India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జూనియర్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా కార్యదర్శి శివ శంకర్ తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు స్థానిక ఎన్జిఓ క్లబ్‌లో పోటీలు ఉంటాయన్నారు. ఎంపిక చేసిన జట్లను విశాఖపట్నం జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మాచవరం మండలం పిన్నెల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం జంతువుల నూనెతో లడ్డూ తయారు చేశారని, దీనికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
కాకుమాను మండల టీడీపీ నేతలు ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి 14 టన్నుల బియ్యం అందించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. శుక్రవారం పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సమక్షంలో బియ్యంలోడును కలెక్టర్‌కు అందజేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ఇప్పటికే పలుసార్లు సరుకులు అందించామని.. ప్రస్తుతం బియ్యం అందించినట్లు వారు తెలిపారు.
వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డులోని ఓ సూపర్ మార్కెట్ వద్ద గురువారం రాత్రి 11 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బైక్‌లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో 384 కి.మి. మేర 7 జాతీయ రహదారుల అభివృద్దికి రూ.6,585 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసినట్లు మంత్రి బి.సి.జనార్థన రెడ్డి తెలిపారు. గురువారం వెలగపూడి లోని సచివాలయంలో ఆయన్ విలేకరులతో మాట్లాదారు. కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ ఘడ్గరీ తో పలు మార్లు సంప్రదింపులు జరపడం వల్లే ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15న తిరిగి స్కూళ్లు ప్రారంభమవుతాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అంకిత భావంతో నిర్ణయాలు తీసుకుంటున్న తమ ప్రభుత్వం మంచి ప్రభుత్వమని గురువారం సీఎం చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడమే కాకుండా అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తున్నదన్నారు. 100 రోజుల్లో 100కు పైగా సంక్షేమ పథకాలు అమలు చేసిన మంచి ప్రభుత్వం అన్నారు.
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా TDP కార్యాలయంపై దాడి కేసులో ఈ నెల 5న సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేయగా, ఆయనను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ కూడా జరిపారు. బుధవారం తుళ్లూరు పోలీసులు ఓ మర్డర్ కేసులో ఆయనపై పీటీ వారెంట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈ నెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్నక్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. 100 రోజుల పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై తుళ్లూరు పోలీసులు బుధవారం మంగళగిరి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2020లో మండలంలోని వెలగపూడిలో రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఓ మహిళ మృతిచెందింది. అప్పట్లో ఓ సామాజిక వర్గం రోడ్డుపై బైఠాయించి నందిగం సురేశ్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చాలని ధర్నా కూడా చేశారు. సదరు కేసుపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Sorry, no posts matched your criteria.