India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడియం మండలం బుర్రిలంక పరిసరాల్లో అమర్చిన ట్రాప్, సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు ఇంకా గుర్తించలేదని, పాదముద్రలు కూడా కనిపించలేదని జిల్లా అటవీ శాఖాధికారిని భరణి శనివారం తెలిపారు. దివాన్ చెరువు ప్రాంతంలో కూడా ఏ విధమైన సమాచారం లభించలేదన్నారు. బుర్రిలంక సమీపంలోని గోదావరి లంకల్లో జింకలు ఉన్న నేపథ్యంలో చిరుత అటు వైపు వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. రేపటి నుంచి ఆ ప్రాంతాల్లో గాలిస్తామన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని కోనసీమ, కాకినాడ రూరల్, తుని, సామర్లకోట, పెద్దాపురం, రాజమండ్రి, అనపర్తి తదితర ప్రాంతాల్లోని ప్రజల సెల్‌ఫోన్లకు సందేశాలు పంపించారు.
రాయవరం, కాకినాడలో ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ ఆటల పోటీల్లో మండపేటకు చెందిన విద్యార్థులు వివిధ విభాగాల్లో ఉత్తమ క్రీడా ప్రతిభను కనబరిచి రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మీ శ్రీనివాస్ శనివారం తెలిపారు. కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి అండర్-14, 17 విభాగాల్లో టెన్నికాయట్ లో బల్ల సత్యనారాయణ, కే.శివశంకర్ ప్రసాద్, ఖండవల్లి చైతన్యలు ఎంపికయ్యారు.
రూ.11 లక్షల రుణం తీసుకుంటే రూ.43 లక్షలు కట్టాలంటున్నారని కాకినాడ జిల్లాకు చెందిన ఓ మహిళ మంత్రి నారా లోకేశ్‌కు ప్రజా దర్బార్‌లో వినతిపత్రం అందజేశారు. కుటుంబ అవసరాల కోసం రూ.11 లక్షల రుణం తీసుకున్నామని, డాక్యుమెంట్ తనఖా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పి సేల్ డీడీ రిజిస్ట్రేషన్ చేసి మోసం చేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పుడు వడ్డీతో సహా రూ.43 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
కడియం నర్సరీలలోకి వచ్చిన చిరుత జాడ కోసం అధికారులు గాలిస్తూనే ఉన్నారు. 20 ట్రాప్ కెమెరాలు, 2 బోనులు, 4 నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినా చిరుత కదలికలు నమోదు కావడం లేదు. భారీ వర్షాల కారణంగా చిరుత బయటకు రావడం లేదేమోనని, అందుకే ఆచూకీ లభించడం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వదంతులు వస్తే నమ్మి భయపడిపోవద్దని ప్రజలకు సూచిస్తున్నారు.
అత్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన కడప సెంట్రల్ జైలు వార్డెన్ మహేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని తుళ్లూరు సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. కాకినాడకు చెందిన హైకోర్టు ఉద్యోగి భువనేశ్వరికి మహేశ్‌తో ఏప్రిల్‌లో పెళ్లి కాగా.. వీరు గుంటూరు జిల్లా రాయపూడిలో అద్దెకుంటున్నారని చెప్పారు. ఆగస్టు 22న మహశ్ తన అత్త సాయికుమారిపై దాడి చేసి, హత్య చేసేందుకు ప్రయత్నించాడన్నారు.
85 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 11 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ రాజమండ్రి 8వ న్యాయస్థానం, క్రైమ్ ఎగైనెస్ట్ విమెన్ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పునిచ్చారు. కరప మండలం వేలంగికి చెందిన వెంకటరమణ గతేడాది ఫిబ్రవరి 7న రాయవరానికి చెందిన వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపారు. దర్యాప్తు అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా శిక్ష విధించారన్నారు.
పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నియామకం అయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ బులెటిన్ విడుదల చేశారు. పార్లమెంట్ రవాణా, పర్యాటకం, సాంస్కృతిక కమిటీ సభ్యులుగా ఎంపీ టి. ఉదయ్ శ్రీనివాస్(జనసేన) నియామకం అయ్యారు. ఇదే కమిటీలో వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు ఉమ్మడి తూ.గో.జిల్లాలో వివిధ హోదాల్లో పార్టీ నాయకులను నియమిస్తూ పార్టీ తాడేపల్లి కేంద్ర కార్యాలయం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు, కోనసీమ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పినిపే విశ్వరూప్‌ను నియమించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మార్గాని భరత్ రామ్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌తో కాకినాడ, కోనసీమ జిల్లాల వైసీపీ నాయకులు సమావేశమయ్యారు. మాజీ మంత్రి తోట నరసింహం, ముద్రగడ పద్మనాభ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి, రాజా, ధనలక్ష్మి, కన్నబాబు, దొరబాబు, మాజీ ఎంపీ వంగా గీత ఉన్నారు. రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ త్రిమూర్తులు, మాజీ మంత్రులు విశ్వరూప్, సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ, జగ్గిరెడ్డి, సూర్య ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.