకు పయనమయ్యారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రచార సమయంలో కొండగట్టులోనే వారాహి వాహన పూజ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వారాహి దీక్షలో ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన అంజన్న సన్నిధికి వస్తున్నారు.
తల్లి మరణించిన కాసేపటికి కొడుకు కన్నుమూసిన విషాద ఘటన తాళ్లరేవులో జరిగింది. మృతుడి భార్య 8ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లింది. నూకరాజుకు పక్షవాతం ఉండడంతో తల్లి కామేశ్వరి చేపల వ్యాపారం చేసి చూసుకొనేది. మంగళవారం రక్తపోటు రాగా ఆమెను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. నూకరాజుకు తల్లిని చూపించి దహనసంస్కారాలకు తీసుకెళ్లారు. దీంతో కాసేపటికే కొడుకు కన్నుమూశారు.
అన్నవరం సత్యదేవుని దర్శన విధానంలో మార్పులు చేపట్టారు. దశమి, ఏకాదశి, పౌర్ణమి తదితర పర్వదినాలు, రద్దీ రోజుల్లో శీఘ్ర దర్శనం రూ.200, ప్రదక్షిణ దర్శనం రూ.300 టికెట్లు మధ్యాహ్నం వరకు నిలిపివేయాలని ఈవో ఆదేశించారు. మధ్యాహ్నం మూడు తరువాతే రూ.300 ప్రదక్షిణ దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఎక్కువ సమయం నిరీక్షించడం, సాధారణ దర్శనానికి వచ్చే వారికి ఇబ్బందులు ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఉమ్మడి తూ.గో జిల్లా మారేడుమిల్లి మండలం వేటుకూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కె.మాధురి డిప్యూటీ కలెక్టర్ ఎంపికైన సందర్భంగా గ్రామస్థులు అభినందన సభ నిర్వహించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోగా.. తల్లి ఉమామహేశ్వరి కష్టపడి చదివించారు. మాధురి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగారని సర్పంచ్ మల్లేశ్వరి అన్నారు. గ్రామానికే పేరు తీసుకొచ్చారని కొనియాడారు. ఐఏఎస్ సాధించడమే తన ధ్యేయమని మాధవి అన్నారు.
తూ.గో జిల్లా వ్యాప్తంగా పశు సంచార వాహనాల్లో ఖాళీగా ఉన్న 5 పైలట్ పోస్టుల భర్తీకి ఈనెల 28న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. రాజమండ్రి పశు వైద్యశాలలో శుక్రవారం 10AM నుంచి 2PM వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.
☞ SSC పాసై ఉండాలి
☞ 2 (OR) 3ఏళ్ల అనుభవంతో హెవీ లైసెన్స్ ఉండాలి
☞ వయసు: 35 ఏళ్లలోపు
☞ డ్యూటీ టైమింగ్స్: 8AM-5PM
☞ వేతనం నెలకు రూ.12వేలు
Sorry, no posts matched your criteria.