India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి, రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం, గంగవరం, తదితర ప్రాంతాల్లో రాబోవు 40 నిమిషాల్లో పిడుగులు పడొచ్చని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
గోపాలపురంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఫోటో గ్రాఫర్లు బుధవారం ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో కవరేజ్‌కు సంబందించిన సొమ్ములు తమకు ఇప్పటివరకు జమా చేయాలేదని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే తమకు రావలసిన మొత్తాన్ని ఇవ్వలసిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫోటో గ్రాఫర్లు పాల్గొన్నారు.
గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గ్రామానికి చెందిన కరణం వెంకటేశులు(50) బుధవారం ఉపాధి హామీ పనికి వెళ్లి మృతిచెందారు. పని చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో తోటి వారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే వెంకటేశులు మృతి చెందినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఈమేరకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ దుర్గారావు వెల్లడించారు.
రాజమండ్రి రూరల్ MLA బుచ్చయ్య చౌదరికి ప్రొటెం స్పీకర్‌గా అవకాశం దక్కిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఓ మీడియాతో ఆయన మాట్లాడారు. ‘42 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను.. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదేం పెద్ద పోస్టు కాదు’ అని అన్నారు. పదవి ఉన్నా లేకపోయినా తన నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని అన్నారు. ఎక్కడైనా గెలవగల సత్తా తనకు ఉందని చెప్పుకొచ్చారు. ఆ ధైర్యాన్ని ప్రజలు ఇచ్చారన్నారు.
జనసేన అధినేత, పిఠాపురం MLA డిప్యూటీ CMగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ పవన్‌ను కలిసి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం బొట్టు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి తూ.గో. జిల్లాలో మరో MLAకు కీలక బాధ్యత దక్కింది. రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్యచౌదరిని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకొన్నారు. చట్టసభలో చంద్రబాబు తర్వాత అధికసార్లు గెలిచిన MLA ఈయనే కావడంతో బాధ్యత అప్పగించారు. ఇప్పటికే పిఠాపురం MLA పవన్‌కు డిప్యూటీ CMగా, రామచంద్రపురం MLA సుభాష్‌కు కార్మికశాఖ మంత్రిగా అవకాశం దక్కిన విషయం తెలిసిందే.
☛ పవన్ నేడు, సుభాష్ రేపు మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
కాకినాడ జిల్లా కోటనందూరుకు చెందిన గర్భిణి శిరీష మంగళవారం కుటుంబీకులతో విశాఖ కేజీహెచ్‌లో ప్రసూతి విభాగంలో చేరింది. అనంతరం ఆమె నెలలు నిండకుండా బిడ్డకు జన్మనివ్వగా.. ఆ శిశువును పిల్లల వార్డుకు అనుసంధానంగా ఉన్న ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి నర్స్ ముందు వెళ్ళగా సిలిండర్ మోస్తూ తండ్రి వెనుక వెళ్ళారు. ఈ దృశ్యం చూసిన స్థానికుల కళ్లు చెమ్మగిల్లాయి.
రైతుల నుంచి రబీ సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యానికి తూర్పుగోదావరి జిల్లాలో రూ.202.41 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. 23,082 మంది రైతుల నుంచి 2.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. దీనికి గాను జిల్లాలో రూ.296.31 కోట్లు మాత్రమే జమ చేశారు. ఇంకా రూ.202.41 కోట్లు చెల్లించవలసి ఉంది. ధాన్యం కొని 2 నెలలు దాటిన బకాయిలు చెల్లించకపోవడంపై రైతుల అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మండపేటలోని గొల్లపుంత కాలనీకి చెందిన దుర్గాకుమార్(19) తాపీ పనిచేస్తుంటాడు. మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించేలోగా మృతిచెందాడు. అతనికి ఎవరితో గొడవలు, ఆర్థికసమస్యలు లేవని కుటుంబీకులు చెబుతున్నారు. ఫోన్లో ఉన్న ఫ్రీఫైర్ గేమ్ మనుషులను ఒంటరి చేస్తుందని ఈకారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకొస్తాయని CIఅఖిల్ జామ తెలిపారు.
కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లి, బెండపూడి గ్రామాల్లో డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతోంది. కొమ్మనాపల్లిలో 90, బెండపూడిలో 18మంది ఈ వ్యాధిన పడ్డారు. జిల్లాలో 2022లో ఐదుగురు బాధితులుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 100 దాటడం భయం కలిగిస్తోంది. అధికారులు వ్యాధి నిర్మూలనకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
➠ వ్యాధి లక్షణాలు
☛ వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి
☛ దాహం, నోరు ఎండిపోవడం
☛ మూత్ర విసర్జన తగ్గిపోవడం.
Sorry, no posts matched your criteria.