India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేపల్లె మండలం పెనుముడి వారధి వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేపల్లె నుంచి మచిలీపట్నం వెళుతున్న ఆర్టీసీ బస్సును అవనిగడ్డ వైపు నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ వెహికల్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్ లేలాండ్ లో ఉన్న పదిమందిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి గాయాలుకాగా క్షతగాత్రులను రేపల్లె సీఐ మల్లికార్జునరావు ఆసుపత్రికి తరలించారు.
గుంటూరు నగరంలోని రౌడీషీటర్లకు ఆదివారం పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీశ్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రౌడీషీటర్లు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి పద్ధతి మార్చుకొని మంచి మార్గంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించాలని సూచించారు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా కొనసాగుతుందని చెప్పారు.
క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆదివారం రూ.లక్ష చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. వరద బాధితులకు తక్షణ సాయంగా చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తూ ఎంతగానో బాధితులను ఆదుకున్నారని క్రైస్తవ మిషనరీ సంఘం వారు ఆన్నారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సహాయం అందించడం జరిగిందని మిషనరీ బిషప్ అన్నారు.
హుబ్లీ నుంచి విజయవాడ వస్తున్న రైలులో శనివారం ఉదయం చోరీ జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన జ్యువెలర్స్ షాపు నిర్వాహకులు రంగారావు, సతీశ్‌లకు చెందిన రూ.2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. రైలు నంద్యాల చేరుకున్న అనంతరం తాము నిద్రపోగా చోరీ జరిగిందని, నంద్యాల రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చామని రంగారావు, సతీశ్ తెలిపారు.
‘హోంమంత్రి శ్రీమతి అనిత గారు శ్రీవారి దర్శనానికి వెళ్లారు డిక్లరేషన్ ఇచ్చారా? లేదా?’ అని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ఆమెను ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల దర్శనానికి వెళ్లాలని హోంమంత్రి అనితతో పాటు పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అంబటి తనదైన శైలిలో స్పందించారు. డిక్లరేషన్‌పై కొద్ది రోజులుగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే.
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల TDP ఎమ్మెల్సీ అభ్యర్థిని నేడు ప్రకటించే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరు టీడీపీ అధిస్ఠానం ఇప్పటికే ఖరారు చేసిందని సమాచారం. తెనాలి MLA టికెట్ కూటమిలో భాగంగా జనసేనకు వెళ్లింది. దీంతో ఆ సీటును ఆలపాటి త్యాగం చేశారు. అందుకు ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ప్రతిఫలంగా దక్కుతోంది. ఆలపాటి గతంలో మూడు సార్లు MLAగా గెలిచారు. కాగా 1999లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLM కోర్సు విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. అక్టోబర్ 15,16,17 తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టు వారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.
అక్టోబర్ 3వ తేదీ నుంచి జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని DRO పెద్ది రోజా అధికారులను ఆదేశించారు. టెట్ పరీక్షల నిర్వహణపై తన ఛాంబర్లో శనివారం ఆమె సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144సెక్షన్ అమలు చేయాలన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని చెప్పారు. రవాణా శాఖ అధికారులు అన్ని రూట్‌లలో సకాలంలో బస్సులు నడపాలని స్పష్టం చేశారు.
వైసీపీ నేతల అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ మేరకు చంద్రబాబు అమరావతిలో శనివారం టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జగన్ కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని చెప్పారు. అలాగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపైనా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీడీపీ శ్రేణులకు తెలియజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీజేపీ సీనియర్ నేత సిద్ధార్థనాథ్ సింగ్ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు, ప్రజలకు అందించిన సహకారంపై చర్చించారు. అలాగే, పోలవరం, అమరావతికి ఇస్తున్న సహకారానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.