India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ‘రామచంద్రపురం’ను మంత్రి పదవులు వరిస్తున్నాయి. 2005, 2009లో పిల్లి సుభాశ్ చంద్రబోస్, 2019లో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మంత్రి పదవులు దక్కాయి. తాజాగా వాసంశెట్టి సుభాశ్ మంత్రి పదవి చేపట్టి.. మూడో వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. సుభాశ్ ఎన్నికలకు కొద్దిరోజుల ముందే TDPలో చేరారు. అమలాపురానికి చెందిన సుభాశ్.. ఎంపీ చంద్రబోస్ తనయుడిపై పోటీ చేసి 26,291 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం నేపథ్యంలో బుధవారం తాము సంబరాలు చేసుకుంటుంటే వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని రావులపాలెం మండలం కేతరాజుపల్లె మాజీ సర్పంచి కాసా చాముండేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు గాయాలు కాగా.. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరినట్లు తెలిపారు. పోలీసులు వెళ్లి వివరాలు సేకరించారు. దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని సీఐ జేమ్స్ రత్నప్రసాద్ తెలిపారు.
జనసేన అధినేత, మంత్రి పవన్ కళ్యాణ్‌ను దూషిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తి కటకటాలపాలయ్యాడు. కె.గంగవరం మండలం భట్లపాలిక శివారు రావిదొడ్డిపేటకు చెందిన కూరాటి వెంకటరమణను అరెస్టు చేసినట్లు ఎస్సై షేక్ జానీబాసా బుధవారం తెలిపారు. కుల మతాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడన్నారు. జనసేన కార్యకర్తల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
విషం తాగి యువతి మృతి చెందిన ఘటన రాజమండ్రిలోని ప్రకాశంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. పోలవరం మండలం తోటగుందికి చెందిన యువతి(21) బీఎస్సీ చదివింది. స్నేహితురాలి పెళ్లికని తల్లికి చెప్పి ఈ నెల 5న ఇంటి నుంచి వెళ్లింది. 10న తల్లికి ఫోన్ చేసి ‘నేను రాజమండ్రి బస్టాండ్‌లో ఉన్నా. విషం తాగా..’ అని చెప్పింది. వెళ్లి ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
భారత ప్రభుత్వం అందించే పద్మ అవార్డ్స్‌కు ప్రతిపాదనలు కోరుతున్నామని కాకినాడ సెట్రాజ్ అధికారులు బుధవారం తెలిపారు. కలలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యరంగం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, పౌర సేవలు, వృత్తి, పరిశ్రమ వంటి రంగాల్లో ..అత్యున్నతమైన ప్రతిభ కనబరిచిన వారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని చెప్పారు. అర్హుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
నరసాపురం పట్టణం రుస్తుంబాదుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్, చిత్రకారుడు కొప్పినీడి విజయ్ మోహన్ పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చిత్రం రూపంలో చాటుకున్నాడు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గన్నవరంలో మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వాటర్ కలర్స్ ఉపయోగించి చిత్రాన్ని గీశాడు. అందులో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అని ప్రత్యేకంగా రాశారు. దీంతో విజయ్ మోహన్‌ను పలువురు అభినందిం చారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి బరిలో నిలిచిన వంగలపూడి అనిత 25248 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కాగా తాజా ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి తరఫున బరిలో నిలిచి 1,20,042 ఓట్లు సాధించి 43727 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు.
టీడీపీ శాసనసభపక్ష నేతగా చంద్రబాబునాయుడు మంగళవారం ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే 1995లో తొలిసారిగా సీఎం అయిన సందర్భంలో చంద్రబాబును పార్టీ శాసనపక్ష నేతగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతిపాదించారు. తాజాగా 29 ఏళ్ల తర్వాత చంద్రబాబు వదిన, రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు గుర్తుచేసుకున్నారు.
సినీనటుడిగా తెరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ 2008లో రాజకీయాల్లోకి రాగా.. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ట్రస్ట్ ద్వారా సేవలందించారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం తర్వాత.. 2014లో జనసేన స్థాపించారు. అప్పటినుంచి ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు. తాజాగా పిఠాపురం MLAగా గెలిచి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
అమలాపురం మండలం శ్రీరాంపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం MLAగా గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన సుభాష్ BSC ఎల్‌ఎల్‌బీ చదివారు. SAF స్వచ్ఛంద సంస్థ సేవాకార్యక్రమాల ద్వారా పట్టు సాధించారు. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత TDPలో చేరారు. ఈయన తాత, తండ్రి 2 సార్ల చొప్పున అమలాపురం కౌన్సిలర్లుగా పనిచేశారు.
Sorry, no posts matched your criteria.