India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాజమండ్రి నగర పాలక సంస్థ పరిధిలో ఇప్పటికీ తమ ఇంటి నిర్మాణం పూర్తి చేయని వారు తక్షణమే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ పి.ప్రశాంతి బుధవారం సూచించారు. ఇప్పటికే నోటీసులు అందుకున్నవారు, అదనపు ఆర్థిక సహాయం (AFA) పొందిన లబ్ధిదారులు గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ధవళేశ్వరం బ్యారేజీపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోతున్న ఓ యువకుడిని మంగళవారం పోలీసులు కాపాడారు. మనస్తాపంతో బ్యారేజీపై నుంచి దూకేందుకు ప్రయత్నిస్తుండగా, అతని భార్య తన భర్త ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు 112కి ఫోన్ చేసింది. ఎస్పీ ఆదేశాలతో హుటాహుటిన బ్యారేజీపైకి చేరుకున్న పోలీసులు అతడిని కాపాడారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సెప్టెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా క్యాన్సర్ సర్వే నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. రొమ్ము, సర్వైకల్ వంటి క్యాన్సర్లను గుర్తించేందుకు ఈ NCD-3 సర్వే చేపడతామన్నారు. ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సలహాలు, సూచనలు ఇస్తారని మంత్రి పేర్కొన్నారు.

తూ.గో జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యదర్శులతో కలెక్టర్ ప్రశాంతి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇకపై మార్కెట్ కమిటీ చెక్‌పోస్టుల్లో డిజిటల్ విధానాన్ని అమలు చేయాలని ఆమె ఆదేశించారు. ప్రతి మార్కెట్ కమిటీలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

“వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే” కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో పాటు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. అవయవదానంతో మరొకరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని మంత్రి అన్నారు. అవయవదానంపై ఉన్న అపోహలను తొలగించి, దాని ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో జీఎస్‌ఎల్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు గన్ని భాస్కరరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

లేని భూమి ఉన్నట్లు చూపించి మాజీ సైనికుడి నుంచి రూ.14 లక్షలు వసూలు చేసిన ఘటనపై తూ.గో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి కఠిన చర్యలు చేపట్టారు. ఈ విషయమై గోపాలపురం మండలం ఎలక్షన్ డి.టి. కృష్ణను సస్పెండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న వీఆర్ఏలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో మాజీ సైనికుడు సంతోషం వ్యక్తం చేశారు.

రాజమండ్రిలో జరుగుతున్న వివిధ ఇంజినీరింగ్ పనులను సత్వరమే, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, కమిషనర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలను ఆమె మంగళవారం పరిశీలించారు. ప్రజలకు, ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా పనులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

నగరపాలక సంస్థ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీలకు సింగల్ విండో విధానంలో అనుమతులు మంజూరుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, కమిషనరు పి.ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖ అధికారులతో వినాయక చవితి ఏర్పాట్లపై కలెక్టర్ సోమవారం సమీక్షించారు. మట్టి గణపతిని పూజించాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు.

రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం’ నిర్వహించారు. వివిధ సమస్యలతో విచ్చేసిన 31 మంది ప్రజల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాది దారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.

పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలు సోమవారం సమర్పించారు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్. చినరాముడు ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 157 అర్జీలు అందగా, రెవెన్యూ–71, పంచాయతీరాజ్–43, విద్యుత్–7, పాఠశాల విద్య–5, పోలీస్, పురపాలక తదితర శాఖలు–31 ఉన్నాయి. ప్రతి అర్జీపై తప్పనిసరిగా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
Sorry, no posts matched your criteria.