India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెకానికల్ ఇంజినీరింగ్ చదివి చెడు వ్యసనాలకు బానిసగా మారి చోరీలు చేస్తున్న యువకుడిని పట్టాభిపురం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు స్టేషన్ ఎస్.హెచ్.ఓ వీరేంద్రబాబు మాట్లాడుతూ.. గొర్రెల చినబాబు అనే యువకుడు ఎస్వీఎన్ కాలనీలో జరిగిన చోరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడని, గతంలో ఇతనిపై అనేక కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. నిందితుడి నుంచి రూ.10 లక్షలు విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
పీఎం కిసాన్ పథకం కింద ఉమ్మడి గుంటూరు జిల్లాకు రూ.84.97కోట్లు వచ్చాయి. ఈ మేరకు సదరు నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నేరుగా రైతుల ఖాతాలకు జమ చేశారు. ఈ పథకం కింద గుంటూరు జిల్లాలోని 86,674 మంది రైతులకు రూ.17.33కోట్లు, పల్నాడు జిల్లాలో1,97,639 మంది రైతులకు రూ.39.53కోట్లు, బాపట్ల జిల్లాలో1,40,559 మంది రైతులకు రూ.28.11కోట్లు చొప్పున కేంద్రం జమ చేసింది.
పోలీసు కానిస్టేబుల్ అని ఓ విద్యార్థినిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపేట CI వీరయ్య వివరాల మేరకు.. ఇద్దరూ ప్రేమికులు బస్టాండ్‌కు వెళ్తుండగా మార్గంమధ్యలో ఓ వ్యక్తి వారిని ఆపాడు. తాను కానిస్టేబుల్‌ని అని.. ఎక్కడికి వెళ్తున్నారని వారిని బెదిరించి స్టేషన్‌కు రావాలన్నాడు. అనంతరం ఆ విద్యార్థినిని వాహనంపై తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మంతెన రాంబాబు (రామ)రాజుని హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలని అనిత కోరారు.
దేవుడి మీదే కాదు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై కూడా నమ్మకం, గౌరవం లేని రీతిలో జగన్ ప్రవర్తిస్తున్న తీరు విచిత్రంగా ఉందని MLA పుల్లారావు తప్పుబట్టారు. చిలకలూరిపేటలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ వివాదంలో ఇప్పటికే జగన్ అన్ని హద్దులు దాటేశారన్నారు. చివరకు దేశాన్నే ప్రశ్నించే దుస్సాహసం చేశారన్నారు. రాష్ట్రం, దేశం న్యాయ వ్యవస్థలపై జగన్‌కు నమ్మకం లేని వ్యక్తి ఇక్కడ ఎలా ఉంటారని ప్రశ్నించారు.
తెనాలి పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర-2047 యాక్షన్ ప్లాన్, తెనాలి పట్టణ అభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి చేయాల్సిన పనుల గురించి అధికారులతో చర్చించారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (ఇయర్ ఎండ్) వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లింపు గడువు అక్టోబర్ ఒకటితో ముగియగా ఆ గడువును ఈ నెల 30 వరకు పొడిగించామని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 30లోపు ఫీజు చెల్లించాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పట్టభద్రులందరూ ఓటర్లగా నమోదు చేసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కోరారు. శుక్రవారం, కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గములో ఓటర్ల నమోదుకు అర్హులైన వారు www.ceoandhra.nic.in వెబ్ సైటు ద్వారా ఫారం- 18 సమర్పించాలన్నారు. నవంబరు 23, 2024 న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తామని చెప్పారు.
తిరుమల లడ్డూ ఘటనపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు Xలో ట్వీట్ చేశారు. సత్యం గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ నుంచి ఒక సీనియర్ అధికారి ఉండాలని ధర్మాసనం పేర్కొంది.
వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు, నర్సరావుపేట లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే పదవీ ప్రమాణస్వీకార సభలో రాజ్యసభ సభ్యులు అయోధ్యరామిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు అవుతారని చెప్పారు.
Sorry, no posts matched your criteria.