India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
న్యూజిలాండ్‌లో జరిగిన అంతర్జాతీయ స్కేట్ ఓషేరియా ఆర్తిస్టిక్ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో మంగళగిరికి చెందిన జెస్సీ రాజ్ బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం తన ఛాంబర్‌లో ఆమెను అభినందించారు. మహావతార్ బాబాజి తాడేకం ఫౌండేషన్ ద్వారా రూ.50వేల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. జిల్లాలోని క్రీడాకారులను మరింతగా ప్రోత్సహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబును నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా మందపాటి శేషగిరిరావు ఉన్నారు. కాగా గుంటూరు జిల్లా వైసీపీ ముఖ్యనేతలతో జగన్ తాడేపల్లిలో నేడు సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
నేడు గుంటూరు జిల్లా YCP నాయకులతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బుధవారం సమావేశం కానున్నారు. జిల్లా అధ్యక్షుడి ఎంపికపై చర్చించడంతో పాటు జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి జగన్ చర్చించనున్నట్లు వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇటీవల పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నియమించారు. గుంటూరు జిల్లాతో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా నాయకులతో కూడా సమావేశం అవుతారు.
108 వాహనాల్లో పైలట్స్ (డ్రైవర్లు) పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు 108 జిల్లా మేనేజర్ నాగదీప్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, హెవీ లైసెన్స్ కలిగి, 35 సం. లోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఈ నెల 26వ తేదీలోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని, 108 కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఈనెల 27న నైపుణ్యభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ ప్రణయ్ పేర్కొన్నారు. ఇలా అగ్రిసర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్, పయనీర్ ఆటోమోటివ్స్, కేఎల్ గ్రూపు అమెజాన్ వేర్ హౌస్, Way2news, మాస్టర్ మైండ్స్ తదితర సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసి 18-35 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులన్నారు. వివరాలకు 98663366187, 9505719172 నంబర్లను సంప్రదించాలన్నారు.
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 23వ తేదీ నుంచి అక్టోబరు 7వ తేదీ వరకు గుంటూరు, సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్, గుంటూరు (12706), గుంటూరు, సికింద్రాబాద్ (12705) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు పలు రైళ్లు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
భర్తపై భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. హనుమయ్య నగరకు చెందిన వెంకటరమణ అనే మహిళ తన భర్త వెంకటేశ్వర్లు తరచూ గొడవ పెట్టుకుని కొడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత కూడా కేసు వెనక్కి తీసుకోమని గడ్డపార తీసుకుని తల పగలగొట్టాడని భార్య వెంకటరమణ పోలీసుల ఎదుట వాపోయింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (L.H.M.S)ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజల ఆస్థుల పరిరక్షణకు L.H.M.S రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని, ఈ యాప్‌ను అందరూ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ప్రజల అవసరాల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు చోరీలు జరగకుండా ఈ యాప్ ఉపకరిస్తుందని అన్నారు.
ప్రముఖ ఆలయ తిరుమల – తిరుపతి ఆలయ లడ్డూ ప్రసాదం విషయంపై సిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గుంటూరు సౌత్ కొస్టల్ జోన్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠీని సిట్ చీఫ్‌గా ప్రభుత్వం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా పలువురికి నామినేటెడ్ పదవులు దక్కాయి. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాకు కీలక పదవి దక్కింది. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పిళ్లి మాణిక్యరావుని నియమించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పిళ్లి మాణిక్యరావు చురుగ్గా పనిచేశారు. ఆయన పనితీరు తగిన విధంగా పదవి దక్కిందని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
Sorry, no posts matched your criteria.