EastGodavari

News August 17, 2025

రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సూచించారు. వర్షాల కారణంగా పంటలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని, రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. పంటల రక్షణ కోసం శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని కలెక్టర్ సూచించారు.

News August 17, 2025

యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమం ఈ నెల 18 సోమవారం యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల కేంద్రాల కార్యాలయాల్లోనే అందజేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

News August 16, 2025

తూ.గో: విలీన మండలాలకూ ఫ్రీ బస్సులు వర్తిస్తాయి: డీపీటీఓ

image

పోలవరం విలీన మండలాలైన వీఆర్ పురం, కూనవరం, ఎటపాక, చింతూరు ప్రాంతాల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుందని తూ.గో. జిల్లా ఆర్టీసీ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (డీపీటీఓ) వై.ఎస్.ఎన్. మూర్తి స్పష్టం చేశారు. అంతర్‌రాష్ట్ర సర్వీసులు మినహా మిగిలిన అన్ని బస్సుల్లోనూ ఈ పథకం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాల మహిళల అభ్యంతరాలపై ఆయన ఈ వివరణ ఇచ్చారు.

News August 16, 2025

తూ. గో: ఘాట్ రోడ్లలోనూ ఉచిత బస్సులు

image

రాష్ట్రంలోని ఘాట్ రోడ్లలో కూడా మహిళలు ఇక ఉచితంగా ప్రయాణించవచ్చని తూ.గో ఆర్టీసీ డీపీటీఓ వై.సత్యనారాయణ మూర్తి తెలిపారు. భద్రతా కారణాల వల్ల మొదట నిలిపివేసినప్పటికీ, తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలంటూ ఆదేశాలు ఇచ్చిందన్నారు. రాజమండ్రి-భద్రాచలం, శ్రీశైలం వంటి మార్గాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

News August 16, 2025

రాజమండ్రి: విద్యుత్ శాఖ శకటానికి ప్రథమ స్థానం

image

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 12 శకటాలు పాల్గొన్న ఈ ప్రదర్శనలో, విద్యుత్ సంస్థ శకటం మొదటి స్థానం దక్కించుకుంది. వ్యవసాయం, ఉద్యానవన శాఖల శకటాలు రెండవ స్థానం, సాంఘిక సంక్షేమ శాఖ శకటం మూడవ స్థానం పొందాయి. అలాగే, పశు సంవర్థక శాఖ శకటం నాలుగవ స్థానం, పర్యాటక శాఖ శకటం ఐదవ స్థానం సాధించాయి.

News August 15, 2025

రాజమండ్రి: విద్యుత్ శాఖ శకటానికే ప్రథమ స్థానం

image

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 12 శకటాలు పాల్గొన్న ఈ ప్రదర్శనలో, విద్యుత్ సంస్థ శకటం మొదటి స్థానం దక్కించుకుంది. వ్యవసాయం, ఉద్యానవన శాఖల శకటాలు రెండవ స్థానం, సాంఘిక సంక్షేమ శాఖ శకటం మూడవ స్థానం పొందాయి. అలాగే, పశు సంవర్థక శాఖ శకటం నాలుగవ స్థానం, పర్యాటక శాఖ శకటం ఐదవ స్థానం సాధించాయి.

News August 15, 2025

దుల్ల గ్రామంలో విషాద ఛాయలు

image

రామభద్రపురం వద్ద చెట్టు పడి <<17400517>>గురువారం<<>> మృతి చెందిన శ్రీనివాస్ స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా దుల్ల గ్రామంలో విషాదఛాయలు నెలకున్నాయి. శ్రీనివాస్‌కు వివాహం అయి రెండేళ్లయింది. డెక్కన్ ఫ్యాక్టరీలో ఉద్యోగం రావడంతో భార్యతో కలిసి తునిలో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ తల్లిదండ్రులకు ఇద్దరు ఆడపిల్లలు, ఇతను ఒక్కడే కుమారుడు. ఉద్యోగానికి వెళ్లి విగతజీవిగా మారిన కుమారుడ్ని చూసి వారు కన్నీరు మున్నీరువుతున్నారు.

News August 15, 2025

దేశభక్తుల ప్రాణత్యాగమే నేటి స్వాతంత్రం: ఎమ్మెల్సీ సోము

image

ఎందరో దేశభక్తులు త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర్యం అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన “విభజన్ క విభీషక్ దివస్” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ పుష్కర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సమరయోధుల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

News August 14, 2025

రాజమండ్రిలో స్వాతంత్ర్య దినోత్సవ పెరేడ్ రిహార్సల్స్

image

రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఆగస్టు 15న జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ పరిశీలించారు. పరేడ్ రిహార్సల్స్, భద్రత, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సాయుధ పోలీసు బలగాల పరేడ్ ప్రదర్శనను పరిశీలించారు.

News August 14, 2025

రాజమండ్రి: పోలీసుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు

image

పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లలకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందజేశారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెరుగైన ఫలితాలు సాధించిన 57 మంది విద్యార్థులను ఎస్పీ అభినందించారు. అడిషనల్ ఎస్పీలు మురళీ కృష్ణ, చెంచిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.