India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
➤ చెన్నంశెట్టి రమేశ్ (SA లెక్కలు, మామిళ్లపల్లి, MPUPS) ➤ పి.మృత్యం జయరావు (SGT. కొల్లిపర MPPS) ➤ గోనేళ్ళ శేష వరలక్ష్మి (SA. ఇంగ్లీష్, ఈపూరు పాలెం ZPHS) ➤ పవని భాను చంద్ర మూర్తి (SA. భౌతిక శాస్త్రం, పేరాల చీరాల మండలం) ➤ కర్పూరపు బిజిలి కుమార్ (SGT. బలుసుపాలెం చెరుకుపల్లి మండలం) ➤ కె. వెంకట శ్రీనివాసరావు (HM. గ్రేడ్ – 2 చక్రాయ పాలెం అద్దంకి(M)
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం గుంటూరుకు రానున్నారు. నగరంలోని అరణ్య భవన్లో ఉదయం 11 గంటలకు అటవీ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొని అటవీ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం రాక కోసం ఏర్పాట్లు చేపట్టారు. తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ గుంటూరు నగరానికి రానున్నారు.
బోరుగడ్డ అనిల్‌కి అరండల్‌పేట స్టేషన్‌లో రాచమర్యాదలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఐ కె.శ్రీనివాసరావును వీఆర్‌కు పంపుతూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ సిబ్బంది నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో క్రమ శిక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని త్రిపాఠి హెచ్చరించారు.
విజయవాడలోని ఓ హాస్పిటల్లో ఆపరేషన్ సమయంలో ఓ పేషెంట్‌కు రక్తం తక్కువగా ఉండటంతో 0+ బ్లడ్ కావాలని డాక్టర్ సూచించారు. కుటుంబసభ్యులు వెంటనే పొన్నూరుకు చెందిన ‘పొన్నూరు బ్లడ్వెల్ఫేర్ అసోసియేషన్’ సంస్థను సంప్రదించారు. దీంతో సంస్థ సభ్యుడు శ్రీనివాస్ స్పందించి 5వ సారి రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో ఆదుకున్న శ్రీనివాసుకు పేషంట్ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు-2024లో నిర్వహించిన బీఈడీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను పక్కదారి పట్టించడానికి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని మాజీమంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని పార్టీ నాయకులతో కలిసి శనివారం ఎస్పీకి అంబటి వినతిపత్రాన్ని సమర్పించారు. పోలీసులకు ఇదే ధర్మమైతే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయాలన్నారు.
నిజాంపట్నం మండలం జంపనివారిపాలెంలో శుక్రవారం సాయంత్రం పొలంలో తల్లి కొడుకు పని చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంచినీళ్లు తీసుకురావడానికి కొడుకు వెళ్లాడు. ఆ సమయంలో పొలంలో ఉన్న మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. తల్లి కేకలు విని కొడుకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దుండగులను దూరంగా నెట్టివేశాడు. విషయం బయటకి చెప్తే చంపుతామని దుండగులు బాధితులను బెదిరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి విడదల రజినికి YCP అధిష్ఠానం మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. 2019లో చిలకలూరిపేట నుంచి గెలిచి మంత్రి అయిన ఆమె.. తాజా ఎన్నికల్లో గుంటూరు వెస్ట్‌లో ఓడిపోయారు. అటు చిలకలూరిపేటలో కావటి మనోహర్ నాయుడు ఓటమి చెందారు. పల్నాడులో పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించిన జగన్.. విడదల రజినిని తిరిగి యథాస్థానానికి పంపారు. వైసీపీ అధిష్ఠానం తీసుకున్న తాజా నిర్ణయంపై మీ కామెంట్.
నాగార్జున యూనివర్సిటీ ఆగస్టులో నిర్వహించిన బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఏ. శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 9205 మంది పరీక్షలు రాయగా వారిలో 6,923 మంది ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యుయేషన్ దరఖాస్తుకు ఒక్కో పేపర్‌కు రూ.1,680 చెల్లించి ఈ నెల 15 తేదీలోగా కళాశాలలకు సమర్పించాలని శివప్రసాదరావు సూచించారు. ఫలితాలు www.anu.ac.inలో పొందవచ్చని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారనే ఆరోపణలపై YCP సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అరెస్టులును సాగించి సోషల్ మీడియాని అడ్డలేరు’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు తాము నిజంవైపు నిలబడి ఉంటామంటూ ఓ ఫొటోను షేర్ చేశారు.
Sorry, no posts matched your criteria.