India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 20వ తేదీన ఇటర్వ్యూలు ఉంటాయని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ వేణుగోపాల వర్మ మంగళవారం తెలిపారు. కాకినాడ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. 554 మందికి ఈ నెల 20 నుంచి 25వ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.
ఉమ్మడి తూ.గో జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప-2’ మూవీ షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మూవీలో హీరో అల్లుఅర్జున్ వినియోగించిన లారీతో పాటు జీపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉన్నాయి. వీటి వద్ద అభిమానులు, పర్యాటకులు పలువురు ఫొటోలు దిగుతున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం భైరవపాలెం వాసి సముద్రంలో గల్లంతయ్యాడు. పెమ్మాడి కాయరాజు(33) సముద్రంలో చేపల వేటకు వెళ్లగా, పడవలో నుంచి జారిపడి మునిగిపోయినట్లు తోటి మత్స్యకారులు తెలిపారు. మంగళవారం విశాఖ జిల్లా నక్కపల్లికి చెందిన మత్స్యకారులతో కలిసి కాయరాజు వేటకు బయలుదేరి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ పడవలో నుంచి జారి పడినట్లు వారు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు వివరించారు.
ఎన్నికల ముగిసి నేపథ్యంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది గ్రామాలలో ప్రజలతో సత్సంబంధాలను మెరుగు పర్చుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సిబ్బందికి సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నెలవారి క్రైమ్ సమావేశం నిర్వహించి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో సమస్యలు రాకుండా విధి నిర్వహణ కలిగి ఉండాలని జిల్లాలో నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు.
ఇంటర్ సెంకడ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో అంబేడ్కర్ కోనసీమ జిల్లా 25వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3194 మంది పరీక్ష రాయగా.. 1395 మంది(44 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 710 మంది పరీక్ష రాయగా.. 326 మంది (46శాతం) పాస్ అయ్యారు.
ఇంటర్ సెంకడ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో తూర్పు గోదావరి జిల్లా 23వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3361 మంది పరీక్ష రాయగా.. 1662 మంది(49 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో తూ.గో జిల్లా వ్యాప్తంగా 422 మంది పరీక్ష రాయగా.. 216మంది (51శాతం) పాస్ అయ్యారు.
ఇంటర్ సెంకడ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో కాకినాడ జిల్లా 14వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6027 మంది పరీక్ష రాయగా.. 3410 మంది(57 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో కాకినాడ జిల్లా వ్యాప్తంగా 384 మంది పరీక్ష రాయగా.. 218 మంది (57శాతం) పాస్ అయ్యారు.
పిఠాపురం మండలం భోగాపురంలో ఈ నెల 14న బొమ్మ దేవప్రసాద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు నాగులపల్లి పద్మరాజును అరెస్ట్ చేసినట్లు CI శ్రీనివాస్, SI గుణశేఖర్ తెలిపారు. మృతుని సోదరుడు శ్రీనివాసరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి హత్య కేసును విచారించామన్నారు. మృతుడు ప్రసాద్, నిందితుడు పద్మరాజు కలిసి తాపీ పని చేశారన్నారు. కూలి డబ్బుల విషయంలో జరిగిన ఘర్షణలో ప్రసాద్‌ను కొట్టి చంపేశారన్నారు.
ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారానికి చెందిన దుర్గారావు దివ్యాంగుడు. గ్రామానికి చెందిన ఓ యువకుడికి పెళ్లి సంబంధం చూస్తానని చెప్పి..ఓ అమ్మాయి ఫొటో చూపించాడు. 4ఎకరాల భూమి ఉందని, తనకు తెలిసిన అమ్మాయి నంబర్ ఇచ్చి రోజూ మాట్లాడించాడు. ఆ తర్వాత అమ్మాయికి ఆర్థిక సమస్యలున్నాయని రూ.40 లక్షల వరకు వసూలుచేశాడు. ఎన్నిరోజులైనా పెళ్లి ప్రస్తావన లేకపోగా మోసం బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.
‘కిసాన్ సమ్మేళన్’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం 17వ విడత నిధులు విడుదల చేయనున్నారని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కే.మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 98,550 మందికి దీని ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రతి రైతు ఖాతాలో రూ.2వేల చొప్పున మొత్తం రూ.19.71 కోట్లు జమ కానున్నట్లు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.