India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు జీజీహెచ్‌లో జింఖానా సహకారంతో నిర్మించిన కానూరి–జింఖానా మాతా శిశు సంరక్షణ భవనాన్ని ఈ నెల 30న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ ఏర్పాట్లను పరిశీలించి బందోబస్తు, ట్రాఫిక్, పారిశుద్ధ్యంపై అధికారులకు పలు సూచనలు చేశారు.

సంక్రాంతి నుంచి వెస్ట్ బైపాస్ రోడ్డులో ఒక భాగం అందుబాటులోకి రావడంతో గుంటూరు–మంగళగిరి మధ్య ట్రాఫిక్ కష్టాలు తగ్గాయి. కాజ నుంచి గుంటుపల్లి వరకు 3లేన్ల రహదారి తెరుచుకోవడంతో భారీ వాహనాలను బైపాస్ వైపు మళ్లిస్తున్నారు. దీంతో మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ నగరాల్లో జామ్‌లు తగ్గాయి. రెండు జిల్లాల పోలీసులు కాజ జంక్షన్ వద్ద నియంత్రణలు అమలు చేస్తున్నారు. మార్చి నాటికి మిగిలిన మార్గం పూర్తైతే సమస్య తీరనుంది.

గుంటూరు జిల్లాలో మిరప పంటపై నల్ల తామర, తెల్ల దోమ ఉధృతి తీవ్రంగా పెరిగింది. ఎన్ని మందులు పిచికారీ చేసినా పురుగులు అదుపులోకి రావడం లేదని రైతులు వాపోతున్నారు. పూత, కాయ దశలో తామర రసం పీల్చడంతో ఆకులు మాడిపోతూ, పువ్వులు రాలిపోతున్నాయి. లేత కాయలు గిడసబారి రంగు మారుతున్నాయి. ఎకరాకు 5 క్వింటాళ్లకు పైగా దిగుబడి తగ్గే అవకాశం ఉందని అంచనా. పెరిగిన సాగు ఖర్చులు, సరైన మందులు లేకపోవడం రైతులను మరింత కుంగదీస్తోంది.

అమరావతి ప్రాంతంలో ఉద్దండ రాయిని పాలెం సమీపంలో నిర్మిస్తున్న క్వాంటం వ్యాలీ భవనం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే CM చంద్రబాబు సూచనల మేరకు మరో రెండు భవనాలు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి నారాయణ రాయపూడి లో జరిగిన గ్రామసభలో చెప్పారు. రెండు భవనాలలో ఒకటి హైదరాబాదులోని హైటెక్ సిటీ మాదిరిగా 40 అంతస్తులతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

జిల్లా న్యాయసేవాధికార సంస్ధలో పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తెలిపారు. తమ దరఖాస్తులను గుంటూరు జిల్లా కోర్టులో అందే విధంగా రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ లో పంపించాలన్నారు. పోస్టులు, విద్యార్హత, ఇతర వివరాలను జిల్లా కోర్టు వెబ్సైట్‌ను http//Guntur.dcourts.gov.in ద్వారా పొందవచ్చని అన్నారు.

తెనాలి రామలింగేశ్వరపేటలో దారుణం చోటు చేసుకుంది. డిపో రోడ్డుకు చెందిన శిరీష (26)ను భర్త సాయి గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. భార్యపై అనుమానంతో కొద్ది రోజులుగా ఘర్షణ పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం గొడవ జరగడంతో ఆమెను గొంతు నులిమి పరారయ్యాడు. స్థానికులు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఏపీ సచివాలయ సీఎస్ఓ పి.వి.ఎస్.ఎన్.మల్లికార్జునరావుకు ప్రతిష్టాత్మక ‘ఇండియన్ పోలీస్ మెడల్’ (MSM) లభించింది. 36 ఏళ్ల క్రమశిక్షణాయుత సేవలకు గుర్తింపుగా, గణతంత్ర దినోత్సవం వేళ కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. కృష్ణా జిల్లాకు చెందిన మల్లికార్జునరావు గతంలో ఐటీబీపీ, ఏపీఎస్పీఎఫ్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీఎఫ్ అధికారులు ఆయన్ను అభినందించారు.

అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు ఈ నెల 29న ప్లాట్ల కేటాయింపు జరగనున్నట్లు మంత్రి నారాయణ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఇ- లాటరీ ద్వారా ప్లాట్లను నిబంధనల ప్రకారం లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. ఈ నెల 28కి బదులు 29వ తేదీన లాటరీ నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

APSRTC ITI అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తు చేసి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిన అభ్యర్థుల ఎంపిక జాబితాను apsrtc.ap.gov.in వెబ్‌సైట్‌లోని రిక్రూట్మెంట్ ట్యాబ్‌లో విడుదల చేశారు. గుంటూరు జిల్లాకు ఎంపికైన అభ్యర్థులు JAN 28న అవసరమైన ధ్రువపత్రాలతో జిల్లా ప్రజా రవాణాధికారి కార్యాలయం, గుంటూరులో హాజరుకావాలి. హాజరు కాని వారి స్థానంలో వెయిటింగ్ లిస్ట్ ఎంపిక జరుగుతుందని జిల్లా ప్రజా రవాణా అధికారి మాలతి తెలిపారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లలో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయం అయినప్పటికీ, స్వాతంత్ర్యం తర్వాత మన రాష్ట్రపతి, గవర్నర్లు దీనిని అధికారికంగా కొనసాగిస్తున్నారు. ఈ వేడుకలో పాలకులు, ప్రముఖులు, అధికారులతో గవర్నర్ తేనీటి విందులో పాల్గొంటారు. తాజాగా విజయవాడలో జరిగిన కార్యక్రమానికి గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
Sorry, no posts matched your criteria.