Guntur

News September 15, 2024

నేడు పోలీస్ కస్టడీకి నందిగం సురేశ్

image

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల అరెస్ట్ అయిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను ఆదివారం మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. మంగళగిరి కోర్టు 2 రోజులు పోలీసుల కస్టడీకి అనుమతించడంతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నందిగం సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు ప్రశ్నించనున్నారు.

News September 15, 2024

గుంటూరులో బాలికపై అత్యాచారం.. వ్యక్తి అరెస్ట్

image

విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి గర్భిణిని చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పాత గుంటూరు పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన 10వ తరగతి విద్యార్థినిని అదే ప్రాంతంలో నివాసం ఉండే కార్ల పెయింటర్ షేక్. కాలేషా అనే వ్యక్తి భయపెట్టి తన ఇంటిలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 15, 2024

ఈనెల 16న గ్రీవెన్స్ రద్దు

image

గుంటూరు జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమం సోమవారం మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు శనివారం ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. కనుక గుంటూరు జిల్లా నుంచి, పరిసర ప్రాంతాల నుంచి వచ్చేవారు, నగర పరిదిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 15, 2024

మంగళగిరి: 5 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం

image

మంగళగిరిలో ఓ బాలికపై శనివారం మరో అత్యాచారయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి బాలాజీ నగర్లో ఆడుకుంటున్న ఐదు సంవత్సరాల బాలికపై వెంకటేశ్వరరావు(61) అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. బాలిక ఒక్కసారిగా కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. దీంతో మంగళగిరి టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా దిశా డీఎస్పీ కోటేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఒకే రోజు రెండు ఘటనలు జరిగాయి.

News September 14, 2024

గుంటూరులో ఇంటర్ విద్యార్థిని మృతి

image

గుంటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో శనివారం దారుణం జరిగింది. పల్నాడు జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం తెలిపారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2024

గుంటూరు: బీఈడీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ 2వ సెమిస్టర్(రెగ్యులర్ & సప్లిమెంటరీ) విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సెప్టెంబర్ 25 లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని పరీక్షల విభాగం తెలిపింది.

News September 14, 2024

17న నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ: DMHO

image

జాతీయ నులి పురుగుల నివారణ దినం సందర్భంగా ఈ నెల 17న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించే కార్యక్రమం జరుగుతుందని జిల్లా వైద్యశాఖ అధికారి విజయలక్ష్మి వెల్లడించారు. మధ్యాహ్నం బోజనం అనంతరం 1-2 సంవత్సరాల వయసు వారికి ఆల్బెండ జోల్ అరమాత్ర, 2-19 సంవత్సరాల వారికి పూర్తి మాత్ర ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు.

News September 14, 2024

లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోండి : ఎస్పీ

image

నేడు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధ్యమైనన్ని కేసులు పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కక్షిదారులు కూడా దీర్ఘకాలంగా కొనసాగుతున్న కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. చెక్ బౌన్స్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు ఉన్న కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

News September 13, 2024

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.4 కోట్ల విరాళం

image

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు భాష్యం విద్యాసంస్థలు తమవంతు సహకారాన్ని అందించాయి. రూ.4 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి శుక్రవారం సచివాలయంలో చందబ్రాబును కలిసి అందించారు. భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణ, డైరెక్టర్ హనుమంతరావు, రామకృష్ణ తనయుడు సాకేత్ రామ్ చెక్కు అందజేసిన వారిలో ఉన్నారు.

News September 13, 2024

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం

image

రాష్ట్ర సచివాలయంలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి, తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, ఎండీ తులసి యోగిశ్ చంద్ర కోటి రూపాయల చెక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందజేశారు. దీంతో పాటు తులసి గ్రూప్ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.5.43 లక్షలను సంస్థ జనరల్ మేనేజర్ పచ్చా వాసుదేవ్, చంద్రబాబుకు అందజేశారు.