India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డిప్యూటీ సీఎం, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ అమ్మవారి మాలలో దర్శమమిచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ MLAలకు ఆయన శాసనసభ వ్యవహారాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే నియోజక వర్గంలోని సమస్యలపై ఆయన దూకుడు కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ అవగాహన కార్యక్రమానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ కూడా హాజరయ్యారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట కాలువలు, మురుగు కాలువలు, గుర్రపు డెక్క తొలగింపునకు ఆమోదం లభించిందని గోదావరి డెల్టా చీఫ్ ఇంజినీర్ సతీశ్ కుమార్ సోమవారం తెలిపారు. మొత్తం 306 పనులకు రూ.20.76 కోట్లు మంజూరు చేశారన్నారు. రూ. 31.50 కోట్లతో 430 పనులు చేసేందుకు ప్రతిపాదనలు పంపించగా.. తొలి ప్రాధాన్యతగా 306 పనులకు నిధులు కేటాయించారని తెలిపారు. మిగిలిన పనులకు త్వరలో నిధులు మంజూరు అవుతాయన్నారు.
సీఎం చంద్రబాబు DSCపై తొలి సంతకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి జులై1న షెడ్యూల్ విడుదల కానుంది. అయితే తూ.గో జిల్లా వ్యాప్తంగా 1,346 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో DSC కోసం అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే..!
తూ.గో జిల్లా గోపాలపురానికి చెందిన మాజీ మహిళా వాలంటీర్ సోమవారం ఆత్మహత్యకు యత్నించింది. గోపాలపురంలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తూ రాజీనామా చేసిన వాలంటీర్ భర్త 6 నెలల క్రితం మృతి చెందాడని బంధువులు తెలిపారు. దీంతో ఆమె జంగారెడ్డిగూడెంలో పుట్టింటికి వెళ్లింది. 3 నెలల నుంచి ఆరోగ్యం బాగోలేక పోవడంతో కుటుంబ సభ్యులు అప్పు చేసి వైద్యం చేయించారు. ఆర్థిక సమస్యలు, ఉద్యోగం లేదని ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం.
మైనర్ బాలికను గర్భవతి చేసిన నిందితునికి 15 సంవత్సరాల జైలు శిక్ష రూ.7వేల నగదు జరిమానా విధిస్తూ కాకినాడ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. జిల్లా ఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు.. అమలాపురం మద్దాల వారి పేటలో 2018 ఏప్రిల్ 2న తల్లిదండ్రులు లేని సమయంలో మైనర్ బాలికకు మత్తు పానీయాలు ఇచ్చి గణపతి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేశారు.
రాజమండ్రి స్టేషన్ మీదుగా రద్దు చేసిన 26 ట్రైన్లలో 3 రైళ్లను రైల్వేశాఖ పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం నుంచి విశాఖ-లింగంపల్లి మధ్య జన్మభూమి ఎక్స్‌ప్రెస్ యధావిధిగా నడవనుంది. అలాగే కాకినాడ పోర్ట్-పాండిచ్చేరి మధ్య సర్కార్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ పోర్టు-విజయవాడ మధ్య మెమూ ఎక్స్‌ప్రెస్‌లను కూడా యధావిధిగా నడపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
➠ SHARE IT..
మామిడికుదురు మండలం నగరం గ్రామంలో సరిహద్దులోని కొబ్బరి చెట్ల విషయమై ఘర్షణకు దిగిన 2 కుటుంబాలపై కేసులు నమోదు చేశామని ఎస్సై సురేష్ సోమవారం తెలిపారు. నగరం కొత్త రోడ్డుకు చెందిన వెలుగొట్ల సూర్యకుమారి ఫిర్యాదు మేరకు ఒక కేసు.. వెలుగొట్ల విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశామన్నారు. 2 కుటుంబాలు సరిహద్దులోని కొబ్బరి చెట్ల విషయంలో గొడవపడి గాయపడ్డారన్నారు. దీనిపై విచారణ చేపట్టినట్లు SI తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం (పీజీఆర్ఎస్)’ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో తూ.గో జిల్లా ఎస్పీ పి.జగదీష్ సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీలను ఎస్పీ జగదీష్ స్వయంగా పరిశీలించి స్వీకరించారు. ప్రజా సమస్యలపై వచ్చిన ఫిర్యాదులకు తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు.
రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి 23 రైల్వే సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. కడియం- నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్‌ల ఆధునికీకరణ నేపథ్యంలో ఆగస్టు 11 వరకు రత్నాచల్, సర్కార్, తదితర ముఖ్యమైన 23 రైళ్లను నిలిపివేశారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ఈ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల అభ్యర్థన మేరకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్నట్లు పేర్కొన్నారు.
మూడు, నాలుగు రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం రానున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. ఆదివారం ఆయన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో పట్టణ శివారులోని ఇల్లింద్రాడ వద్ద ఓ రైస్‌మిల్లులో సమావేశమయ్యారు. పవన్ పిఠాపురం ప్రజలను కలుసుకోవాలనే ఆత్రుతతో ఉన్నారని తెలిపారు. ఉపముఖ్యమంత్రిగా, 5 శాఖల బాధ్యతలు ఆయనపై ఉన్నాయని, వాటికి న్యాయం చేస్తూనే నియోజకవర్గంలో పర్యటిస్తారని చెప్పారు.
Sorry, no posts matched your criteria.