Guntur

News May 6, 2024

నేను ప్రాణం పోసిన వారే నన్ను వదిలి వెళ్లారు: మంత్రి అంబటి

image

‘కొందరు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు నేను సాయం చేసి బతికించిన వ్యక్తులు, నావల్ల పదవులు పొంది ఎదిగిన వారు,నాకు అవసరమైన సమయంలో నన్ను వదిలి మోసం చేసి వెళ్లారు’ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆ బాధ గుండెను పిండేస్తోందని చెప్పారు. ఆదివారం రాత్రి సత్తెనపల్లిలోని ఆవుల సత్రంలో జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇవేనా మానవ సంబంధాలు అంటూ ప్రశ్నించారు.

News May 6, 2024

పార్టీలతో సంబంధం లేకుండా ఓటరు స్లిప్పులు పంపిణీ: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో తుది జాబితా ప్రకారం 17,91,543 మంది ఓటర్లు ఉన్నారని, ఆ జాబితాను గుర్తింపు పొందిన పార్టీలకు అందజేశామని కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా ఓటరు స్లిప్పులను సిబ్బంది ప్రతి ఓటరుకు అందించటానికి చర్యలు తీసుకున్నామన్నారు. 5, 6 తేదీల్లో పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఉన్నందున, శిక్షణ ముగిసిన తర్వాత 4 గంటల నుంచి ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో ఓటు వేయొచ్చన్నారు.

News May 6, 2024

నేడు గుంటూరు జిల్లాలో CM జగన్ పర్యటన

image

సీఎం జగన్ సోమవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఉదయం 10 గంటలకు రేపల్లెలో ఉన్న డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మాచర్ల శ్రీనివాస్ సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి మచిలీపట్నం బయల్దేరి వెళతారు.

News May 6, 2024

గుంటూరు: ఈనెల 10, 16, 22 తేదీలలో పలు రైళ్లు రద్దు

image

ఖాజీపేట- గూడూరు మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణ పనులు కారణంగా ఈ నెల 10, 16, 22 తేదీలలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు డీఆర్ఎం ఎమ్.రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు అయిన రైళ్ల వివరాలు: ట్రైన్ నం. 12705 గుంటూరు- సికింద్రాబాద్, 12706 సికింద్రాబాద్- గుంటూరు, ట్రైన్ నం.17201 గుంటూరు- సికింద్రాబాద్, ట్రైన్ నం.17202 సికింద్రాబాద్- గుంటూరు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

News May 6, 2024

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోండి: కలెక్టర్

image

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కోరారు. ఆదివారం కలెక్టరేట్లో ఎస్పీ తుషార్‌తో కలిసి మాట్లాడారు. ఫారం 12 అందజేయకపోయినా ఉద్యోగుల ఆందోళన చెందవద్దన్నారు. మే 7, 8 తేదీలలో వారికి ఓటు హక్కు ఉన్న నియోజకవర్గంలోని కేంద్రంలో ఫారం 12 ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

News May 5, 2024

తాడేపల్లిలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్

image

తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌కి సమీపంలో పెట్రోల్ బంకు దగ్గర పోలీస్ చెక్‌పోస్ట్‌కి సమీపంలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయారు. రూ.500 కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తి మెడపై బ్లేడుతో కోసి గాయపరిచారు. ఘటనా స్థలానికి దగ్గర ఉన్న పోలీసులు గాయపడి కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి చెన్నైకు చెందిన వ్యక్తిగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 5, 2024

ఈనెల 6న రేపల్లెలో సీఎం జగన్ పర్యటన

image

ఈనెల ఆరోతేదీ సోమవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపల్లె వస్తున్నారని, రేపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేశ్ తెలిపారు. రేపల్లె తాలూకా సెంటర్లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారన్నారు. నియోజకవర్గంలోని వైసీపీ అభిమానులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు సీఎం జగన్ పర్యటన విజయవంతం చేయాలని డాక్టర్ గణేశ్ కోరారు.

News May 5, 2024

గుంటూరు: రెండు బైకులు ఢీ.. పలువురికి గాయాలు

image

గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటుకూరు బైపాస్ వివాహ కన్వెన్షన్ ఎదురుగా శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి వేగంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైకులపై ప్రయాణించే పలువురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

News May 5, 2024

గుంటూరులో భారీగా పట్టుబడ్డ బంగారం

image

జిల్లాలో శనివారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో రూ.18,30,000ల విలువ గల 278.9 గ్రాముల బంగారం జప్తు చేశామన్నారు. మంగళగిరి పరిధిలో 0.75 లీటర్ల మద్యం, తెనాలి పరిధిలో రూ.2,00,000 నగదు సీజ్ చేశామన్నారు. జిల్లాలో మే 4వ తేది సాయంత్రం వరకు రూ.2,99,83,697 విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు.

News May 5, 2024

గుంటూరులో భర్తను హత్య చేయించిన భార్య

image

ప్రేమ్ కుమార్ కనిపించడం లేదని అతని భార్య మూడు రోజుల క్రితం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిర్గాంత పోయే విషయాలు వెలుగు చూశాయి. ప్రేమ్ కుమార్‌ను అతని భార్య వేరే వ్యక్తితో సాన్నిహిత్య సంబంధం పెట్టుకొని భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. ఆమె ప్రియుడు వారం రోజుల క్రితం ప్రేమ్ కుమార్‌కు మద్యం తాపించి హత్య చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.